2025 Ducati Panigale V4:ప్రీమియం అండ్ స్పోర్టీ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ డుకాటి ఇండియా మంగళవారం తన '2025 పనిగలే V4' మోడల్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. కంపెనీ స్టార్ట్ చేసిన కేవలం 24 గంట్లోనే ఈ మోటార్‌సైకిల్ ఫస్ట్ లాట్ పూర్తిగా బుక్ అయింది. ఈ మోటార్ సైకిల్ త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ గత కొన్ని రోజులుగా దీని టీజర్లను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోని తన ఖాతాలలో విడుదల చేస్తోంది.
ఈ 2025 డుకాటి పనిగలే V4 మోడల్ కంపెనీ నుంచి వచ్చిన సెవెన్త్-జనరేషన్ హై-పెర్ఫార్మెన్స్ సూపర్‌బైక్. దీన్ని మొదటిసారిగా 2024 వరల్డ్ డుకాటి వీక్‌లో ప్రవేశపెట్టారు. దీనిలో సరికొత్త డిజైన్, సవరించిన ఛాసిస్, లార్జ్ ఎక్విప్మెంట్ లిస్ట్, అప్డేట్డ్ ఇంజిన్ వంటివి ఉన్నాయి.
2025 డుకాటి పనిగలే V4 డిజైన్:ఈ కొత్త 'పానిగేల్ V4' మోటార్‌సైకిల్ ఫ్రంట్-ఎండ్ డిజైన్‌ను 'డుకాటి 916', 'డెస్మోసెడిసి GP' బైక్‌ల నుంచి తీసుకున్నారు. అయితే ఈ బైక్‌లో అగ్రెసివ్ లుక్‌లో హెడ్‌ల్యాంప్స్ ఉండవు. కానీ వీటికి బదులుగా ఇందులో సొగసైన LED హెడ్‌లైట్స్, కొత్తగా డిజైన్ చేసిన ఇంటిగ్రేటెడ్ వింగ్లెట్స్ ఉంటాయి.
ఈ మోటార్ సైకిల్ ఏరోడైనమిక్స్‌ను డుకాటి కోర్స్ ఇంజనీర్ల సహకారంతో అభివృద్ధి చేశారు. కంపెనీ దీని ఫ్యూయెల్ ట్యాంక్, సీట్, ఫుట్‌పెగ్స్, కాంటాక్ట్ పాయింట్లలో మార్పులతో రైడర్ ఎర్గోనామిక్స్‌ను కూడా మెరుగుపరిచినట్లు పేర్కొంది.
2025 డుకాటి పనిగలే V4 ఎలక్ట్రానిక్స్:కంపెనీ ఈ ఫ్లాగ్షిప్ మోటార్‌సైకిల్‌లో ఎలక్ట్రానిక్ ఎయిడ్స్‌కు సంబంధించిన అన్ని ఫీచర్లను అందించింది. వీటితోపాటు ఈ కొత్త బైక్‌లో రేస్ eCBS అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌తో ఫ్రంట్ బ్రేక్ ఉపయోగించినప్పుడు వెనక బ్రేక్ కూడా అప్లై అవుతుంది. ఈ సిస్టమ్ మనకు అవసరమైనప్పుడు లీన్ యాంగిల్ అండ్ థొరెటల్ ఇన్పుట్ వంటి డేటాను ప్రభావితం చేస్తుంది.
ఇక ఈ మోటార్ సైకిల్ కొత్త 6.9-అంగుళాల TFT డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, TPMS, రైడింగ్ అండ్ పవర్ మోడ్స్, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, ABSతో పాటు అనేక ఇతర ఫీచర్లతో వస్తుంది.