తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీ పీఫ్ అకౌంట్​లో డబ్బు ఎంత ఉందో తెలుసుకోవాలా?- ఒక్క క్లిక్​తో చెక్ చేసుకోండిలా..!

How to Check EPFO Balance: మీరు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నారా? మీ పీఫ్ అకౌంట్​లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఒక్క క్లిక్​తో ఇలా క్షణాల్లో తెలుసుకోవచ్చు. అదెలాగంటే?

By ETV Bharat Tech Team

Published : 7 hours ago

Updated : 7 hours ago

How to Check EPFO Balance
How to Check EPFO Balance (ETV Bharat)

How to Check EPFO Balance: ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు ఈపీఎఫ్ అకౌంట్ సేవలను అందిస్తోంది. ఉద్యోగి వేతనంలో ప్రతి నెలా కొంత భాగం ఈపీఎఫ్ అకౌంట్‌కు వెళ్తుంది.

సాధారణంగా ఉద్యోగి వేతనంలో (బేసిక్ వేతనం, డీఏ)లో 12 శాతం ప్రతి నెలా పీఎఫ్ ఖాతాలో జమవుతుంది. అదే సమయంలో ఉద్యోగి పనిచేసే సంస్థ కూడా 12 శాతం మొత్తాన్ని పీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తుంది. ఈ విధంగా ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్‌లో ప్రతి నెలా 24 శాతం మొత్తం జమవుతూ వస్తుంది. ఇలా ఉద్యోగి ఖాతాలో జమ అయిన మొత్తాన్ని ఇంట్లో కూర్చుని మొబైల్​ ఫోన్​లో ఇప్పుడు సులభంగానే తెలుసుకోవచ్చు.

ఒక్క క్లిక్‌తో అకౌంట్​ చెకింగ్:

  • ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్​లో ఎంత డబ్బు జమ అయి ఉందో చూడాలనుకుంటే కేవలం ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌లో చూడొచ్చు.
  • ఇందుకోసం మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వెబ్‌సైట్‌ను కూడా సందర్శించాల్సిన అవసరం లేదు.
  • ఇప్పుడు ఉమంగ్ అప్లికేషన్‌ని ఉపయోగించి మీ PF ఖాతాలో జమ అయిన మొత్తాన్ని సులభంగా చూడొచ్చు.
  • అయితే ఇందుకోసం మీరు యూనివర్సల్ అకౌంట్​ నంబర్‌ను మాత్రమే కలిగి ఉండాలి.

ఉమంగ్ యాప్:

  • మీ మొబైల్‌లో ఉమంగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసేందుకు Google Play Store లేదా Apple App Storeకి వెళ్లండి.
  • "ఉమంగ్" అని సెర్చ్ చేయండి. యాప్‌ను సెలెక్ట్ చేసుకుని ఇన్​స్టాల్ చేసుకోండి.
  • యాప్​ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోండి.

ఏంటీ ఉమాంగ్ యాప్?:

  • ఈ ఉమాంగ్ యాప్‌లో మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వివిధ సేవలను పొందవచ్చు.
  • ఈ యాప్ Android, iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంది.
  • రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆధార్, నేషనల్ పెన్షన్ యోజన (NPS), ABHA ఆరోగ్య యోజన, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వంటి వాటిని ఈ యాప్‌లో ఒకే చోట చూడొచ్చు.

పాస్‌బుక్‌ని ఎలా చెక్ చేసుకోవాలి?:

  • ముందుగా మీరు ఉమంగ్ యాప్‌లో EPFOని సెలెక్ట్ చేసుకోవాలి.
  • తర్వాత View Passbookపై క్లిక్ చేయాలి.
  • దీని తర్వాత మీరు మీ UAN నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • ఇప్పుడు మీరు గెట్ ఓటీపీపై క్లిక్ చేసి, సబ్మిట్ ఓటీపీపై క్లిక్ చేయండి.
  • దీని తర్వాత మీ మెంబర్ ఐడిని ఎంచుకుని, ఇ-పాస్‌బుక్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

EPFO ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి?:

  • మీరు ఉమంగ్ యాప్‌లో PF అకౌంట్​ నుంచి కూడా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • ఈ యాప్‌లో UAN నంబర్ కోసం కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మిస్డ్ కాల్​తో కూడా మీరు EPF ఖాతా బ్యాలెన్స్‌ని చెక్ చేయవచ్చు.
  • మీరు UAN సైట్‌లో నమోదు చేసుకున్నట్లయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీకు కావాల్సిన సమాచారాన్ని పొందొచ్చు.
  • మీ UANలో మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్, పాన్ ఉండేలా చూసుకోండి.
  • మీ అకౌంట్ EPFO ​​కాకపోతే మీ కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్‌ని సంప్రదించండి.
  • మీ ఖాతాను తెరవమని అతడికి రిక్వస్ట్ చేయండి.
  • అధికారిక EPFO ​​మెంబర్ పాస్‌బుక్ పోర్టల్ (https://www.epfindia.gov.in/site_en/index.php) సందర్శించండి.
  • సైన్ ఇన్ చేయడానికి మీ UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్), పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
  • మీరు చూడాలనుకుంటున్న PF అకౌంట్​ను ఎంచుకోండి.
  • అన్ని లావాదేవీల కోసం PF పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీకు మీ బ్యాలెన్స్ ఎంత ఉందో కన్పిస్తుంది.

EPF ఆఫ్‌లైన్‌లో ఎలా చూడాలి?:

  • మీరు UAN సైట్‌లో నమోదు చేసుకున్నట్లయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మీరు 7738299899కి SMS పంపొచ్చు.
  • ఇక్కడ మీరు మీకు నచ్చిన భాషను కూడా ఎంచుకోవచ్చు.
  • మెసెజ్​ను పంపిన కొన్ని సెకన్లలో మీరు SMS ద్వారా మీ EPF అకౌంట్ బ్యాలెన్స్‌ వివరాలను అందుకుంటారు.
  • మిస్డ్ కాల్:
  • మీరు UAN సైట్‌లో నమోదు చేసుకున్న మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ద్వారా మీరు 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు.
  • కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అయిపోతుంది.
  • ఆ తర్వాత మీరు SMS ద్వారా మీ EPF వివరాలను పొందుతారు. ఇది మీ అకౌంట్​కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.

మీ ఫోన్ చోరీకి గురైందా?- వెంటనే ఇలా స్క్రీన్​ లాక్ చేసేయండి.. అన్నీ సేఫ్..! - Google Theft Protection Feature

ఎంఎక్స్‌ ప్లేయర్​ని కొన్న అమెజాన్- ఫ్రీ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ 'మినీటీవీ'లో విలీనం

Last Updated : 7 hours ago

ABOUT THE AUTHOR

...view details