తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీరు యాపిల్ డివైజస్ వాడుతున్నారా?- అయితే కేంద్రం హైరిస్క్ అలర్ట్- వెంటనే ఇలా చేయండి! - HIGH RISK WARNING FOR APPLE USERS

యాపిల్ యూజర్స్​కు కేంద్రం హెచ్చరిక!- అసలేం జరిగిందంటే..?

High Risk Warning For Apple Users
High Risk Warning For Apple Users (Apple)

By ETV Bharat Tech Team

Published : Nov 12, 2024, 7:35 PM IST

High Risk Warning For Apple Users:మీరు యాపిల్ కంపెనీకి చెందిన డివైజస్ యూజ్ చేస్తున్నారా? అయితే మీకో బిగ్ అలర్ట్. యాపిల్ యూజర్లకు కేంద్రం హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు, మ్యాక్స్, వాచీలు వంటి వాటిని వాడుతున్న వారు వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఔట్‌డేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ వాడుతున్న డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది.

ఈ మేరకు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలోని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) అడ్వైజరీని జారీ చేసింది. ఆయా డివైజులు వాడుతున్న వారికి హైరిస్క్ పొంచి ఉన్నట్లు తెలిపింది. దీంతో వెంటనే తమ సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ చేసుకోవాలని కోరింది. పాత సాఫ్ట్‌వేర్‌లో సెక్యూరిటీ లోపాల కారణంగా యాపిల్‌ డివైజుల్లో గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసి సెన్సిటివ్‌ డేటాను దొంగిలించడం లేదా డేటా మానిప్యులేషన్‌కు పాల్పడే అవకాశం ఉందని సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది.

ఐఓస్‌ 18.1 కంటే ముందు వెర్షన్‌ లేదా 17.7.1 కలిగిన ఐఫోన్లు, ఐప్యాడ్‌ఓఎస్‌ 18.1 కంటే ముందు లేదా 17.7.1 వెర్షన్‌ కలిగిన ఐప్యాడ్‌లు, పాత మ్యాక్‌ఓఎస్‌ వాడుతున్న మ్యాక్‌లు, వాచ్‌ ఓఎస్‌ 11 కంటే ముందు సాఫ్ట్‌వేర్‌ కలిగిన యాపిల్‌ వాచ్‌లకు ఈ ప్రమాదం పొంచి ఉందని సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది. వీటితో పాటు పాత టీవీఓఎస్‌, విజన్‌ఓఎస్‌, సపారీ బ్రౌజర్లకూ ఇదే తరహా ముప్పు పొంచిఉందని సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది. అయితే సాఫ్ట్‌వేర్‌లో లోపాలను యాపిల్‌ ఇదివరకే గుర్తించిందని, వాటికి పరిష్కారంగా కొత్త సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తున్నట్లు తెలిపింది.

ఇంకా ఎవరైనా పాత సాఫ్ట్‌వేర్‌ వెర్షన్లు వాడుతూ ఉంటే వారు వెంటనే తమ డివైజ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం ద్వారానే సైబర్ నేరగాళ్లు తమ వ్యక్తిగత వివరాలు దొంగలించకుండా కాపాడుకోవచ్చని స్పష్టం చేసింది. అప్పుడే సైబర్‌ రిస్క్​ల నుంచి తప్పించుకోవడం సాధ్యపడుతుందని, ఈ నేపథ్యంలో పాతయాపిల్ డివైజ్‌లు వాడుతున్న వారు వెంటనే సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

కిర్రాక్ ఫీచర్లతో ఒప్పో కొత్త స్మార్ట్​ఫోన్లు- 'ఫైండ్ X8' సిరీస్ లాంఛ్ డేట్ ఫిక్స్

మార్కెట్లోకి లగ్జరీ కారు- 3.4 సెకన్లలో 0-100kmph వేగం- 'పెర్ఫార్మెన్స్​'లో దీనికి సాటే లేదుగా!

ABOUT THE AUTHOR

...view details