ETV Bharat / offbeat

ఎప్పుడు చేసినా చపాతీలు గట్టిగా అవుతున్నాయా? - పిండిలో ఇవి కలిపితే సూపర్​ సాఫ్ట్​గా వస్తాయి! - BEST TIPS TO MAKE SOFT CHAPATI

-చపాతీలు స్మూత్​గా వచ్చేందుకు బెస్ట్​ టిప్స్​ -ఇవి పాటిస్తే గంటలపాటు సాఫ్ట్​గా

Best Tips to Make Soft Chapati
Best Tips to Make Soft Chapati (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2024, 1:26 PM IST

Best Tips to Make Soft Chapati : బరువు తగ్గేందుకు.. చపాతీని చాలా మంది బెస్ట్ ఆప్షన్​గా ఎంచుకుంటారు. అలాగే బీపీ, షుగర్​ వ్యాధితో బాధపడేవారు కూడా కనీసం రోజులో ఒకపూటైనా వీటిని ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే.. అందరికీ చపాతీలు చేయడం వచ్చినా.. కొద్ది మందికి మెత్తగా చేయడం రాదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. గట్టిగానే వస్తుంటాయి. టీవీ యాడ్స్​లో చూపించినట్లుగా మెత్తగా, ప్లఫీగా చేయడానికి ప్రయత్నిస్తారు కానీ.. సాధ్యం కాదు. దీంతో విసుగెత్తిపోతారు. అయితే.. పిండి కలిపేటప్పుడు ఈ పదార్థాలలో ఏ ఒక్కటి కలిపినా చపాతీలు మెత్తగా వస్తాయని అంటున్నారు నిపుణులు. మరి ఆ పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నెయ్యి : మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది నెయ్యి. అయితే నెయ్యి కేవలం ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా.. చపాతీలు మెత్తగా రావడానికి కూడా నెయ్యి దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చపాతీ పిండి కలిపేముందు అందులో కొద్దిగా గోరువెచ్చటి నెయ్యిని వేసి కలిపితే చపాతీలు సాఫ్ట్​గా వస్తాయని చెబుతున్నారు.

పెరుగు: పెరుగును మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాము. చపాతీలు మెత్తగా రావడానికి కూడా పెరుగు ఉపయోగపడుతుందని అంటున్నారు. కాబట్టి పిండిలో కొద్దిగా పెరుగు కలిపి ఓ గంటపాటు పక్కన పెట్టి ఆ తర్వాత చేసుకుంటే చపాతీలు సాఫ్ట్​గా వస్తాయని చెబుతున్నారు.

వేడి నీళ్లు: సాధారణంగా చాలా మంది చల్లటి నీళ్లతోనే పిండిని కలుపుతుంటారు. అయితే ఓసారి చల్లటి నీళ్ల బదులు వేడి నీళ్లు పోసి పిండి కలుపుకుంటే తేడా మీరే గమనించవచ్చంటున్నారు. వేడి నీటితో కలపడం వల్ల పిండి మృదువుగా మారి చపాతీలు మెత్తగా అవుతాయని వివరిస్తున్నారు.

నూనె: మెజార్టీ జనాలు గోధుమ పిండి కలిపేటప్పుడు అందులో నూనె వేస్తుంటారు. అయితే మామూలుగా కాకుండా గోరు వెచ్చగా ఉన్న నూనెను పోసి కలిపితే చపాతీలు మెత్తగా ఉంటాయని చెబుతున్నారు.

పాలు: పాలు కూడా చపాతీలు మెత్తగా రావడానికి సహాయపడతాయంటున్నారు. పిండి కలిపేటప్పుడు నీళ్లతో పాటుగా కొద్దిగా పాలు కూడా పోసి కలుపుకుంటే చపాతీలు మెత్తగా రుచికరంగా వస్తాయని అంటున్నారు.

బేకింగ్​ సోడా: సాధారణంగా అందరి వంటింట్లో బేకింగ్​ సోడా ఉంటుంది. దీన్ని ఎన్నో పనులకు ఉపయోగిస్తాం. అయితే అవే కాకుండా.. గోధుమపిండిలో అరచెంచా బేకింగ్ సోడాను కలపడం వల్ల కూడా చపాతీలు మెత్తగా వస్తాయని.. పొంగుతాయని కూడా చెబుతున్నారు.

జొన్న రొట్టెలు చేయడం రావట్లేదా? - ఈ సీక్రెట్‌ టిప్స్‌ పాటిస్తూ చేస్తే చపాతీ కంటే సూపర్​ సాఫ్ట్​!

రక్తహీనత సమస్యా? - ఇలా బీట్​ రూట్ చపాతీ చేసేయండి - అద్దిరిపోయే రుచి, అదనపు ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.