WhatsApp Down: పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి వాట్సాప్ డౌన్ కారణంగా గందరగోళం నెలకొంది. దీంతో వాట్సాప్ వెబ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు దీనిపై పలువురు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' (గతంలో ట్విటర్) వేదికగా ఫిర్యాదులు చేశారు. వాట్సాప్ వెబ్‌లోకి లాగిన్ అవుతున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వాట్సాప్ వెబ్‌కు కనెక్ట్ కాలేకపోతున్నామని, మెసెజ్‌లను పంపించడంలో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారని వినియోగదారులు నివేదించారు.
Am I the only one experiencing Whatsapp web problems or is it down globally?
— Tonny Etern (@TonnyEtern) November 25, 2024
గ్లోబల్‌గా వాట్సాప్ అంతరాయం: ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్లు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాట్సాప్ వెబ్‌లోకి లాగిన్ అవుతున్నప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాట్సాప్ డౌన్ కారణంగా వాట్సాప్ వెబ్‌కు కనెక్ట్ చేయడంలో విఫలం అవుతోంది. అలాగే మెసెజ్‌లను పంపించడంలో కూడా సమస్య ఉంది. అయితే దీనిపై వాట్సాప్ సంస్థ మెటా ఇప్పటికీ స్పందించలేదు. ఈ సమస్యలకు గల కారణంపై ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు.
Whatsapp Web is down on a monday morning? pic.twitter.com/O5xLzP8aEB
— J (@Jahmu__) November 25, 2024
వాట్సాప్ పనిచేయడం లేదని డౌన్‌డెటెక్టర్ వెబ్‌సైట్ కూడా చెబుతోంది. ఈ వెబ్‌సైట్ ప్రకారం.. 57% మంది వాట్సాప్ వినియోగదారులు వెబ్‌లో సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు 35% మంది యాప్‌లో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఫోన్‌లో వాట్సాప్ బాగానే పనిచేస్తోంది. ఈ సమస్యలు కేవలం వెబ్ వెర్షన్‌లో మాత్రమే ఉన్నాయి. దీంతో దీనిపై ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు అందట్లేదు. అయితే ఆఫీస్ యూజర్స్, ప్రొఫెషనల్స్ మాత్రమే ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మీరు జియో సిమ్ వాడుతున్నారా?- ఈ స్పామ్ కాల్స్ బ్లాక్ సెట్టింగ్ మీకు తెలుసా?
ఐక్యూ నుంచి పవర్ఫుల్ స్మార్ట్ఫోన్లు- ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తానంటారు!