How To Overcome Phone Addiction :ఇప్పుడంతా డిజిటల్ హవా నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్స్ మన జీవితాన్ని మార్చేస్తున్నాయి. కూర్చున్న చోటే మనకు కావాల్సిన సమాచారాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి. ఎవరితో అయినా సులభంగా మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే స్మార్ట్ఫోన్లను పరిధికి మించి ఉపయోగిస్తే, ఎన్నో మానసిక, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీ ప్రొడక్టివిటీ, రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటాయి. అందుకే ఈ స్మార్ట్‌ఫోన్ అడిక్ట్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
1. అవగాహన ముఖ్యం :మీరు ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ బానిసలుగా మారినట్లయితే, ముందుగా దానికి గల కారణాలను తెలుసుకోండి. మీరు ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల మీరు చేయాల్సిన పనులకు ఏవిధంగా అంతరాయం ఏర్పడుతుందో పరిశీలించండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సంబంధాలను ఫోన్ వాడకం ఏవిధంగా ప్రభావితం చేస్తుందో కూడా చూసుకోండి. దీని వల్ల మీ సమస్యను మీరే గ్రహించగలుగుతారు. మరీ అవసరమైతే వేరొకరి సహాయం కూడా తీసుకోండి. అందులో తప్పేమీ లేదు.
2. సరైన లక్ష్యాలు :మీరు స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు సరైన లక్ష్యాలను ఏర్పరుచుకోండి. మీ స్క్రీన్ సమయాన్ని చాలా వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఫోన్‌ను మ్యూట్‌లో పెట్టుకోవడం మంచిది. అలాగే రాత్రి పడుకునే ముందు ఫోన్‌ను సైలెంట్లో పెట్టుకోండి.
3. మానిటరింగ్ యాప్స్ :మనం ప్రతిరోజూ ఎంత సమయం ఫోన్ ఉపయోగిస్తున్నామనే విషయాన్ని గుర్తించే యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దీనికోసం ప్లేస్టోర్‌లో బోలేడు యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక మంచి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, ఫోన్ యుసేజ్ టైమ్‌ను సెట్ చేసుకోండి. ఆ సమయం పూర్తవ్వగానే మీకు అలర్ట్ వస్తుంది. దీంతో మీరు వెంటనే ఫోన్ వాడకాన్ని ఆపేయడానికి వీలవుతుంది.
4. ఫోన్-ఫ్రీ జోన్‌లను క్రియేట్ చేసుకోండి :డైనింగ్ టేబుల్ లేదా బెడ్‌రూమ్ వంటి కొన్ని ప్రాంతాలను ఫోన్-ఫ్రీ జోన్‌లుగా మార్చుకోండి. ఈ విధంగా మీకు మీరే సరిహద్దులను ఏర్పరచుకోండి. ఇది మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా, తర్వాత క్రమంగా అలవాటుగా మారుతుంది.
5. స్క్రీన్-ఫ్రీ టైమ్ సెట్ చేయండి :భోజనం చేసే సమయంలో, నిద్రించే ముందు ఫోన్ వాడకూడదని చాలా మందికి తెలుసు. కానీ ఇలాంటి సమయాల్లోనే చాలా మంది ఫోన్లు వాడుతుంటారు. ఫలితంగా మనం తిన్న ఆహారం ఒంటికి పట్టదు. అంతేకాదు నిద్రించేప్పుడు ఫోన్ చూస్తే నిద్రలేమి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.