తెలంగాణ

telangana

ETV Bharat / technology

దుస్తుల లైఫ్‌ను పెంచే ట్రిక్​- వాషింగ్​ మెషీన్​లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి!​

Increase Cloth Life Span With Washing Machine : వాషింగ్ మెషీన్​ల వల్ల దుస్తులు కొద్దిరోజులకే పోగులు తేలి దర్శనమిస్తాయి. అయితే దీనికి రకరకాల కారణాలుంటాయి. దుస్తుల స్వభావం, వాషింగ్​ మెషీన్​ సెట్టింగ్​లు, టెంపరేచర్ సెట్టింగ్​ వంటి వాటి వల్ల దుస్తుల మన్నిక దగ్గుతుంది. అయితే దుస్తుల లైఫ్‌ను పెంచేందుకు దోహదపడే వాషింగ్​ మెషీన్‌లోని పలు కీలకమైన సెట్టింగ్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Washing Machine Best Practices for Clothes Longevity
Washing Machine Best Practices for Clothes Longevity

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 7:06 PM IST

Increase Cloth Life Span With Washing Machine :వాషింగ్​ మెషీన్‌ను వాడటానికి ముందు మనం తెలుసుకోవాల్సింది వివిధ రకాల వస్త్రాల స్వభావం గురించి. ఎందుకంటే ఒక్కో క్లాత్​ ఒక్కో రకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. కొన్ని వస్త్రాలు రఫ్​ అండ్​ టఫ్‌గా ఉంటాయి. ఇంకొన్ని చాలా డెలికేట్​గా ఉంటాయి. ఈ తేడాను అర్థం చేసుకొని మనం వాటిని వాషింగ్​ మెషీన్‌లో వేయాల్సి ఉంటుంది. ఆయా వస్త్రాల స్వభావానికి అనుగుణంగా వాషింగ్​ మెషీన్​ సెట్టింగ్స్​ మార్చాల్సి ఉంటుంది. అన్ని రకాల దుస్తులకు ఒకే రకమైన ఉతుకుడు ఫార్ములాను వాడితే దెబ్బతినేది మీ దుస్తులే అని గుర్తుంచుకోండి.

మెత్తటి పదార్థం అదే
దుస్తులు ఉతికేకొద్దీ వాషింగ్​ మెషీన్‌లోని ఫిల్టర్లలో మెత్తటి పదార్థం పేరుకుపోతుంటుంది. ఆ మెత్తటి పదార్థంలో మన దుస్తుల్లోని దారపు పోగులు కూడా ఉంటాయి. అంటే వాషింగ్​ మెషీన్​ వేగంగా ఉతికే ప్రక్రియను నిర్వహించే క్రమంలో మన దుస్తుల్లోని కొన్ని దారపు పోగులు బయటికి వచ్చేస్తుంటాయి. ప్రత్యేకించి వదులుగా ఉన్న దారపు పోగులు మన దుస్తుల నుంచి విడిపోతాయి. అందుకే సున్నితమైన క్లాత్‌లను వాషింగ్​ మెషీన్​ ఉతుకుకు దూరంగా ఉంచడం మంచిది. ఇక మనం వాషింగ్​ మెషీన్​ ఫిల్టర్లను క్లీన్‌ చేసే సమయంలో వాటిలో చేరిన వేస్ట్‌ మెటీరియల్‌ను తీసేయాలి. అయితే ఈ ప్రక్రియను యూజర్​ మాన్యువల్‌ ప్రకారం చేయడం బెటర్​.

ఫ్రంట్​ లోడర్​ వర్సెస్​ టాప్​ లోడర్​
మన దుస్తుల క్వాలిటీని కాపాడుకోవాలంటే చాలా అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో వాషింగ్​ మెషీన్​ రకం, వాషింగ్​ సైకిల్​, డిటర్జెంట్లు, టెంపరేచర్స్​, టైమ్, క్లాత్​ స్వభావం అనేవి చాలా ముఖ్యమైనవి. ఇక వాషింగ్​ మెషీన్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టాప్​ లోడర్​ రకం. మరొకటి ఫ్రంట్​ లోడర్​ రకం. ఈ రెండింటి పనితీరు డిఫరెంట్‌గా ఉంటుంది. టాప్​ లోడర్‌‌లోని మెషీన్​లోని బకెట్​, మనం వేసే దుస్తులతో నిలువునా రొటేట్​ అవుతూ వాటిలోకి డిటర్జెంట్​, నీళ్లను పంపింగ్​ చేసి క్లీన్​ చేస్తుంది.

ఫ్రంట్​ లోడర్‌‌లోని బకెట్​, మనం వేసే దుస్తులతో అడ్డంగా రొటేట్​ అవుతూ దుస్తులను శుభ్రం చేస్తుంది. టాప్​ లోడర్‌తో పోలిస్తే ఫ్రంట్​ లోడర్​ తక్కువ నీటిని వాడుకుంటుంది. ఎందుకంటే ఇది గురుత్వాకర్షణ సిద్ధాంతం ఆధారంగా రొటేట్​ అవుతుంది. ఈ లెక్కల ప్రకారం టాప్ లోడింగ్​ మెషీన్లు వాడేవారు దుస్తులను ఉతికే క్రమంలో ఎక్కువ అలర్ట్‌గా ఉండాలి. వాషింగ్​ సైకిల్​, డిటర్జెంట్లు, టెంపరేచర్స్​, వస్త్రం స్వభావాలను దృష్టిలో ఉంచుకొని మెషీన్​లో దుస్తులు వేయాలి.

టెంపరేచర్​ రేంజ్ సెట్టింగ్స్​​ ఇలా
దుస్తులపై సాధారణ మరకలు పడితే 'లో టెంపరేచర్​' ఆప్షన్లు సరిపోతాయి. మొండి మరకలు ఉన్నప్పుడు, వైద్య సిబ్బంది దుస్తులు, కెమికల్ ఫ్యాక్టరీల్లో పనిచేసే వారి దుస్తులను ఉతికేందుకు 'హై టెంపరేచర్​' ఆప్షన్‌ను వాడుకోవచ్చు. వీటిలో ఏదైనా పొరపాటు జరిగితే సున్నితమైన వస్త్రాల క్లీనింగ్‌లో ఇబ్బందులు​ ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

దుస్తుల్లోని దారపు పోగులు వదులుగా తయారయ్యే రిస్క్​ ఎదురుకావచ్చు. నూలు వంటి సున్నితమైన క్లాత్స్‌ను 'హై టెంపరేచర్​' సెట్టింగ్‌లో పెట్టి ఉతికితే అవి ఎక్కడికక్కడ కుచించుకుపోయి రూపురేఖలను కోల్పోతాయి. మొత్తం క్లాత్​ క్వాలిటీ దెబ్బతింటుంది. హై టెంపరేచర్​ ఎఫెక్టుతో కొన్ని సందర్భాల్లో సున్నితమైన క్లాత్‌లలో రంధ్రాలు కూడా ఏర్పడుతుంటాయి. కాటన్​ క్లాత్స్ చాలా టఫ్‌గా ఉంటాయి. వాషింగ్​ మెషీన్స్ సెట్టింగ్స్​ కొంత అటూ ఇటూ అయినా ఇవి తట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వామ్మో డిటర్జెంట్స్
వాషింగ్​ మెషీన్లలో డిటర్జెంట్​ లేదా సబ్బు సెక్షన్​ ఉంటుంది. దుస్తులపై ఉండే మరకలను తొలగించడంలో ప్రధాన పాత్ర వీటిదే. మనం వాడే కొన్ని రకాల బ్లీచింగ్‌లు, వైట్​నర్ ఏజెంట్లలో కఠినమైన రసాయన సమ్మేళనాలు ఉంటాయి. వీటితో దుస్తులను ఉతికేటప్పుడు వాష్​ సైకిల్స్‌పై ఫోకస్​ చేయాలి. వాష్​ సైకిల్స్​ అతిగా పెడితే దుస్తుల క్వాలిటీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఉన్ని, పట్టు రకాలకు చెందిన దుస్తులలోని దారపు పోగుల అమరికను డిటర్జెంట్లలోని రసాయన సమ్మేళనాలు చెల్లాచెదురు చేసే అవకాశం ఉంటుంది.

మంచి స్మార్ట్​వాచ్​ కొనాలా? రూ.2,500 బడ్జెట్లోని టాప్​-10 ఆప్షన్స్ ఇవే!

హెల్త్​ ట్రాకింగ్​ కోసం మంచి స్మార్ట్​వాచ్ కొనాలా? రూ.5000 బడ్జెట్లోని టాప్​-6 ఆప్షన్స్​ ఇవే!

ABOUT THE AUTHOR

...view details