Hero MotoCorp: బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. త్వరలో మార్కెట్లోకి ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ నుంచి నాలుగు కొత్త టూ-వీలర్స్ రానున్నాయి. వీటిలో ఒక ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఉంది. ఇటలీలోని మిలాన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మోటార్ సైకిల్, యాక్సెసరీజ్ ఎగ్జిబిషన్లో కంపెనీ వీటిని ఆవిష్కరించింది.
మోటోకార్ప్ కొత్త టూ-వీలర్స్ ఇవే:
- ఎక్స్‌ట్రీమ్ 250ఆర్
- కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ 250
- ఎక్స్‌పల్స్ 210
- హీరో విడా జెడ్
వీటిలో హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్, కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ 250 రెండు బైక్‌లూ ఒకే రకమైన ఇంజిన్‌తో వస్తున్నాయి. వీటిలో 250సీసీ సింగిల్ సిలిండర్, డీఓహెచ్‌సీ, 4 వాల్యూడ్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 30hp, 25Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 3.25 సెకన్లలో 0- 60 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. కంపెనీ మరి కొన్ని నెలల్లో వీటిని మార్కెట్లోకి తీసుకురానుంది.
ఈ రెండింటిలో ఇతర ఫీచర్లు:
- క్లాస్- డీ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు
- లాప్ టైమర్
- డ్రాగ్ రేస్ టైమర్
- ఏబీఎస్ మోడ్స్
- మ్యూజిక్ కంట్రోల్స్
- టర్న్- బై- టర్న్ నావిగేషన్