Homecoming of IPL Stars : సౌదీలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ మెగా వేలం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఇందులో ఎన్నో సర్ప్రైజింగ్ ఘటనలను కూడా క్రికెట్ లవర్స్ చూశారు. కొంత మంది ప్లేయర్స్ అనూహ్యంగా అన్‌సోల్డ్‌గా మిగలగా, మరికొందరేమో అధిక ధరకు కొత్త ఫ్రాంచైజీల బాట పట్టారు. మరికొందరేమో హోమ్ టీమ్స్‌కి తిరిగి వచ్చారు. ఇంతకీ వారెవరో చూద్దామా?
రవిచంద్రన్ అశ్విన్ :
గతేడాది రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఈ సారి మెగా వేలంలో చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అతడ్నీ ఆ జట్టు రూ. 9.75 కోట్లకు తీసుకంది. ఇందులో విశేషం ఏంటంటే 10 ఏళ్ల తర్వాత చెన్నై టీమ్‌కు అశ్విన్ రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో యెల్లో ఆర్మీ సంబరాలు చేసుకుంటున్నారు.
Yellove Bol. 💛#UngalAnbuden Ashwin 🦁#SuperAuction @ashwinravi99 pic.twitter.com/drAzxRBt5U
— Chennai Super Kings (@ChennaiIPL) November 24, 2024
జోఫ్రా ఆర్చర్ :
మెగా వేలంలోకి లాస్ట్ మినిట్‌లో వచ్చి భారీ ధరకు అమ్ముడుపోయాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్. తాజాగా జరిగిన ఆక్షన్‌లో అతడ్ని రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే 2018లో ఈ స్టార్ క్రికెటర్ ఈ జట్టు ద్వారానే తన ఐపీఎల్ తెరంగేట్రం చేశాడు. అప్పుడు రాజస్థాన్ తనను రూ.7.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మళ్లీ పింక్ టీమ్‌లోకి జోఫ్రా ఎంట్రీ ఇవ్వడం క్రికెట్ లవర్స్ ఎంతో ఆనందంగా అనిపిస్తోంది.
From @JofraArcher to the Royals fam, once again. Watch 💗 pic.twitter.com/R8zfE8HeRz
— Rajasthan Royals (@rajasthanroyals) November 24, 2024
ట్రెంట్ బౌల్ట్ :
న్యూజిలాండ్‌కి చెందిన ఈ స్టార్ క్రికెటర్‌ను తాజా వేలంలో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.12.5 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం (2020) ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రెంట్, ఆ తర్వాత 2021లో ఆ జట్టు నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్లీ ముంబయి జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు.
Boult, तुमचं पुन्हा स्वागत आहे 💙🙏#MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPLAuction pic.twitter.com/BiWpTDd2dB
— Mumbai Indians (@mipaltan) November 24, 2024
గ్లెన్ మ్యాక్స్‌వెల్ :
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ సారి పంజాబ్ కింగ్స్ గూటికి చేరుకున్నాడు. 10 ఏళ్ల క్రితం ఇదే జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ ఇప్పుడు రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసుకుంది.
Well, it’s the 𝐁𝐢𝐠 𝐒𝐡𝐨𝐰! 👊♥️#GlennMaxwell #IPL2025Auction #PunjabKings pic.twitter.com/YhxcZSrj3U
— Punjab Kings (@PunjabKingsIPL) November 25, 2024
సామ్ కరన్ :
2020లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన స్టార్ క్రికెటర్ సామ్ కరణ్ ఇప్పుడు మరోసారి అదే జట్టులోకి చేరాడు. ఈ సారి చెన్నై అతడ్ని రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది.
Look who's back in 💛#WhistlePodu #UngalAnbuden pic.twitter.com/pmN1jGWfzX
— Chennai Super Kings (@ChennaiIPL) November 26, 2024
భువనేశ్వర్ కుమార్ :
గతేడాది సన్‌రైజర్స్ సూపర్‌కింగ్స్‌లో మెరుపులు మెరిపించిన భువనేశ్వర్ కుమార్‌ను ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే 2009లో తన ఐపీఎల్ కెరీర్‌ను ఆర్సీబీతోనే స్టార్ట్ చేశాడు.
Certified match-winner with records to back it up! ❤️🔥
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 25, 2024
Bhuvi is all set to collect some more match balls, this time in the Red, Blue & Gold. 🫡@BhuviOfficial | #PlayBold #ನಮ್ಮRCB #IPLAuction #BidForBold #IPL2025 pic.twitter.com/XGTcS3FCl8
ఇండియన్ స్టార్స్‌కు బిగ్ షాక్ - వేలంలో అన్ సోల్డ్‌గా మిగిలిపోయిన ప్లేయర్స్ వీరే
IPL 2025 వితౌట్ వార్నర్ - అప్పుడు రైనా విషయంలోనూ ఇలానే - బాధపడుతోన్న ఫ్యాన్స్