తెలంగాణ

telangana

ETV Bharat / technology

డీప్​సీక్​తో మీ డేటా సేఫేనా?- దీన్ని వాడేముందు ఈ విషయాలు తెలుసుకోండి! - DEEPSEEK LEAKED SENSITIVE DATA

డీప్​సీక్ మిలియన్లకు పైగా లైన్ల డేటా బయటకు పొక్కింది: ఇజ్రాయెల్ సైబర్​ సంస్థ

DeepSeek AI
DeepSeek AI (Photo Credit- AP Photo)

By ETV Bharat Tech Team

Published : Jan 30, 2025, 1:56 PM IST

Deepseek Leaked Sensitive Data:చైనాలోని హాంగ్జౌకు చెందిన ఏఐ స్టార్టప్‌ డీప్‌సీక్‌ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతోంది. ఈ AI రీసెర్చ్‌ సంస్థ ఆర్‌1 పేరిట విడుదల చేసిన మోడల్ మొత్తం ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. దీన్ని ఉపయోగించిన వారు ఇతర ఏఐ మోడల్స్​ కంటే ఇది మెరుగైన పనితీరును కనబరుస్తోందంటూ నెట్టింట తెగ పోస్ట్​లు చేసేస్తున్నారు. దీంతో ఇంత అడ్వాన్స్​డ్ ఏఐ మోడల్​ను ఇలా పూర్తిగా ఉచితంగా అందించడంతో విస్తృతంగా దీన్ని ఉపయోగిస్తున్నారు.

ఇది యాపిల్ యాప్​ స్టోర్​లో ఇప్పటికే అగ్రస్థానంలోకి చేరింది. గూగుల్​ప్లేస్టోర్​లో కూడా నంబర్​ వన్​గా నిలిచి ప్రపంచ వ్యాప్తంగా తన హవా కొనసాగిస్తోంది. అయితే ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లకు ఈ యాప్ సురక్షితమేనా? డీప్​సీక్​తో మీ డేటా సేఫేనా? అనే విషయానికొస్తే ఆ సంస్థకు సంబంధించిన కీలక విషయాలను ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ విజ్‌ వెల్లడించింది.

డీప్‌సీక్‌ చాలా సెన్సిటివ్ డేటాను ఓపెన్‌ ఇంటర్నెట్‌కు చేరవేయడాన్ని గుర్తించినట్లు బుధవారం తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొంది. దాదాపు ఒక మిలియన్‌కు పైగా లైన్ల డేటాను డీప్‌సీక్‌ సురక్షితంగా స్టోర్‌ చేయకపోవడంతో ఆ సమాచారం బయటకు పొక్కినట్లు పేర్కొంది. అందులో డిజిటల్ సాఫ్ట్​వేర్ కీస్, యూజర్ల చాట్‌ లాగ్స్ సైతం ఉన్నాయని వెల్లడించింది.

"దాదాపు ఒక మిలియన్‌కు పైగా లైన్ల డేటాను డీప్‌సీక్‌ సురక్షితంగా స్టోర్‌ చేయకపోవడంతో ఆ సమాచారం బయటకు వచ్చింది. అందులో డిజిటల్‌ సాఫ్ట్‌వేర్‌ కీస్‌, యూజర్ల చాట్‌ లాగ్స్ సైతం ఉన్నాయి. ఆ సంస్థ నుంచి చాలా సున్నితమైన డేటా ఓపెన్‌ ఇంటర్నెట్‌కు చేరిన విషయాన్ని గుర్తించాం"- విజ్‌, ఇజ్రాయెల్ సైబర్​ సెక్యూరిటీ సంస్థ

అయితే ఈ విషయంపై తన సంస్థ వారిని అప్రమత్తం చేసిన గంటలోనే డీప్‌సీక్ డేటాను భద్రపరిచిందని విజ్‌ కో-ఫౌండర్ అమీ లుత్వాక్‌ తెలిపారు. అంతేకాక ఇది కనుగొనడం చాలా సులభతరమన్నారు. అయితే విజ్‌ సంస్థ పేర్కొన్న విషయాలపై డీప్‌సీక్‌ మాత్రం స్పందించి వివరణ ఇవ్వలేదు.

స్టన్నింగ్ లుక్​లో హీరో స్పెషల్ బైక్- డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

భలే భలే బీఎండబ్ల్యూ iX ఫేస్​లిఫ్ట్ వచ్చేస్తుందోచ్- సింగిల్​ ఛార్జ్​తో 700కి.మీ కంటే ఎక్కువ రేంజ్!

వారెవ్వా డుకాటి నయా బైక్ డిమాండ్ చూశారా?- 24గంటల్లోనే ఫస్ట్ స్లాట్​ బుకింగ్స్ కంప్లీట్!

ABOUT THE AUTHOR

...view details