Huge Job Opportunities in Semi Conductor Industry : కొన్ని విషయాల గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా కొంత మిగిలేవుంటుంది. అలాంటి వాటిలో సెమీ కండక్టర్ రంగం ఒకటి. ఎన్ని విధాలుగా పరిశీలించినా రానున్న కాలంలో ఈ రంగం మహోజ్వలంగా వెలిగిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, ఉద్యోగాల కంచుకోటగా ఎదగనున్న సెమీ కండక్టర్ పరిశ్రమలో ఎలా పాగా వేయాలో ఈ స్టోరీలో చూద్దాం!
ఏదైనా కంపెనీలో ఉద్యోగం సాధించి అక్కడే రాణించాలి అనుకుంటే ముందుగా చూసుకోవలసింది ఏంటంటే, ఆ పరిశ్రమ పది కాలాల పాటు పచ్చగా ఉంటుందా లేదా అని. పరిశ్రమ కళకళలాడుతుంటే దానిలో అంతర్భాగమైన కంపెనీలు ఎలాంటి అడ్డంకులు లేని గుర్రాలు పరుగెడతాయి. ఉద్యోగాలు జీవితాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారతాయి. సెమీ కండక్టర్ పరిశ్రమకు సరిగ్గా అలాంటి అవకాశాలే ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా భారత్‌లో ఏటా ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీల నుంచి చదువుకొని పట్టభద్రులవుతున్నవారు అత్యధికం. ఈ విషయంలో బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, అమెరికా, జర్మనీ, ఇజ్రాయిల్ దేశాలకంటే భారత్ ముందుంది. ప్రతి సంవత్సరం పాతిక లక్షలమంది ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులు డిగ్రీ పట్టాలు పొందుతున్నారు.
'ఐటీ హబ్-2'కు శ్రీకారం చుట్టి మూడేళ్లు - రూ.36 కోట్లతో పనులు ప్రారంభించిన కనిపించని పురోగతి
ఇంతగా పట్టాభద్రులు లభిస్తున్నందున డిమాండ్ - సప్లై సిద్ధాంతం ఆధారంగా మానవ వనరులపై పెట్టుబడి క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా ఉత్పత్తి వ్యయంపై ఒత్తిడి తగ్గుతుంది. దానితో సెమీ కండక్టర్ మార్కెట్‌లో ఇండియా ఉత్పత్తులు సరసమైన ధరలతో ఇప్పటికే పాతుకుపోయిన కంపెనీలకు గట్టి పోటీనిస్తాయి. వినియోగదారులకు చివరిగా కావాల్సింది తక్కువ ధర, నాణ్యమైన ఉత్పత్తి. ఈ విషయంలో భారతీయ ఉత్పత్తుల ధగధగలాడుతుంటాయి.
సెమీ కండక్టర్ పరిశ్రమకు కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలు మనదేశానికి ఉండటం మరో ముఖ్యమైన అంశం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహకాలతో పాటు ఆసియా, యూరప్, మధ్యప్రాచ్య దేశాలను భారత్ సమీపంగా ఉండడం వల్ల రవాణాలో చాలావరకు ఖర్చు నియంత్రణలో ఉంటుంది. ఈ కారణం చేతనే సెమీ కండక్టర్ల ఉత్పత్తి కేంద్రాలను ఇండిలోనే ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ పరిశ్రమ సక్రమంగా నడవాలంటే కేవలం పెట్టుబడి మాత్రమే ఉంటే సరిపోదు. విద్యాధికుల లభ్యత, నైపుణ్యం గల యువత అందుబాటులో ఉండాలి. పరిశోధన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు, ప్రభుత్వ రాయితీలు ముఖ్యం. ప్రస్తుతం ఇండియాలో వీటన్నింటీతో బలమైన ఉత్పత్తి వ్యవస్థ సిద్ధంగా ఉండటం ఈ పరిశ్రమకు కలిసొచ్చే అంశం.
కనీస అర్హత ఉన్నా విదేశాల్లో మీకు లక్షల జీతంతో జాబ్ గ్యారెంటీ - ఎలాగో తెలుసుకోండి
సెంట్రల్ గవర్నమెంట్ సెమీ కండక్టర్ మిషన్ రెండో దశను త్వరలో ప్రకటించనుంది. తయారీలో ముడి సరుకు, వివిధ విభాగాల లభ్యత పెంపొందించడంపై సర్కార్ దృష్టి సారించనుంది. దీంతో కొత్త సెమీ కండక్టర్ కంపెనీలు అడుగిడుతున్నాయి. ఫలితంగా 2026 సంవత్సరానికి ఈ పరిశ్రమలో పది లక్షల ఉద్యోగాల అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ పరిశ్రమలో అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కెటింగ్, ప్యాకేజింగ్, చిప్ డిజైన్, సాఫ్ట్‌వేర్ డెవలెప్‌మెంట్, సిస్టమ్ సర్యూట్లు, మాన్యూఫ్యాక్చరింగ్, సప్లయి చెయిన్ విభాగాల్లో ఉద్యోగావకాశాలు మెండుగా రానున్నాయి.
విద్యార్హతల సాధన : ఎదురుగా జీవనది ప్రవహిస్తుందన్న విషయం మనుకు తెలుసు అలాగే కావలసిన పాత్ర తీసుకెళితేనే కదా కావల్సినంత మంచినీరు తెచ్చుకోగలిగేది. అంటే సెమీ కండక్టర్ రంగంలో రానున్న ఉద్యోగాలు అపారమని తెలుసు కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రంగంలోకి దిగేది ఎలా?
ఈ రంగం సాంకేతిక విజ్ఞానం ఆధారంగా నిర్వహించేది. ప్రవేశించేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు చేయాలి. దీంట్ల ఓ పొజిషన్ ఆశిస్తున్నారో దానికి తగ్గ కోర్సులో చేసి సిద్ధంగా ఉండాలి.
టెక్నాలజీపై అవగాహన అవసరం : అకడమిక్ అర్హత మాత్రమే ఈ రంగంలో పెద్ద ప్యాకేజీని ఇవ్వదు. క్యాంపస్‌లో చదువులతో పాటు క్యాంపస్‌లో చేసిన ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్‌షిప్ వంటివి చేసి కొంత అనుభవం గడిస్తే పరిశ్రమలో ప్రవేశించేందుకు అంతగా శ్రమ పడాల్సిన అవసరం రాదు.
సెమీ కండక్టర్ తయారీలో చిప్ డిజైనింగ్ నుంచి సిలికాన్ ముడి సరకుగా లాస్ట్ ప్రొడక్ట్ వరకూ వివిధ దశలుంటాయి. అందువల్ల టెక్నాలజీ మాత్రమే కాక శాస్త్రీయ దృక్పథం ముఖ్యం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్‌పై కూడా అవగాహన వుంటే ఉద్యోగంలో రాణించడానికి ఎలాంటి ఢోకా ఉండదు.
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు ఉపయోగపడతాయంటే :చిప్ తయారీ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్ వరకూ ప్రతి దశలోనూ ప్రోగ్రామ్స్ లేదా సాఫ్ట్‌వేర్ రూపకల్పన అవసరం. అందువల్ల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై పట్టు ఉండాలి. ముఖ్యమైన లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. చిప్ తయారీ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్ వరకు ప్రతి దశలోనూ ప్రోగ్రామ్స్ లేదా సాఫ్ట్‌వేర్ రూపకల్పన ముఖ్యం.
మల్టీ టాస్కింగ్ అవసరం : కొత్త రంగంలోకి ప్రవేశించేటప్పుడు ఒకే ఒక టాస్క్ చేసి కూర్చోవడం కుదరని పని. భారీ కంపెనీలు అయితే ఈ వైఖరి నప్పుతుందమో కానీ మధ్య, చిన్న తరహా కంపెనీల్లో ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేటప్పుడు ఒకటికి మంచిన టాస్కులు చేయగలిగి ఉండాలి. అలా చేయడం వల్ల అప్పుడే చేరిన ఉద్యోగంలో మనుగడా, గుర్తింపు లభిస్తుంది.
ఈ కాలేజీలో సీటు దొరికితే ఉద్యోగం వచ్చినట్లే! - కోర్సు పూర్తయ్యే నాటికి చేతిలో కొలువు పక్కా!!
డిగ్రీ, బీటెక్ అర్హతతో ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు - చివరి తేదీ ఎప్పుడంటే?