తెలంగాణ

telangana

ETV Bharat / technology

వెబ్‌పేజీలో కంటెంట్ వినాలనుకుంటున్నారా?- ఈ ఫీచర్​తో మీ కోరిక నెరవేరినట్లే! - listen to this page feature

Google Chrome Listen to This Page Feature: నిత్యం వార్తలను వివిధ వెబ్​సైట్​లలో చదువుతుంటాం. అయితే కొన్నిసార్లు చదివేందుకు మనకు వీలుపడదు. అలాంటి సమయంలో ఎవరైనా కంటెంట్​ను చదివి వినిపిస్తే బాగుండు అని అనిపిస్తుంది. అయితే అలాంటివారు ఇకపై వెబ్​పేజీలో వార్తలను వినొచ్చు. అదెలాగంటే?

Google Chrome Listen to This Page Feature
Google Chrome Listen to This Page Feature (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Sep 19, 2024, 11:55 AM IST

Updated : Sep 19, 2024, 12:01 PM IST

Google Chrome Listen to This Page Feature:వార్తల కోసమో, సమాచారం కోసమో నిత్యం వివిధ వెబ్‌సైట్‌లలో కంటెంట్‌ చదువుతూం ఉంటాం. ఎక్కువసేపు చదవాల్సిన సందర్భంలో, ప్రయాణ సమయంలో వార్తలను చదివేందుకు వీలుపడదు. అలాంటి సందర్భాల్లో ఎవరైనా కంటెంట్‌ను ‘చదివి వినిపిస్తే బాగుండు అని అనిపిస్తుంది. అయితే అలాంటివారు ఇకపై వార్తలను గూగుల్​ క్రోమ్​లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్​ ద్వారా వినొచ్చు. ఆండ్రాయిడ్‌లో గూగుల్‌ క్రోమ్‌ వాడుతున్న యూజర్స్ ఇక వెబ్‌పేజీలను చదవాల్సిన అవసరం లేకుండా క్రోమ్‌ బ్రౌజరే చదివి వినిపిస్తుంది. మరి దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

గూగుల్‌ క్రోమ్‌లో ఈ ఫీచర్​ను యాక్టివేట్ చేసుకోవటం ఎలా?:

  • ఏదైనా పేజీలో లాంగ్ ఆర్టికల్ చదవాల్సిన సందర్భంలో గూగుల్‌ తీసుకొచ్చిన 'లిజన్‌ టు దిస్‌ పేజ్‌' ఫీచర్ ఉపయోగపడుతుంది.
  • మొదట్లో ఇంగ్లిష్‌తో పాటు కొన్ని భాషలకే పరిమితమైన ఈఫీచర్‌ ఇప్పుడు తెలుగులోనూ లభిస్తోంది.
  • దీంతో ఇకపై మీకు నచ్చిన కంటెంట్‌ను ఎంచక్కా హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని వినొచ్చు.
  • ఉదాహరణకు ఈటీవీ భారత్ వెబ్‌సైట్‌లోని ఇదే వార్తను మీరు వినాలనుకుంటే మీ క్రోమ్‌ బ్రౌజర్‌లోని త్రీడాట్స్‌ మెనూపై క్లిక్‌ చేసి 'లిజన్‌ టు దిస్‌ పేజ్‌' ఆప్షన్​ను సెలక్ట్ చేసుకోండి.
  • దానిపై క్లిక్‌ చేయగానే మొదటి నుంచి చివరి వరకు ఆ పేజీలో మొత్తం టెక్ట్స్‌ను మీ వాయిస్‌ అసిస్టెంట్‌ చదివి వినిపిస్తుంది.
  • వాయిస్‌ అసిస్టెంట్‌ చదువుతున్నప్పుడు కంటెంట్​లో ఏ పేరా చదువుతుందో కూడా మనకు కనిపిస్తుంది.
  • కావాలంటే ఆడియో ఫాస్ట్‌ ఫార్వర్డ్‌/ బ్యాక్‌వర్డ్‌ చేసుకోవచ్చు.
  • మేల్‌/ ఫీమేల్‌ వాయిస్‌ను మార్చచుకోవచ్చు.
  • కంటెంట్​ను వేగంగా వినాలనుకుంటే 1X, 1.5X, 2X.. ఇలా స్పీడ్‌ను కూడా అడ్జస్ట్‌ చేసుకోవచ్చు.
  • మధ్యలో మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే పాజ్‌ చేసి తర్వాత మళ్లీ ప్లే చేసి కొనసాగించొచ్చు.
  • మీరు కంటెంట్​ను వినే సమయంలో స్క్రీన్‌ ఆన్‌లో ఉంచాల్సిన అవసరం కూడా లేదు. బ్యాగ్రౌండ్‌లోనూ దీన్ని ప్లే చేసుకోవచ్చు.
  • ఇకపై వెబ్​సైట్​ కంటెంట్​ వినాలనుకునేవారు గూగుల్‌ క్రోమ్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్​ను ట్రై చేయండి!
Last Updated : Sep 19, 2024, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details