Pushpa 2 Making Video : ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'పుష్ప 2' సినిమా మేకర్స్ బన్నీ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. సినిమా షూటింగ్ సమయంలో 'బిహైండ్ ది కెమెరా' సన్నివేశాల వీడియో ఒకటి రిలీజ్ చేశారు. సినిమాలో వాడిన భారీ సెట్టింగ్‌లు, హీరో- డైరెక్టర్ ఫన్నీ మూమెంట్స్ ఇన్నీ ఇందులో ఉన్నాయి. ఈ మేకింగ్ వీడియో కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. మరి మీరు ఈ వీడియో చూశారా?
కాగా, కొన్ని అదనపు సన్నివేశాలతో కూడిన రీ లోడెడ్ వెర్షన్ తీసుకువస్తున్నట్లు రీసెంట్గా మేకర్స్ ప్రకటించారు. జనవరి 11నుంచి మరికొన్ని సీన్లు యాడ్ చేయనున్నట్లు చెప్పారు. అయితే ఈ వెర్షన్ ప్రస్తుతానికి వాయిదా పడింది. సంబంధిత కంటెంట్ విషయంలో టెక్నికల్ కారణాల వల్ల ఆలస్యమవుతోందని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.
ఈ నెల 17 నుంచి కొత్త సన్నివేశాలతో కూడిన సినిమాని చూడొచ్చని పేర్కొంది. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న చిత్రానికి అదనంగా 20 నిమిషాలు యాడ్ కానుంది. దీంతో సినిమా రన్‌టైమ్ మొత్తం 3 గంటల 40 నిమిషాలు దాటిపోతుంది. అంటే ఇంటర్వెల్‌తో కలిపి ప్రేక్షకులు దాదాపు 4 గంటల పాటు 'పుష్ప' ప్రపంచంలోనే ఉంటారన్న మాట.
బాహుబలి రికార్డ్ బ్రేక్
కాగా, సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు నుంచే భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా నార్త్‌లో ఈ మూవీకి క్రేజ్ వేలే లెవెల్లో ఉంది. డిసెంబర్ 5న రిలీజైన పుష్ప 2 వరల్డ్‌వైడ్‌గా ఇప్పటివరకు రూ. 1831 కోట్లు గ్రాస్ సాధించింది. ఒక్క హిందీలోనే రూ.800+ కోట్ల నెట్ వసూల్ చేసింది. ఈ క్రమంలో తెలుగు అత్యధిక వసూళ్లు చేసిన 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు)ను దాటేసింది. దీంతో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు సినిమాగా పుష్ప 2 అవతరించింది. రష్మికా మంధన్నా హీరోయిన్గా నటించగా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు తదితరులు ఆయా పాత్రల్లో కనిపించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి, నవీన్ నిర్మించారు.
'పుష్ప 2' కలెక్షన్ల సునామీ- 'బాహుబలి 2' రికార్డ్ బ్రేక్ అవ్వడం పక్కా!