BMW iX Facelift:మార్కెట్లోకి త్వరలో BMW నుంచి కొత్త కారు ఎంట్రీ ఇవ్వబోతుంది. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW తన ఆల్-ఎలక్ట్రిక్ SUV BMW iX ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అదిరే అప్డేట్లతో కంపెనీ ఈ కారును తీసుకురానుంది. దీనికి మిడ్-లైఫ్-సైకిల్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మార్పులలో బిగ్గెస్ట్ అప్‌గ్రేడ్ దాని ఇంటీరియర్‌లో జరిగింది. అలాగే దీని అన్ని వేరియంట్లలో మరింత పవర్ఫుల్ అండ్ ఎఫిషియంట్ ఎలక్ట్రిక్ మోటారును అందించారు.
BMW iX ఫేస్‌లిఫ్ట్ డిజైన్:ఈ కొత్త BMW iX కారుకు కొత్త ఫ్రంట్ ఫాసియా ఇచ్చారు. ఇది మునుపటి కంటే కొంచెం ఎక్కువ మజిల్స్ లుక్‌లో కన్పిస్తుంది. దీని హెడ్‌ల్యాంప్స్‌ను కూడా సవరించారు. పాత మోడల్‌లోని ఐ-బ్రో లేఅవుట్‌కు భిన్నంగా LED డేటైమ్ రన్నింగ్ లాంప్‌లు ఇప్పుడు యూనిట్‌లో నిలువుగా అమర్చారు.
భారీ పరిమాణంలో ఉన్న దీని క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్ విభిన్న గ్రాఫిక్స్‌లను కలిగి ఉంది. అయితే మొత్తం ఫ్రంట్ బంపర్‌ను మరింత యాంగ్యులర్ యూనిట్‌గా మార్చారు. ఇది SUV విజువల్ మాస్‌ను పెంచుతుంది. ఇక కారు సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఇందులోని అల్లాయ్ వీల్స్ తప్ప ఇక్కడ పెద్దగా మార్పులు చేయలేదు. దీని వెనక భాగంలో చేసిన మార్పులలో టెయిల్ లాంప్స్, బంపర్‌లో ఉన్నాయి.
BMW iX ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్:ఈ కారు ఇంటీరియర్ విషయానికొస్తే దీని క్యాబిన్లో పెద్దగా మార్పులు చేయలేదు. దీని బేసిక్ డిజైన్‌లో ఎటువంటి మార్పు లేదు. ఇది ముందు సీట్లలో పెద్ద ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్‌లను కలిగి ఉంది. ఈ కారులోని ఎంపిక చేసిన వేరియంట్లలో M స్పోర్ట్స్ ప్యాకేజీతో M మల్టీఫంక్షన్ సీట్లను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్యాక్ టాప్ వేరియంట్లలో స్టాండర్డ్‌గా వస్తుంది. వీటితో పాటు కారులోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ సెంట్రల్ టచ్‌స్క్రీన్‌లకు ఇప్పుడు BMW iDrive 8.5 సాఫ్ట్‌వేర్ అందించారు.
BMW iX ఫేస్‌లిఫ్ట్ పవర్‌ట్రెయిన్: ఈ కారులో బిగ్గెస్ట్ ఛేంజ్ దాని పవర్‌ట్రెయిన్‌లో చేశారు. ఈ కొత్త BMW iX ఫేస్‌లిఫ్ట్ దాని పాత xDrive40, xDrive50, M60 వేరియంట్‌లను కొత్త xDrive45, xDrive60, M70 వేరియంట్‌లతో భర్తీ చేసింది. దీని కొత్త పేరుకు తగ్గట్టుగానే దీని పవర్, ఎఫిషియన్సీ కూడా పెరిగాయి. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV ఎలక్ట్రిక్ మోటార్లను కూడా మెరుగుపరిచినట్లు చెబుతోంది.