Maha Kumbh Mela Google Animation: హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్రమైన జాతర 'మహా కుంభమేళా' నేడు రెండో రోజుకు చేరుకుంది. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవం ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రత్యేక రీతిలో తన ట్రిబ్యూట్ తెలియజేస్తోంది. ఇందుకోసం అద్భుతమైన యానిమేషన్‌ను క్రియేట్ చేసి 'మహా కుంభ్'పై గులాబీ రేకుల వర్షాన్ని కురిపిస్తోంది!. ఇలా మీరు కూడా 'మహా కుంభ్'పై గులాబీ రేకులతో అభిషేకం చేయొచ్చు! ఈ యానిమేషన్‌ను ట్రై చేయండం ద్వారా అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.
- ఇందుకోసం మొదట మీరు మీ మొబైల్ లేదా డెస్క్‌టాప్‌లో గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్లండి.
- ఆ తర్వాత అందులో హిందీ లేదా ఇంగ్లీషులో మహా కుంభ్ అనే పదాన్ని టైప్ చేసి క్లిక్ చేయండి.
- ఇప్పుడు స్క్రీన్కు దిగువన గులాబీ రంగులో ఓ ఆప్షన్ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సెర్చ్ రిజల్ట్స్‌తో పాటు పై నుంచి గులాబీ రేకులు కిందికి పడటం స్క్రీన్ మీద కన్పిస్తుంది.
- ఈ యానిమేషన్‌తో పాటు స్క్రీన్ దిగువన ఇప్పుడు మూడు ఆప్షన్లు కన్పిస్తాయి.
- అందులో మొదటి ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఈ యానిమేషన్ ఆఫ్ అయిపోతుంది.
- రెండో ఆప్షన్‌పై క్లిక్ చేస్తే రాలుతున్న గులాబీ రేకుల సంఖ్య పెరుగుతుంది. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ ఆప్షన్‌పై ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అంత ఎక్కువ గులాబీ రేకులు స్క్రీన్‌పై పడుతూ ఉండటం కన్పిస్తుంది.
- ఇక మూడో ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ యానిమేషన్‌ను మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులకు షేర్ చేసుకోవచ్చు.
భక్తులకు సువర్ణావకాశం: మహా కుంభమేళాకు వచ్చే ప్రజలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక సువర్ణావకాశాన్ని కల్పించింది. అదేంటంటే కేవలం 1,296 రూపాయలకే హెలికాప్టర్ ప్రయాణం. ఈ మేరకు ఈ విషయాన్ని యూపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
టికెట్ ధర తగ్గింపు: యూపీ ప్రభుత్వం ప్రయాణికులను ఆకర్షించేందుకు గతంలో 3,000 రూపాయలుగా ఉన్న హెలికాప్టర్ ఛార్జీని ఇప్పుడు సగానికి పైగా తగ్గించింది. ఈ టికెట్ ద్వారా ట్రావెలర్స్ హెలికాప్టర్‌లో పై నుంచి కింద ప్రయాగ్‌రాజ్ నగర వైమానిక దృశ్యాన్ని 7 నుంచి 8 నిమిషాల పాటు వీక్షించగలరని మంత్రి ప్రకటనలో తెలిపారు.
ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్: హెలికాప్టర్‌లో ప్రయాణం కోసం యూపీ ప్రభుత్వం ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. హెలికాప్టర్‌లో ప్రయాణించాలనుకునే వారు www.upstdc.co.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు బాధ్యత వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ పవన్ హన్స్ దీనిపై సమాచారం అందించింది. ఈ ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని, అయితే ప్రతిసారీ వాతావరణాన్ని గమనించిన తర్వాత ప్రయాణాన్ని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. దీనితో పాటు ఈ గ్రాండ్ కాన్ఫరెన్స్ జరిగే ప్రాంతంలో వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేసినట్లు యూపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ వెల్లడించింది.
పండగ వేళ చౌకైన రీఛార్జ్ ప్లాన్ లాంఛ్- రోజుకు రూ.8 కంటే తక్కువ ధరతో అన్లిమిటెడ్ బెనిఫిట్స్!
త్వరలో ఇండియన్ మార్కెట్లోకి అతి పెద్ద ఈవీ కారు!- సింగిల్ ఛార్జ్‌తో 580km రేంజ్!
షాపింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్!- పోటాపోటీ ఆఫర్లు!