తెలంగాణ

telangana

ETV Bharat / technology

పవర్​ఫుల్ కెమెరా, ఏఐ ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్- ధర ఎంతంటే? - Honor 200 Lite launched - HONOR 200 LITE LAUNCHED

Honor 200 Lite launched: ప్రముఖ టెక్ బ్రాండ్ హానర్ ఇండియన్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్​ఫోన్​ను లాంచ్ చేసింది. పవర్​ఫుల్ కెమెరా, AI ఫీచర్లతో హానర్ 200 లైట్​ పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా దీని ధర, స్పెసిఫికేషన్స్​ గురించి మరిన్ని వివరాలు మీకోసం.

Honor 200 Lite launched
Honor 200 Lite launched (Honor)

By ETV Bharat Tech Team

Published : Sep 19, 2024, 3:23 PM IST

Honor 200 Lite launched: ప్రముఖ చైనా స్మార్ట్​ఫోన్ బ్రాండ్ హానర్ కొత్త స్మార్ట్​ఫోన్​ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే Honor 200, Honor 200 ప్రో ఫోన్లను లాంచ్ చేసిన హానర్.. తాజాగా తన 200 సిరీస్‌లో మూడో స్మార్ట్‌ఫోన్​ను లాంచ్ చేసింది. అత్యధిక కెమెరా రిజల్యూషన్, ఏఐ ఫీచర్లతో హానర్ 200 లైట్ పేరిట ఈ సరికొత్త మొబైల్​ను రిలీజ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ మ్యాజిక్ ఓఎస్ 8.0 ఆధారంగా పనిచేస్తుంది. 26 సెప్టెంబర్ 2024 నుంచి అమెజాన్​లోఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమవనున్నాయి. మరెందుకు ఆలస్యం ఈ సరికొత్త స్మార్ట్​ఫోన్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

హానర్ 200 లైట్‌ స్పెసిఫికేషన్స్:

  • డిస్‌ప్లే:6.7 అంగుళాల ఫుల్ HD+ AMOLED
  • బ్యాటరీ సామర్థ్యం: 4,500mAh
  • పీక్​ బ్రైట్​నెస్:2,000 nits
  • స్క్రీన్ టు బాడీ రేషియో:93.7 percent
  • స్పెషాలిటీ: ఐ ప్రొటెక్షన్
  • ప్రైమరీ కెమెరా: 108MP
  • అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్:5MP
  • మ్యాక్రో సెన్సార్:2MP
  • ఫ్రంట్ కెమెరా:50MP
  • ప్రాసెసర్​:మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్​సెట్
  • 8GB RAM
  • వర్చువల్ RAM అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్
  • ఐఫోన్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్​లాగా పనిచేసే మ్యాజిక్ క్యాప్సూల్
  • AI ఫీచర్లు
  • మ్యాజిక్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్‌
  • 35W ఫాస్ట్ ఛార్జింగ్‌
  • సెక్యూరిటీ ఫీచర్లు:
  • సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • ఫేస్ అన్‌లాక్

కనెక్టివిటీ ఫీచర్లు:

  • Wi-Fi
  • GPS
  • బ్లూటూత్
  • డ్యూయల్ సిమ్ స్లాట్
  • USB టైప్-సి పోర్ట్

హానర్ 200 లైట్‌ కలర్ ఆప్షన్స్:

  • మిడ్‌నైట్ బ్లాక్
  • సియాన్ లేక్
  • స్టారీ బ్లూ

హానర్ 200 లైట్‌ ధర: రూ.15,999 నుంచి ప్రారంభం

హానర్ 200 లైట్‌ కెమెరా:హానర్ 200 లైట్ స్మార్ట్‌ఫోన్​లో108MP ప్రైమరీ సెన్సార్, 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో సెన్సార్​లు ఉన్నాయి. దీంతోపాటు సెల్పీల కోసం ఈ సరికొత్త మొబైల్​లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.

హానర్ 200 లైట్‌ బ్యాటరీ: ఈ మొబైల్ 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 35W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్​ చేస్తుంది. కనెక్టివిటీ కోసం ఇందులో Wi-Fi, GPS, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ స్లాట్, USB టైప్-సి పోర్ట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

స్మార్ట్​ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్- ఏ మొబైల్​పై ఎంత ఆఫర్​ ఇస్తుందో తెలుసా? - Flipkart Offers on Mobiles

ఐఫోన్ లవర్స్​కు అమెజాన్ బంపర్ ఆఫర్- రూ.39,999లకే యాపిల్ ఐఫోన్ 13! - iPhone 13 for Rs 39999

ABOUT THE AUTHOR

...view details