ETV Bharat / technology

గ్లోబల్​ మార్కెట్​లోకి మొట్ట మొదటి ట్రై ఫోల్డ్ ఫోన్- ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! - HUAWEI MATE XT ULTIMATE DESIGN

గ్లోబల్​ మార్కెట్​లోకి 'హువావే మేట్ XT అల్టిమేట్ డిజైన్' వచ్చేసిందోచ్- ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

Huawei Mate XT Ultimate Design Launched Globally
Huawei Mate XT Ultimate Design Launched Globally (Photo Credit- Huawei)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 19, 2025, 6:56 PM IST

Updated : Feb 19, 2025, 7:34 PM IST

Huawei Mate XT Ultimate Design Launched: హువావే నుంచి ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్ ఎట్టకేలకూ గ్లోబల్​గా లాంఛ్ అయింది. 'హువావే మేట్ XT అల్టిమేట్ డిజైన్' పేరుతో కంపెనీ దీన్ని గ్లోబల్​ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్​ను 2024లోనే తన దేశీయ మార్కెట్​లో అంటే చైనాలో కంపెనీ లాంఛ్ చేసింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని మార్కెట్​లలోకి దీన్ని తీసుకొచ్చింది.

'హువావే మేట్ XT అల్టిమేట్ డిజైన్' గ్లోబల్ వెర్షన్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్:

డిస్​ప్లే: ఈ ఫోన్​ను పూర్తిగా విప్పినప్పుడు 10.2-అంగుళాల ఫ్లెక్సిబుల్ LTPO OLED డిస్​ప్లేను కలిగి ఉంది. దీన్ని ఒకసారి మడతపెట్టినప్పుడు 7.9-అంగుళాల LTPO OLED డిస్​ప్లే ఫోల్డబుల్ పరికరాన్ని కలిగి ఉంది. ఇది రెండుసార్లు మడతపెట్టినప్పుడు 6.4-అంగుళాల LTPO OLED డిస్​ప్లేకు తగ్గిస్తుంది. ఇక ఈ ఫోన్ స్క్రీన్ 90 Hz వరకు అడాప్టివ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 240 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 1440 Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, 382 PPI పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది.

వేరియంట్స్: కంపెనీ ఈ ఫోన్​ గ్లోబల్ వెర్షన్​ను కేవలం ఒకే 16GB RAM + 1TB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో తీసుకొచ్చింది.

చిప్‌సెట్ అండ్ స్టోరేజ్: చైనాలోని మేట్ XT అల్టిమేట్ డిజైన్​లో కంపెనీ ఇన్-హౌస్ కిరిన్ 9010 చిప్‌సెట్​ను అందించింది. అయితే ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ గ్లోబల్ వెర్షన్​ చిప్‌సెట్ వివరాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ UAE సైట్ ఈ ఫోన్ 16GB RAM అండ్ 1TB స్టోరేజ్​తో జతయి "మోడ్రన్ ప్రాసెసర్"ను కలిగి ఉన్నట్లు మెన్షన్​ చేసింది.

కెమెరా: 'మేట్ XT అల్టిమేట్ డిజైన్' ట్రై ఫోల్డ్​ ఫోన్ వెనక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OIS అండ్ f/1.2 అండ్ f/4.0 మధ్య వేరియబుల్ ఎపర్చరుతో 50MP మెయిన్ సెన్సార్​ను కలిగి ఉంది. అంతేకాక ఈ ఫోన్​లో f/2.2 ఎపర్చరుతో 12MP అల్ట్రావైడ్ సెన్సార్​తో పాటు 5.5x ఆప్టికల్ జూమ్, OIS, f/3.4 ఎపర్చరు సపోర్ట్​తో 12MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. ఇక దీని ఫ్రంట్​ కెమెరా f/2.2 ఎపర్చరుతో 8MP సెన్సార్‌ను కలిగి ఉంది.

బ్యాటరీ: ఇది 66W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్​తో 5,600mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఆపరేటింగ్ సిస్టమ్: ఈ కొత్త 'మేట్ XT అల్టిమేట్ డిజైన్' ఫోన్ EMUI 14.2 అవుట్-ఆఫ్-ది-బాక్స్ పై నడుస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్​తో వస్తుంది.

ఫోన్​ వెయిట్: ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ కొత్త ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్ 298 గ్రాముల బరువు ఉంటుంది.

కలర్ ఆప్షన్స్: ఈ ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్ రెండు రంగుల్లో లభిస్తుంది.

  • రెడ్
  • బ్లాక్

ధర: UAEలో AED 12,999 అంటే దాదాపు రూ.3.07 లక్షలు.

సేల్ డీటెయిల్స్: ఈ ఫోన్​ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. దీని డెలివరీలు ఫిబ్రవరి 25, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి.

'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్'- ఇకపై AI టెక్నాలజీ మరింత యూజ్​ఫుల్​!

జియో యూజర్లకు గుడ్​న్యూస్- ఆ రీఛార్జ్​ ప్లాన్​తో 'జియోహాట్​స్టార్'​ ఫ్రీ యాక్సెస్!

టెస్లా భారత్​కు వస్తోందా?- ఇది ఎంతవరకూ నిజమంటే?

Last Updated : Feb 19, 2025, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.