ETV Bharat / technology

స్టన్నింగ్ లుక్​లో హీరో స్పెషల్ బైక్- డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే! - HERO KARIZMA XMR 210 COMBAT EDITION

త్వరలో మార్కెట్లోకి హీరో కరిజ్మా XMR కంబాట్ ఎడిషన్‌- ధర, ఫీచర్ల వివరాలు మీకోసం- ఓ లుక్కేయండి మరి!

Hero Karizma XMR 210 Combat Edition
Hero Karizma XMR 210 Combat Edition (Photo Credit- Hero MotoCorp)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 29, 2025, 7:57 PM IST

Hero Karizma XMR 210 Combat Edition: దేశంలోనే అతిపెద్ద టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత్​ మొబిలిటీ గ్లోబల్​ ఎక్స్​పో 2025లో రెండు స్కూటర్లను, రెండు మోటార్​సైకిళ్లను విడుదల చేయడం ద్వారా తనదైన ముద్ర వేసింది. వీటితో పాటు కంపెనీ కొన్ని కాన్సెప్ట్ వాహనాలను కూడా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు కంపెనీ తన స్పోర్ట్స్ బైక్ హీరో కరిజ్మా XMR కంబాట్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోటార్​సైకిల్ టీజర్​ను రిలీజ్ చేసింది.

హీరో కరిజ్మా XMR కంబాట్ ఎడిషన్ ఫీచర్స్: ఈ స్పెషల్ మోడల్ 'కంబాట్ ఎడిషన్' థీమ్​పై ఆధారపడి ఉంటుంది. ఈ థీమ్​ను మొదట హీరో జూమ్ 110 స్కూటర్‌తో పరిచయం చేశారు. ఇప్పుడు దీన్ని కంపెనీ మోటార్​సైకిల్​ లైనప్​లో కూడా చేర్చారు. ఇక హీరో కరిజ్మా XMR కంబాట్ ఎడిషన్‌లో మ్యాట్ షాడో గ్రే పెయింట్​ను ఉపయోగించారు. దీని బాడీ ప్యానెల్స్ కాంట్రాస్టింగ్ 'జెట్ ఫైటర్' మాదిరిగా గ్రాఫిక్​లను కలిగి ఉంటాయి. ఇవి Xoom 110 స్కూటర్‌లో కూడా కనిపిస్తాయి.

హీరో కరిజ్మా XMR కంబాట్ ఎడిషన్ హార్డ్‌వేర్: కంపెనీ ఈ ఎడిషన్​లో 41 mm అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, పెద్ద ఫ్రంట్ డిస్క్ బ్రేక్, TFT కలర్ డిస్​ప్లే వంటి వాటికి గోల్డ్ ఫినిష్​ను అందించింది. ఇప్పుడు ఈ మోటార్​సైకిల్​ బరువును 163.5 కిలోల నుంచి 166 కిలోలకు పెంచింది. దీనితో పాటు ఈ మోడల్​లో షార్ప్ ఫుల్-LED టెయిల్ ల్యాంప్‌లతో ఫుల్-LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఇచ్చింది. దీని స్టాండర్డ్ మోడల్​ డిజైన్​ బిట్స్​ కూడా ఇందులో కన్పిస్తాయి.

హీరో కరిజ్మా XMR కంబాట్ ఎడిషన్ ఇంజిన్: హీరో కరిజ్మా XMR కంబాట్ ఎడిషన్​లో 210cc, V4 లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 9,250 rpm వద్ద 25.15 bhp శక్తిని, 7,250 rpm వద్ద 20.4 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

హీరో కరిజ్మా XMR కంబాట్ ఎడిషన్ ధర: ఈ కొత్త హీరో కరిజ్మా XMR కంబాట్ ఎడిషన్ ధర స్టాండర్డ్ మోడల్ కంటే కొన్ని వేల రూపాయలు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దీని ధర రూ. 1.81 లక్షలు (ఎక్స్-షోరూమ్). హీరో మోటోకార్ప్ త్వరలో తన పెద్ద హీరో కరిజ్మా XMR 250ని విడుదల చేయనుంది. దీంతో ఈ కరిజ్మా XMR కంబాట్ బహుశా 210cc మోడల్‌లో చివరి ఎడిషన్ కావచ్చు.

భలే భలే బీఎండబ్ల్యూ iX ఫేస్​లిఫ్ట్ వచ్చేస్తుందోచ్- సింగిల్​ ఛార్జ్​తో 700కి.మీ కంటే ఎక్కువ రేంజ్!

వారెవ్వా డుకాటి నయా బైక్ డిమాండ్ చూశారా?- 24గంటల్లోనే ఫస్ట్ స్లాట్​ బుకింగ్స్ కంప్లీట్!

ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్- టీజర్ చూస్తే అవాక్కైపోతారంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.