ETV Bharat / state

VIRAL VIDEO : సైడ్‌ నుంచి వెళ్లమన్నందుకు ఆటోడ్రైవర్‌పై పిడిగుద్దుల వర్షం - YOUNG MAN ATTACKS AUTO DRIVER

ఆటో డ్రైవర్‌పై యువకుడి దాడి - దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు - హైదరాబాద్‌లో జరిగిన ఘటన

Young Man Attacks Auto Driver
Young Man Attacks Auto Driver (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2025, 7:06 AM IST

Updated : Feb 19, 2025, 8:25 AM IST

Young Man Attacks Auto Driver : ఆటో డ్రైవర్‌పై ఓ యువకుడు విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన హైదరాబాద్‌ మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వెంగళ్​రావు నగర్‌ ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. స్థానికులు రక్షించడంతో దాడి నుంచి బయటపడ్డ ఆటో డ్రైవర్‌, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వెంగళ్​రావు నగర్‌ ప్రాంతంలో ఓ యువకుడు ఆటో డ్రైవర్‌ను సైడ్‌ ఇవ్వమని అడిగాడు. అందుకు సమాధానంగా ఆటోడ్రైవర్‌ 'అన్న ప్లేస్‌ ఉంది. కొంచెం అటువైపు నుంచి నెమ్మదిగా వెళ్లు' అని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు ఆటోడ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరిగి తీవ్రస్థాయికి చేరుకుంది. వెంటనే యువకుడు ఆటో డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు.

ఆటో డ్రైవర్‌ను విచక్షణారహితంగా చితకబాదాడు. ముఖం, కడుపుపై పిడిగుద్దులు గుద్దుతూ దారుణంగా ప్రవర్తించాడు. దెబ్బలకు తాళలేక ఆటో డ్రైవర్ ఆర్ధనాదాలు చేశాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఆటో డ్రైవర్‌ను రక్షించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి స్థానికులను, ఆటో డ్రైవర్‌ను దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

కేసు నమోదు : ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను వీక్షించారు. అందులో ఆటోడ్రైవర్‌ను యువకుడు కొట్టడం స్పష్టంగా కనిపించింది. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

'రోజూ మా కాళ్లొత్తు - అడిగినప్పుడు పైసలివ్వు' - క్లాస్​మేట్​పై పదో తరగతి విద్యార్థుల దాష్టీకం

'నాకే జీవిత ఖైదు విధిస్తావా - నీ అంతు చూస్తా!' : మహిళా జడ్జిపై చెప్పుతో నిందితుడి దాడి

Last Updated : Feb 19, 2025, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.