High Risk Warning for Apple Users: యాపిల్ యూజర్లకు అలర్ట్. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఐఫోన్, ఇతర యాపిల్ డివైజ్‌ల వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పాత సాఫ్ట్వేర్ వెర్షన్‌తో పనిచేసే డివైజ్‌లకు ఈ అలర్ట్ ప్రకటించింది.
ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి వాటిని వినియోగించే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరించింది. వీటిలో తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఇవి సైబర్ నేరాలను ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొంది. దీంతో తమ డివైజ్‌లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సూచించింది.
ఏ డివైజ్‌లకు ఈ హెచ్చరిక?: యాపిల్ పాత సాఫ్ట్వేర్ వెర్షన్‌తో పనిచేసే డివైజ్‌లకు ఈ హెచ్చరికలు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, సఫారీ వంటి ప్రొడక్ట్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
- iOS: 18.1.1 కంటే పాత వెర్షన్స్
- iPadOS: 17.7.2 కంటే పాత వెర్షన్స్
- macOS: 15.1.1 కంటే పాత వెర్షన్స్
- సఫారి: 18.1.1 కంటే పాత వెర్షన్స్
వీటిలో మీ వద్ద ఉన్న యాపిల్ డివైజ్ పాత వెర్షన్‌తో రన్ అవుతున్నట్లయితే అది సైబర్ బెదిరింపులకు గురయ్యే అవకాశం ఉంది.
వెంటనే అప్డేట్ చేయండి: CERT-In నివేదిక ప్రకారం.. యాపిల్ డివైజెస్‌లోని పాత సాఫ్ట్‌వేర్‌లో కొన్ని బగ్స్ గుర్తించారు. ఇది సైబర్ మోసాలను ప్రోత్సహిస్తుంది. ఈ యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న యూజర్ల అనుమతి లేకుండానే హ్యాకర్లు.. వారి డివైజెస్‌ను హ్యాక్ చేసే అవకాశం ఉంది. దీంతో డేటా మొత్తం చోరీ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ డివైజెస్‌ను వెంటనే తాజా వెర్షన్‌కి అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. ఒకవేళ మీ డివైజెస్‌కు సాఫ్ట్వేర్ అప్డేట్ అందుబాటులో లేకుంటే మీరు కొత్త పరికరాన్ని కొనుగోలు చేయడం మంచిది.
అప్డేట్ చేయడం ఎలా?: మీ ఐఫోన్‌ను అప్డేట్ చేయాలనుకుంటే ఇలా ఈజీ స్టెప్స్ ఫాలో అవ్వండి.
- Settings: మొదట మీ ఐఫోన్లో 'Settings' యాప్‌ను ఓపెన్ చేయండి.
- General: అందులో 'General' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- Software Update: ఇప్పుడు 'Software Update' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
- Download and Install: మీ ఐఫోన్‌కు అప్డేట్ అందుబాటులో ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా మీ ఐఫోన్‌ను అప్డేట్ చేసుకోవచ్చు.
జోరుమీదున్న టాటా మోటార్స్- మరో మూడు కార్లను లాంఛ్ చేసేందుకు కసరత్తు
పరేషాన్ చేస్తున్న వాట్సాప్- ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు!