ETV Bharat / technology

ఐక్యూ నుంచి పవర్​ఫుల్ స్మార్ట్​ఫోన్లు- ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తానంటారు! - IQOO NEO 10

'ఐక్యూ నియో 10' సిరీస్ వచ్చేస్తున్నాయోచ్- రిలీజ్ ఎప్పుడంటే..?

iQOO Neo 10
iQOO Neo 10 (iQOO)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 25, 2024, 5:45 PM IST

iQOO Neo 10 Series: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఐక్యూ నియో 10' సిరీస్ మరో నాలుగు రోజుల్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ సిరీస్​లో 'ఐక్యూ నియో 10', 'ఐక్యూ నియో 10 ప్రో' మోడల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 29న ఇవి రిలీజ్​ కానున్నాయి. అయితే లాంఛ్​కు ముందే కంపెనీ Weiboలో దీని టీజర్​ను విడుదల చేసింది. సూపర్ కెమెరా సెటప్​తో ఈ సిరీస్ మొబైల్స్ రాబోతున్నట్లు సమాచారం.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సిరీస్​లో సోనీ IMX921 కెమెరా సెన్సార్ ఉంటుంది. ఇదే సెన్సార్ 'వివో X200'లో కూడా అమర్చారు. ఇది కస్టమ్-డిజైన్​తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కూడా కలిగి ఉంటుంది. 'వివో X200' అనేది కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫోన్. వివో ఇటీవలే ఈ సిరీస్​ను​ చైనా మార్కెట్లో లాంఛ్ చేసింది. ఇక ఐక్యూ కంపెనీ త్వరలో రిలీజ్ చేయబోతున్న తన స్మార్ట్​ఫోన్ కొన్ని సాంపుల్స్​ను కూడా పంచుకుంది. ఇందులో మరెన్నో అద్భుతమైన ఫీచర్లను చూడొచ్చు.

స్పెసిఫికేషన్స్: 'ఐక్యూ నియో 10' స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇందులో ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్​ను అమర్చారు. 'ఐక్యూ నియో 10 ప్రో' మొబైల్​లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ఉండొచ్చు. ఇది LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజీతో వస్తుంది.

కలర్ ఆప్షన్స్: ఇవి మూడు కలర్ ఆప్షన్స్​లో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

  • ఎక్స్‌ట్రీమ్ షాడో బ్లాక్
  • ర్యాలీ ఆరెంజ్
  • వైట్

8T LTPO డిస్​ప్లే ప్యానెల్: ఈ ఫోన్​లో ఇన్​-హౌస్ Q2 చిప్​ కూడా ఉంటుంది. ఇది గేమింగ్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. అంతేకాక ఇది సూపర్-రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్ ఇంటర్‌పోలేషన్​తో కూడా రావొచ్చు. ఈ రెండు మోడల్స్ 8T LTPO డిస్‌ప్లే ప్యానెల్‌లను కలిగి ఉంటాయి. ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ 'ఐక్యూ నియో 9' సిరీస్ నుంచి అప్‌గ్రేడ్ అవుతుంది. ఇందులో 6100mAh బ్యాటరీ ఉంటుంది. డివైజ్ 7.99mm మందంతో 199 గ్రాముల బరువుతో ఎంట్రీ ఇవ్వనుంది.

మీరు జియో సిమ్ వాడుతున్నారా?- ఈ స్పామ్​ కాల్స్ బ్లాక్ సెట్టింగ్ మీకు తెలుసా?

పినాక మిస్సైల్ కోసం క్యూ కడుతున్న దేశాలు.. దీని స్పీడు చూస్తే శత్రువులకు హడల్..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.