ETV Bharat / state

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్​లో ఉద్యోగాలు - జీతం లక్షా నలభై వేలు! - BEL ENGINEERS RECRUITMENT 2025

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ నోటిఫికేషన్ విడుదల - 350 ప్రొబేషనరీ ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయనున్న బెల్

BEL Probationary Engineer Recruitment 2025
BEL Probationary Engineer Recruitment 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2025, 6:49 PM IST

BEL Probationary Engineer Recruitment 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్​ (బెల్​) 350 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో ప్రొబేషనరీ ఇంజినీర్ ఎలాక్ట్రానిక్స్ 200, మెకానికల్ 150 ఖాళీలున్నాయి. ​

మొత్తం ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్‌లకు 143 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌లకు 35, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 94, ఎస్సీలకు 52, ఎస్టీలకు 26 కేటాయించారు.

అర్హతలు : కమ్యూనికేషన్‌/ టెలికమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ మెకానికల్‌ బ్రాంచ్‌లతో పాటు బీఈ/ బీటెక్‌ / ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ బీఎస్సీ కోర్సులు చదివినవారు ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు పాసైతే సరిపోతుంది.

ఇవే బ్రాంచిలతో జీఐఈటీఈ/ ఏఎంఐఈ/ ఏఎంఐఈటీఈ పూర్తిచేసిన వారూ, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న వారూ అర్హులే. అయితే రెండు స్పెషలైజేషన్లు చేసినవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.

ఎస్‌బీఐలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు - ఈ టిప్స్ పాటిస్తే జాబ్ కొట్టేస్తారు!

వయసు : 01.01.2025 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌), మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంది.

ఎలా ఎంపిక చేస్తారంటే :

విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షకు (సీబీటీ) ఎంపిక చేస్తారు. దీంట్లో జనరల్‌/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌లు 35 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 30 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి. వీరిని 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతంగా విభజించి దాని ప్రకారం పరీక్ష నిర్వహిస్తారు.

  • 125 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. టెక్నికల్‌ ప్రశ్నలు 100, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ రీజనింగ్‌ 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.
  • సబ్జెక్టు సంబంధిత అంశాల నుంచే ప్రశ్నలు ఉంటాయి. అదనంగా జనరల్‌ ఆప్టిట్యూడ్, అనలిటికల్‌ అండ్‌ రీజనింగ్‌ ప్రశ్నలూ ఇస్తారు.
  • రాత పరీక్షలో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత తుది ఎంపిక చేస్తారు

వేతనం: నెలకు రూ.40,000-1,40,000 ఉంటుంది. మూల వేతనంతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, కన్వీయన్స్‌ అలవెన్స్, పర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే, మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌ సదుపాయాలూ ఉంటాయి.

పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్​లో రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లా

దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2025

వెబ్‌సైట్‌: https://bel-india.in

మీ పిల్లల్ని సైనిక్‌ స్కూళ్లలో చేర్పించాలనుకుంటున్నారా? - మీ కోసమే ఈ సువర్ణావకాశం!

స్టేట్‌ బ్యాంక్​లో భారీగా ఉద్యోగాలు - 4:3:2:1 ఫార్ములాతో జాబ్​ కొట్టండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.