Vodafone Idea Launched Rs 209 Plan: పండగ వేళ వొడాఫోన్ ఐడియా సైలెంట్‌గా 209 రూపాయలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అయితే వీఐ (వొడాఫోన్-ఐడియా) వినియోగదారులకు ఇప్పటికే రూ.199 రీఛార్జ్ ప్లాన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. తాజాగా కంపెనీ ఈ ప్లాన్ కంటే రూ.10 ఎక్కువ ధరతో సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కేవలం 10 రూపాయల తేడాతో ఉన్న ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం రండి.
వొడాఫోన్-ఐడియా కొత్త ప్లాన్: వొడాఫోన్-ఐడియా ఈ కొత్త రూ. 209 ప్లాన్‌లో వినియోగదారులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తుంది. ఇది కాకుండా ఈ ప్లాన్‌తో మొత్తం 2GB ఇంటర్నెట్ డేటా, 300 SMSలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.
అదే సమయంలో వొడాఫోన్-ఐడియా రూ. 199 ప్లాన్‌లో కూడా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 2GB డేటాతో పాటు రోజుకు 300 SMSలను అందిస్తుంది. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులు.
అయితే ఈ రెండు ప్లాన్లూ ఒకే విధమైన బెనిఫిట్స్‌ను అందిస్తున్నాయి కదా, మరి రూ.10 ఎక్కువ ధరతో కంపెనీ ఎందుకు ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చిందనే అనే అనుమానం అందరిలో తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో వీఐ రూ.199, రూ.209 ప్లాన్‌ల మధ్య తేడా ఏంటి? వీఐ కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్‌లో అదనంగా ఏం అందిస్తుంది? అంటే నిజానికి ఈ రెండు ప్లాన్‌ల మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా అన్లిమిటెడ్ కాలర్ ట్యూన్స్ ఫెసిలిటీ.
కేవలం రూ.10 తేడాతో అన్లిమిటెడ్ కాలర్ ట్యూన్స్: కాలర్ ట్యూన్‌లను తరచుగా మార్చడానికి ఇష్టపడే వీఐ యూజర్లకు వీఐ తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. అదనంగా రూ.10 ఖర్చుతో రూ.209 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే రూ. 199 ప్లాన్ మాదిరిగానే అన్ని బెనిఫిట్స్‌తో పాటు అన్లిమిటెడ్ కాలర్ ట్యూన్స్ ఫెసిలిటీ పొందొచ్చు.
ఈ ప్లాన్ వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించొచ్చు. ఎందుకంటే వీటి ధరల మధ్య వ్యత్యాసం కూడా ఎక్కువగా ఏం లేదు. మీరు రూ.199 ప్లాన్ రోజువారీ ఖర్చును లెక్కిస్తే అది రోజుకు దాదాపు రూ.7.11 అవుతుంది. అయితే రూ.209 ప్లాన్ రోజువారీ ఖర్చు రూ.7.46. అంటే వినియోగదారులు రోజుకు 35 పైసలు మాత్రమే అదనంగా ఖర్చు చేయడం ద్వారా అపరిమిత కాలర్ ట్యూన్‌ల ప్రయోజనాన్ని పొందొచ్చు.
వీటితో పాటు వోడాఫోన్-ఐడియా రూ.218 అడిషనల్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఇది అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు 300 SMSలు, మొత్తం 3GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ పూర్తిగా ఒక నెల పాటు వ్యాలిడిటీతో వస్తుంది. అంటే మీరు రీఛార్జ్ ఏ తేదీన చేస్తారో దాని తర్వాత నెల అదే డేట్ వరకు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది.
త్వరలో ఇండియన్ మార్కెట్లోకి అతి పెద్ద ఈవీ కారు!- సింగిల్ ఛార్జ్‌తో 580km రేంజ్!
షాపింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్!- పోటాపోటీ ఆఫర్లు!
శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ రెండర్స్ లీక్- ఒక్కో మోడల్ స్పెక్స్ వివరాలు ఇవే!