తెలంగాణ

telangana

ETV Bharat / technology

టాటా మోటార్స్ ఖాతాలో మరో రికార్డ్- ఏకంగా ఆ మైలు రాయిని దాటేసిన ఈవీ..! - TATA TIAGO EV SALES

టాటా టియాగో ఈవీ క్రేజీ డిమాండ్- 50,000 యూనిట్ల సేల్స్​తో రికార్డ్..!

Big Achievement of Tata Tiago EV
Big Achievement of Tata Tiago EV (Tata Motors)

By ETV Bharat Tech Team

Published : Oct 27, 2024, 12:11 PM IST

Big Achievement of Tata Tiago EV:ఈవీ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతున్న స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా మరో ఘనత సాధించింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువ. అందులో మరీ ముఖ్యంగా టాటా టియోగో ఈవీకి క్రేజీ డిమాండ్ ఉంది. తాజాగా ఈ ఈవీ 50,000 సేల్స్ మైలు రాయిని అధిగమించినట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

టాటా మోటార్స్ మార్కెట్‌లో మొత్తం ఐదు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. అందులో ఈ హ్యాచ్‌బ్యాక్ ఒకటి. కంపెనీ ఈ కారును సెప్టెంబర్ 2022లో ఇండియన్ మార్కెట్లోకి పరిచయం చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 2023 నుంచి దీని అమ్మకాలను ప్రారంభించింది. ఈ కారు డెలివరీలు ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత మే 2023లో ఇది 10,000 యూనిట్ల సేల్స్ మార్కును తాకింది.

గత 17 నెలల్లో టాటా టియాగో ఈవీ 40,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్​బ్యాక్ కేవలం 24 గంటల్లో 10,000 బుకింగ్స్ సొంత చేసుకుని అప్పట్లో దేశంలో అత్యంత వేగంగా బుక్ అయిన ఈవీగా నిలిచింది. ఆ తర్వాత ఇటీవల ఎంజీ విండ్సర్ ఈవీ 24 గంటల్లోనే విండోలో 15,000 సేల్స్ దాటి టాటా టియాగో ఈవీ రికార్డ్​ను బ్రేక్ చేసింది.

టాటా టియాగో EV కాకుండా కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు టాటా నెక్సాన్ EV, టాటా పంచ్ EV, టాటా టిగోర్ EV, టాటా ఎక్స్-ఎక్స్‌ప్రెస్ T EV, కొత్త టాటా కర్వ్డ్ EV కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ కూడా టాటా హారియర్ EV, సఫారి EV, అవిన్య, టాటా సియెర్రా EVలను వచ్చే ఏడాది జాబితాలో చేర్చే అవకాశం ఉంది. టాటా టియోగో ఈవీ 50,000 సేల్స్ మైలు రాయిని తాకిన సందర్భంగా దీని ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి.

Tata Tiago EV (Tata Motors)

వేరియంట్స్:

  • EV XE
  • XT
  • XZ+
  • XZ+ లక్స్

కలర్ ఆప్షన్స్​:

  • టీల్ బ్లూ
  • డేటోనా గ్రే
  • ట్రాపికల్ మిస్ట్
  • ప్రిస్టైన్ వైట్
  • మిడ్‌నైట్ ప్లం

పవర్‌ట్రెయిన్ అండ్ రేంజ్:టాటాటియాగో EVతో 19.2kWh, 24kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్స్ ఆప్షన్స్​లో అందుబాటులో ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్‌ల విషయానికొస్తే ఎలాంటి సమస్యలు లేకుండా ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌ చేస్తే 275 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

ధర:ఈ కారు ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచఇ ప్రారంభమవుతుంది. దీని టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఫొటోస్​ను గుర్తించే కొత్త ఫీచర్​- ఇకపై ఫేక్ చిత్రాలను గుర్తుపట్టడం ఈజీ- అదెలాగంటే?

యాపిల్ కొత్త ప్రొడక్ట్స్​పై అప్డేట్ వచ్చేసిందోచ్..!- రిలీజ్ ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details