తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఇన్​స్టాగ్రామ్​లో డబ్బులు సంపాదించాలా? టాప్​-6 స్ట్రాటజీస్ ఇవే! - How To Make Money On Instagram - HOW TO MAKE MONEY ON INSTAGRAM

How To Make Money On Instagram : మీరు కంటెంట్ క్రియేటరా? ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్ చేస్తూ డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇన్​స్టాగ్రామ్​లో 6 విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Instagram
Instagram (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 3:12 PM IST

How To Make Money On Instagram :సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో ఇన్​స్టాగ్రామ్​కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీల్స్​ చేస్తూ చాలా మంది దీంట్లో సెలబ్రిటీలు కూడా అయిపోతున్నారు. యూజర్లు అయితే తమకు నచ్చిన రీల్స్​ను, కంటెంట్​ను గంటలు తరబడి చూస్తూనే ఉంటారు. ఇందుకే ఈ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ కంటెంట్ క్రియేటర్లకు స్వర్గధామంగా మారింది. వీళ్లు ఇన్​ఫ్లూయెన్సర్లుగా మారి లక్షలాది రూపాయలు (కొందరైతే కోట్లాది రూపాయలు) సంపాదిస్తున్నారు. మరి మీరు కూడా వీళ్లలానే ఇన్​స్టాగ్రామ్​ ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే.

How To Earn Money On Instagram : ఇన్​స్టాగ్రామ్​లో 6 విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. స్పాన్సర్డ్​ కంటెంట్​ పార్టనర్​షిప్​ : మనం ఇన్​స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు #Ads, #sponsored పేరుతో ఫొటోలు, వీడియోలు, రీల్స్ కనిపిస్తుంటాయి. వీటిని ఇన్​స్టాగ్రామ్ ఇన్​ఫ్లూయెన్సర్లు తమ అకౌంట్​లో పోస్ట్​ చేస్తుంటారు. ఇలా చేసినందుకు సదరు యాడ్స్​ ఇచ్చిన కంపెనీలు, ఇన్​ఫ్లూయెన్సర్లకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తాయి.

సింపుల్​గా చెప్పాలంటే, ఇన్​స్టాగ్రామ్​ ఇన్​ఫ్లూయెన్సర్లు - బ్రాండ్స్​తో, కంపెనీలతో కొలాబరేట్ అయ్యి, వారి ప్రొడక్టులను, సర్వీస్​లను తమ ఫాలోవర్స్​కు చూపిస్తారు. దీని వల్ల కంపెనీల సేల్స్ పెరుగుతాయి. ప్రతిఫలంగా ఇన్​ఫ్లూయెన్సర్​కు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తారు..

2. అఫిలియేట్​ పార్టనర్​షిప్​ : ఇన్​స్టాగ్రామ్ ఇన్​ఫ్లూయెన్సర్లు అఫిలియేట్ పార్టనర్​షిప్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తారు. సింపుల్​గా చెప్పాలంటే, ఇన్​స్టాగ్రామ్ ఇన్​ఫ్లూయెన్సర్లు వివిధ బ్రాండ్లు, కంపెనీలు, ఈ-కామర్స్​ పోర్టల్స్​ నుంచి అఫిలియేషన్​ తీసుకుంటారు. తమ ఇన్​స్టా పేజ్​లో వారి ప్రొడక్టులు, సర్వీసులు కొనమని చెబుతూ రిఫరల్ లింక్స్​, డిస్కౌంట్ కోడ్స్​ పిన్ చేసి ఉంచుతారు. దీని వల్ల వారికి కమీషన్ రూపంలో వారికి భారీగా డబ్బులు వస్తాయి. ఒక లెక్క ప్రకారం, ఇన్​స్టాగ్రామ్ ఇన్​ఫ్లూయెన్సర్లు అఫిలియేట్​ పార్టనర్​షిప్​ ద్వారా ఒక్కో ప్రొడక్ట్​/ సర్వీస్​ల​పై 5 శాతం నుంచి 30 శాతం వరకు డబ్బులు సంపాదిస్తుంటారు.

3. బోనస్​ ఇన్సెంటివ్స్​ :ఇన్​స్టాగ్రామ్ తమ క్రియేటర్ల కోసం ఇన్సెంటివ్​ ప్రోగ్రామ్​ను కూడా రన్ చేస్తోంది. దీని ద్వారా ఇన్​ఫ్లూయెన్సర్లు తమ ఇన్​స్టా పేజ్​లో పోస్టులు పెట్టి, బోనస్​ల రూపంలో డబ్బులు సంపాదిస్తుంటారు. భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న ఇన్​ఫ్లూయెన్సర్లకు దీని ద్వారా బాగా ఆదాయం వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సదుపాయం​ కేవలం ఇన్​స్టా బిజినెస్​, క్రియేటర్ అకౌంట్స్​కు మాత్రమే అందుబాటులో ఉంది.

4. యూజర్-జనరేటెడ్ కంటెంట్​ : సాధారణంగా కంటెంట్ క్రియేటర్లు సొంతంగా రీల్స్ చేస్తూ ఉంటారు. వీటిని చూసి చాలా మంది వారికి ఫాలోవర్లు అవుతారు. ఈ ఫాలోయింగ్​ను కంపెనీలు మరో విధంగా క్యాష్ చేసుకుంటాయి. నేరుగా ప్రకటనలు ఇవ్వకుండా, సదరు ఇన్​ఫ్లూయెన్సర్​ చేతనే రీల్​ను లేదా పోస్ట్​ను క్రియేట్ చేయిస్తాయి. వీటిని వారి ఇన్​స్టా పేజ్​లో పోస్ట్ చేయిస్తాయి. అంటే ఆర్గానిక్-స్టైల్ కంటెంట్​ను క్రియేట్ చేయిస్తాయి. దీని వల్ల ఇన్​డైరెక్ట్​గా తమ ప్రొడక్టులను, సర్వీస్​లను ప్రమోట్ చేస్తాయి. ఇక్కడే ఇన్​ఫ్లూయెన్సర్లు భారీగా డబ్బులు సంపాదిస్తుంటారు. కంటెంట్ వారే సొంతంగా క్రియేట్ చేస్తారు కాబట్టి, భారీ స్థాయిలో డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటూ ఉంటారు.

5. డొనేషన్స్​ & గిఫ్ట్స్​ : ఇన్​ఫ్లూయెన్సర్లు నేరుగా తమ ఆడియన్స్ నుంచి డొనేషన్స్​, గిఫ్ట్స్​ తీసుకునే వెసులుబాటును ఇన్​స్టాగ్రామ్ కల్పిస్తోంది. ఎలా అంటే, యూజర్లు 'stars' కొనుగోలు చేసి, వర్చువల్ గిఫ్ట్స్ కొని ఇన్​ఫ్లూయెన్సర్​కు ఇవ్వవచ్చు. ఒక స్టార్​ విలువ 0.01 డాలర్​ (రూ.0.82) వరకు ఉంటుంది.

6. రీల్స్​ ద్వారా : ఇన్​స్టాగ్రామ్​లో 30 సెకెన్ల నిడివి గల రీల్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది తమ సొంత ప్రొడక్టుల గురించి రీల్స్ చేస్తారు. దాని కింద కాల్​-టూ-యాక్షన్​ (CTA) ఉంచుతారు. దీని ద్వారా ఎవరైనా ప్రొడక్టు కొంటే, ఆ డబ్బులు నేరుగా క్రియేటర్ అకౌంట్​లో పడతాయి. ఈ విధంగానూ ఇన్​స్టాగ్రామ్ ఇన్​ఫ్లూయెన్సర్​లు భారీగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.

నోట్​ : సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేయడం చాలా సులభం. కానీ వాటిలో పాపులర్ కావడం అంత సులభం కాదు. దీనికి క్రియేటివిటీతో పాటు ఎంతో సహనం కూడా అవసరం అవుతుంది. చాలా మంది చదువు పక్కన పడేసి, చేస్తున్న ఉద్యోగాన్ని, వృత్తిని వదిలేసి సోషల్ మీడియాలోకి ఎంటర్​ అవుతుంటారు. ఇది సరైన విధానం కాదు. దీనిని కేవలం ఒక సైడ్​ బిజినెస్​గా మాత్రమే చూడడం ఎప్పుడూ శ్రేయస్కరం.

మూడ్​కు తగ్గట్టుగా 'ప్రొఫైల్ సాంగ్'​ - ఇన్​స్టా లేటెస్ట్ ఫీచర్​ - ఎలా సెట్ చేయాలంటే? - Instagram Song On Profile Feature

ఫొటో క్వాలిటీ పక్కా, విజువల్ రిచ్​నెస్ సూపర్​- ఇన్​స్టా ఇన్​ఫ్లుయెన్సర్స్​ వాడే ఎడిటింగ్ యాప్స్​​ ఇవే! - Best Photo Editing Apps

ABOUT THE AUTHOR

...view details