తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీ ఫోన్​ పోయిందా? డోంట్ వర్రీ - స్విఛ్ ఆఫ్​లో ఉన్నా ఈజీగా కనిపెట్టేయండిలా! - Missing Mobile Tracking

How To Track Lost Phone : మీ స్మార్ట్​ఫోన్​ పోయిందా? పైగా అది స్విఛ్ ఆఫ్ అయిపోయిందా? డోంట్ వర్రీ! ఫోన్​ స్విఛ్ ఆఫ్​ అయిపోయినా సరే, దానిని సులువుగా కనిపెట్టేయవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

How To Track Lost Phone
How To Track Lost Phone (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 2:46 PM IST

How To Track Lost Phone : స్విఛ్​ ఆఫ్​ అయిన స్మార్ట్‌ఫోన్ లొకేషన్‌ను కచ్చితత్వంతో తెలుసుకోవడం అనేది సాంకేతికంగా అసాధ్యం. కానీ ఫోన్ స్విచ్ఛాప్ అయ్యే సమయానికి ఉన్న లొకేషన్‌ను గుర్తించగలిగే టెక్నాలజీ మాత్రం అందుబాటులో ఉంది. ఇందుకోసం మనం గూగుల్​కు చెందిన 'ఫైండ్​ మై డివైజ్' అనే ఫీచర్‌ను వాడుకోవచ్చు. ఫోన్ దొంగతనానికి గురైనా, లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఫోన్‌ను మర్చిపోయినప్పుడు కూడా ఈ 'ఫైండ్​ మై డివైజ్' అనే యాప్ లేదా వెబ్‌సైట్‌ ద్వారా మనం ఫోన్‌ను ట్రాక్ చేయొచ్చు. ఫోన్ ఉన్న లొకేషన్‌ను అది మనకు చూపిస్తుంది. అయితే ఆ ఫోనులో వాడుతున్న జీమెయిల్ అకౌంటుతోనే ఈ యాప్ లేదా వెబ్‌సైట్‌‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫోన్‌ స్విఛ్ ఆఫ్​ అయినప్పటికీ మనం పోగొట్టుకున్న సమయానికి ఇంటర్నెట్ ఆన్‌లో ఉంటే, దాని లొకేషన్‌ను 'ఫైండ్​ మై డివైజ్' ద్వారా ఈజీగా ట్రాక్​ చేయొచ్చు.

ఐఫోన్​ను కూడా కనిపెట్టేయవచ్చు!
ఐఫోన్​ వినియోగదారులు ఐక్లౌడ్​ వెబ్​సైటులోకి వెళ్లి 'లాస్ట్ మోడ్​'ను యాక్టివేట్ చేయాలి. వెంటనే ఫోన్​ స్విఛ్ ఆఫ్​ కాక ముందటి లొకేషన్‌ మన ఎదుట ప్రత్యక్షం అవుతుంది. ఐఫోన్ వినియోగదారులు ఐక్లౌడ్ ఫీచర్‌ ద్వారా, తమ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక శాంసంగ్ మొబైల్​ యూజర్లు తమ డివైజ్​లోని 'స్మార్ట్‌థింగ్స్ ఫైండ్ ఫీచర్‌'ని ఉపయోగించుకుని, పోగొట్టుకున్న ఫోన్లను ట్రాక్ చేయొచ్చు. అయితే ఈమెయిల్, ఫోన్ నంబర్​ల ద్వారా ఈ ఫీచర్‌లో మనం రిజిస్టర్ చేసుకొని ఉండాలి.

IMEI నంబర్​ ఉంటే చాలు
ఇక ఇంటర్నెట్ కనెక్టివిటీతో సంబంధం లేకున్నా, పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌ను ట్రాక్ చేయాలంటే ఐఎమ్​ఈఐ నంబరు కావాలి. ఈ రకమైన ట్రాకింగ్‌ను పోలీసులు, సంబంధిత దర్యాప్తు విభాగాలు చేస్తాయి. ఇందుకోసం మనం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫోన్ ఎక్కడ పోగొట్టుకున్నాం? ఎలా పోగొట్టుకున్నాం? అనేది వారికి తెలియజేయాలి. మన ఫోనును దొంగిలించిన వ్యక్తి అందులో వేరే సిమ్ కార్డ్​ వేసుకున్నా ఈ ఐఎమ్​ఈఐ నంబరు ద్వారా ట్రాక్ చేసేయవచ్చు.

ట్రాఫిక్ చలాన్ తప్పించుకోవాలా? గూగుల్​ మ్యాప్స్​లోని ఈ 2 ఫీచర్లను ఎనేబుల్ చేసుకోండి! - IPhone Google Maps Features

వాట్సాప్ నయా ఫీచర్ - ఇకపై వాయిస్​ మెసేజ్ వినే పనిలేదు - నేరుగా​​ టెక్ట్స్​ చదివేయడమే!

ABOUT THE AUTHOR

...view details