Google Free Online AI Courses : ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ గూగుల్ విద్యార్థుల కోసం, ప్రొఫెషనల్స్ కోసం పూర్తి ఉచితంగా 'ఏఐ ఆన్లైన్ కోర్సు'లను అందిస్తోంది. వాస్తవానికి ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులను ఆసక్తి ఉన్న ఎవరైనా ఫ్రీగా నేర్చుకోవచ్చు. మీ స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకుని, నూతన ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.
మరి మీరు కూడా ఈ ఏఐ ఆన్లైన్ కోర్సులు చేయాలని అనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం, గూగుల్ అందిస్తున్న ఫ్రీ ఏఐ కోర్సుల వివరాలు గురించి తెలుసుకుందాం రండి.
- Introduction To Large Language Models : ఈ కోర్స్ 'లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్' (LLMs) గురించి తెలుపుతుంది. ఈ ఎల్‌ఎల్‌ఎమ్స్ ఉపయోగం ఏమిటి? దీనిని ఎలాంటి సందర్భాల్లో వాడాలి? ప్రాంప్ట్ ట్యూనింగ్ ఎలా చేయాలి? అనే విషయాలను ఈ కోర్సులో నేర్పుతారు.
- Introduction To Responsible AI :ఈ కోర్స్‌లో రెస్పాన్సిబుల్ ఏఐ కాన్సెప్ట్ గురించి, దాని ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. గూగుల్ తమ ప్రొడక్టుల్లో ఈ 'రెస్పాన్సిబుల్ ఏఐ' టెక్నాలజీని ఏ విధంగా అమలు చేస్తోందో కూడా వివరిస్తారు.
- Generative AI Fundamentals :ఈ కోర్స్ ద్వారా జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, రెస్పాన్సిబుల్ ఏఐ టెక్నాలజీలను సులువుగా నేర్చుకోవచ్చు.
- Introduction To Image Generation : ఈ కోర్సులో థియరీతోపాటు ఇమేజ్ జనరేషన్ గురించి నేర్పిస్తారు. వెర్టెక్స్ ఏఐ ట్రైనింగ్, డిప్లాయిమెంట్ గురించి వివరిస్తారు.
- Encoder - Decoder Architecture : ఈ కోర్సులో 'మెషీన్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్'ను నేర్పిస్తారు. దీనిని ఉపయోగించి సీక్వెన్స్-టు-సీక్వెన్స్ టాస్క్‌లు ఎలా పూర్తి చేయాలి? ముఖ్యంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఇచ్చిన పూర్తి సమాచారానికి సారాంశం చెప్పడం, ఒక భాషలోని టెక్ట్స్‌ను మరోభాషలోకి అనువాదం చేయడం లాంటి టాస్క్‌లను ఎలా పూర్తి చేయాలో నేర్పిస్తారు.
- Attention Mechanism :ఇన్పుట్ సీక్వెన్స్‌లోని నిర్దిష్ట భాగాలపై ఫోకస్ చేసేందుకు న్యూరల్ నెట్‌వర్క్‌ను ఏ విధంగా ఎనేబుల్ చేయాలి? అనే టెక్నిక్లను ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.
- Create Image Captioning Models : ఈ కొత్త కోర్సులో ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్స్ గురించి, ఎన్కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్ గురించి బోధిస్తారు.
- Introduction To Generative AI Studio : ఈ కోర్సులో జనరేటివ్ ఏఐ స్టూడియో గురించిన ప్రాథమిక అంశాలను వివరిస్తారు. దీనిని ఉపయోగించి మీ అప్లికేషన్ల కోసం కస్టమైజ్డ్ జనరేటివ్ ఏఐ మోడల్స్‌ను రూపొందించుకోవచ్చు. అలాగే ప్రోటోటైప్ మోడల్స్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.