ETV Bharat / offbeat

కోల్​కతా ఫేమస్ "లిక్కర్ టీ" - ఈ చలిలో వేడివేడిగా ఇలా చేసుకొని తాగుతుంటే ఆ మజానే వేరు! - LIQUOR TEA RECIPE

రెగ్యులర్ టీని మించిన టేస్ట్ - చలికాలం జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి మంచి రిలీఫ్!

Black Tea Recipe
Liquor Tea Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2025, 1:54 PM IST

Liquor Tea Recipe in Telugu : "టీ" పేరు వింటే చాలు ఎక్కడ లేని హుషారూ పుట్టుకొస్తుంది. అలసట, నీరసం మాయమై రీచార్జయిపోతాం. అలా కబుర్లు చెప్పుకుంటూ వేడివేడిగా తాగుతుంటే స్వర్గం ఇంకెక్కడో లేదు అనిపిస్తుంది. ఇక టీ ప్రియుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజులో ఎన్నిసార్లు తాగుతారో లెక్కే ఉండదు. అయితే, మనందరం ఎక్కువగా డైలీ పాలు, టీ పొడితో చేసుకొనే నార్మల్ టీని తాగుతుంటాం. అలాగే, ఎప్పుడప్పుడు ఇరానీ చాయ్, గ్రీన్ టీ, జింజర్ టీ, హెర్బల్ టీ ఇలా ఎన్నో రకాలను టేస్ట్ చేసి ఉంటారు.

కానీ, ఒకసారి బెంగాలీ స్టైల్​లో "లిక్కర్ టీ"ని ట్రై చేసి చూడండి. దీన్నే కొందరు బ్లాక్ టీ అని కూడా పిలుస్తుంటారు. ఈ చాయ్ సరికొత్త టేస్ట్​తో మంచి పరిమళాలు వెదజల్లుతూ వహ్వా అనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి మంచి ఉపశమనం అందిస్తుంది. మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ లిక్కర్ టీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • అల్లం - అంగుళం ముక్క
  • మిరియాలు - పావుటీస్పూన్
  • పంచదార - 2 టేబుల్​స్పూన్లు
  • బిర్యానీ ఆకులు - 2
  • టీ పొడి - 1 టీస్పూన్

మంచు కురిసే వేళ అద్దిరిపోయే "మసాలా టీ" - వేడివేడిగా గొంతులోకి దిగుతుంటే ఆ కిక్కే వేరబ్బా!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా అల్లం ముక్కను కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత మిరియాలను కూడా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై ఒక గిన్నెలో 300ఎంఎల్ వరకు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. అయితే, ఇక్కడ మేము చెప్పే ఈ కొలత 100ఎంఎల్​గా తీసుకుంటే ముగ్గురు వ్యక్తులకు సరిపోతుంది.
  • నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో చక్కెర వేసి కలిపి హై ఫ్లేమ్ మీద వాటర్​ని బాగా తెర్లకాగనివ్వాలి.
  • పంచదార కరిగి నీరు పొంగుతున్నప్పుడు బిర్యానీ ఆకులను తుంపి వేసుకోవాలి. అలాగే, కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి, అల్లం వేసి కలిపి మరోసారి హై ఫ్లేమ్ మీద రంగు మారేంత వరకు మరగనివ్వాలి.
  • అలా మరిగించుకున్నాక టీ పొడి వేసి కలిపి హై ఫ్లేమ్ మీద ఒకే ఒక నిమిషం పాటు మరిగించి స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువగా మరిగించుకుంటే చాయ్ టేస్ట్ మారిపోతుందని గుర్తుంచుకోవాలి.
  • ఆ తర్వాత వడకట్టుకొని అలా కాస్త పైకి ఎత్తిపెట్టి గ్లాసులలో చాయ్​ని పోసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెంగాలీ స్పెషల్ "లిక్కర్ టీ" రెడీ!
  • మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ టీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ చాలా బాగా ఆస్వాదిస్తారు. ఉదయం మంచు కురుస్తున్నప్పుడు వేడివేడిగా ఈ లిక్కర్​ టీ కొద్దికొద్దిగా గొంతులోకి దిగుతుంటే ఆ కిక్కే వేరబ్బా!

ఒత్తిడితో సతమతమవుతున్నారా? - "గులాబీ టీ" తాగితే ఇట్టే తగ్గుతుందట- పైగా వెయిట్​ లాస్​ అవ్వొచ్చట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.