తెలంగాణ

telangana

ETV Bharat / technology

రూ.30,000 బడ్జెట్​లో మంచి ట్యాబ్​ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్​ ఇవే! - Xiaomi Mi Pad 5 pad price

Best Tabs Under 30000 : మీరు మంచి ట్యాబ్లెట్​ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్​ రూ.30,000 మాత్రమేనా? అయితే ప్రస్తుతం మీ బడ్జెట్​లో అందుబాటులో ఉన్న టాప్​-10 ట్యాబ్లెట్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

top ten tablets under 30000
Best Tabs Under 30000

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 4:17 PM IST

Best Tabs Under 30000 :మీరు మంచి ఫీచర్లున్న ట్యాబ్​ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.30వేలు మాత్రమేనా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. ఈ ఆర్టికల్​లో మీ బడ్జెట్​లో వచ్చే టాప్​-10​ ట్యాబ్లెట్స్​ గురించి తెలుసుకుందాం. వీటితో పాటు ట్యాబ్లెట్​ కొనుగోలు చేయడానికి ముందు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి అనే విషయాలను చూద్దాం.

మీరు ఎంత బడ్జెట్​లో ట్యాబ్లెట్​ కొనుగోలు చేయాలనుకుంటున్నప్పటికీ డిస్​ప్లే క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, యూజర్ ఎక్స్​పీరియన్స్, స్టోరేజ్​, ఆపరేటింగ్ సిస్టమ్​, ప్రాసెసర్​ తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే ఈ ఆర్టికల్​లో రూ.​30 వేల బడ్జెట్లో మంచి ఫీచర్స్​, స్పెక్స్​ ఉన్న టాప్​-10 ట్యాబ్స్ గురించి తెలుసుకుందాం.

1.Realme Pad X 5G 128GB Features :ఈ రియల్​మీ ప్యాడ్​ ఎక్స్ 5జీ ట్యాబ్ అనేది ఆండ్రాయిడ్ వీ11 ఆపరేటింగ్ సిస్టమ్​తో పనిచేస్తుంది. ఈ ట్యాబ్​లో ఫింగర్​ప్రింట్ సెన్సర్​ ఉంటుంది. అలాగే క్విక్​ ఛార్జింగ్ సౌలభ్యం కూడా ఉంది.

  • బ్రాండ్ :రియల్​మీ ప్యాడ్​ ఎక్స్ 5జీ
  • డిస్​ప్లే :10.95 అంగుళాలు
  • ప్రైమరీ కెమెరా : 13 MP
  • ఫ్రంట్ కెమెరా : 8 MP
  • ప్రాసెసర్ :ఆక్టా కోర్ 2.2 GHz
  • బ్యాటరీ : 8340 mAh
  • నెట్​వర్క్ :వాయిస్​ కాల్​, 5జీ సపోర్టెడ్​
  • స్టోరేజ్​ :128 జీబీ

Realme Pad X 5G 128GB Price :ప్రస్తుతం మార్కెట్​లో ఈ రియల్​మీ ప్యాడ్​ ఎక్స్​ 5జీ ధర సుమారుగా రూ.28,900 ఉంటుంది.

2.Xiaomi Mi Pad 5 Features :ఈ షావోమీ ఎమ్​ఐ ట్యాబ్​లో ఆండ్రాయిడ్ 11 వెర్షన్​ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ట్యాబ్​లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 860 చిప్​ సెట్​ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్​ సౌలభ్యం ఉంది.

  • బ్రాండ్ పేరు :షావోమీ ఎమ్​ఐ ప్యాడ్​ 5
  • డిస్​ప్లే :11 అంగుళాలు
  • ప్రైమరీ కెమెరా : 13MP
  • ఫ్రంట్ కెమెరా :8MP
  • ఆపరేటింగ్ సిస్టమ్ :ఆండ్రాయిడ్ 11
  • బ్యాటరీ :8720 mAh
  • ప్రాసెసర్ : ఆక్టా కోర్​2.96 GHz
  • స్టోరేజ్ :128 జీబీ

Xiaomi Mi Pad 5 Price :ప్రస్తుతం మార్కెట్​లో ఈ షావోమీ ఎమ్​ఐ ప్యాడ్​ 5 ధర సుమారుగా రూ.25,998 ఉంటుంది.

3.Lenovo Tab P12 Features :ఈ లెనోవో ట్యాబ్​ పీ12 మోడల్​ ఆండ్రాయిడ్​ వి13 ఆపరేటింగ్ సిస్టమ్​తో పనిచేస్తుంది. దీనికి ఫాస్ట్​ ఛార్జింగ్ సౌలభ్యం ఉంది.

  • డిస్​ప్లే :12.7 అంగుళాల డిస్​ప్లే
  • ప్రైమరీ కెమెరా :8MP
  • ఫ్రంట్ కెమెరా :13MP
  • బ్యాటరీ :6400 mAh
  • ప్రాసెసర్ :ఆక్టా కోర్ మీడియాటెక్​ డైమెన్షిటీ 7050
  • ర్యామ్​ :8GB
  • ఇంటర్నల్​ స్టోరేజీ :256GB (1TB వరకూ ఎక్స్​ప్యాండ్ చేసుకోవచ్చు.)

Lenovo Tab P12 Price : ప్రస్తుతం మార్కెట్​లో ఈ లెనోవో ట్యాబ్​ పీ12 ధర సుమారుగా రూ.28,999 ఉంటుంది.

4.Xiaomi Pad 6 256GB Features :క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ ప్రాసెసర్​తో ఈ షావోమీ ప్యాడ్​ 6 ట్యాబ్​ వస్తోంది. దీని ఇంటర్నల్ మెమొరీ 256జీబీ ఉంటుంది.

  • డిస్​ప్లే :11 అంగుళాల డిస్​ప్లే
  • ప్రైమరీ కెమెరా :13MP
  • ఫ్రంట్ కెమెరా :8MP
  • ఆపరేటింగ్ సిస్టమ్ :ఆండ్రాయిడ్ V13
  • బ్యాటరీ :8840 mAh
  • ప్రాసెసర్ : ఆక్టా కోర్​ 3.2GHz,si
  • ర్యామ్​ : 8 GB
  • బ్లూటూత్ : V5.2 బ్లూటూత్ ఫెసిలిటీ ఉంది.

Xiaomi Pad 6 256GB Price :మార్కెట్​లో ఈ షావోమీ ప్యాడ్​ 6 ట్యాబ్​ ధర సుమారుగా రూ.26,999 ఉంటుంది.

5.Apple iPad Features : ఈ యాపిల్ ఐప్యాడ్​​ 3జీబీ ర్యామ్​తో వస్తోంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యం ఉంది.

  • బ్రాండ్ :యాపిల్​
  • స్క్రీన్​ సైజ్​ :10.2 అంగుళాలు
  • ప్రైమరీ కెమెరా :8 MP
  • ప్రాసెసర్ :హెక్సాకోర్​
  • ర్యామ్ :3 జీబీ
  • బ్యాటరీ టైప్​ : Li-Polymer

Apple Ipad Price :ఈ యాపిల్ ఐప్యాడ్​ ధర మార్కెట్లో సుమారుగా రూ.29,475 ఉంటుంది.

6.Lenovo Tab P12 128GB Features :ఈ లెనోవో ట్యాబ్​ పీ12 ట్యాబ్​ ఆండ్రాయిడ్ V12 ఆపరేటింగ్ సిస్టమ్​తో పనిచేస్తుంది. ఈ ట్యాబ్​ స్క్రీన్​ సైజు 12.7 అంగుళాలు ఉంటుంది.

  • బ్రాండ్​ :లెనోవో
  • ఫ్రంట్ కెమెరా :13MP
  • ప్రైమరీ కెమెరా : 8MP
  • బ్యాటరీ :10200 mAh
  • ఛార్జింగ్ కేబుల్​ టైప్ :సి-కేబుల్
  • ప్రాసెసర్ : మీడియా టెక్ డైమెన్షిటీ 7050
  • ర్యామ్ :8GB
  • ఇంటర్నల్ స్టోరీజ్​ :128 జీబీ

Lenovo Tab P12 128GB Price :ప్రస్తుతం మార్కెట్​లో దీని ధర సుమారుగా రూ.26,999 ఉంటుంది.

7.Google Pixel C 64GB Features :ఈ గూగుల్ పిక్సెల్ సీ 64జీబీ ట్యాబ్​లో 10.2 అంగుళాల డిస్​ప్లే ఉంటుంది. దీనిలో 9000mAh సామర్థ్యం గల బ్యాటరీ కూడా ఉంటుంది.

  • బ్రాండ్​ : గూగుల్
  • మోడల్ : పిక్సెల్​-సీ 64 జీబీ
  • ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్​ v6.0.1
  • ప్రైమరీ కెమెరా : 8MP
  • ఫ్రంట్ కెమెరా :2MP
  • ప్రాసెసర్ : ఆక్టో కోర్​
  • కలర్​ : బ్లాక్
  • ప్రాసెసర్ : Nvidia
  • ర్యామ్ :3జీబీ

Google Pixel C 64GB Price : ప్రస్తుతం మార్కెట్​లో ఈ గూగుల్ పిక్సెల్ సీ 64జీబీ ధర సుమారుగా రూ.30,000 ఉంటుంది.

8.Samsung Galaxy Tab S6 Lite LTE Features : ఈ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6లో 10.6 అంగుళాల డిస్​ప్లే ఉంటుంది. దీంతోపాటు 7040mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుంది.

  • బ్రాండ్ :శాంసంగ్
  • ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ ట్యాబ్​ ఎస్​6 లైట్
  • ప్రాసెసర్ :ఆక్టా కోర్​
  • ర్యామ్ : 4GB
  • ఇంటర్నల్ మెమోరీ :64GB
  • ప్రైమరీ కెమెరా :8 MP
  • ఫ్రంట్ కెమెరా​ : 5MP
  • ఆడియో జాక్ : 3.5mm

Samsung Galaxy Tab S6 Price :ఈ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్​ ధర సుమారుగా రూ.29,998 ఉంటుంది.

9.realme Pad X 5G Features : ఈ రియల్​మీ ప్యాడ్ X 5G ట్యాబ్​ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్​తో పనిచేస్తుంది. ఈ ట్యాబ్​లో 8340 సామర్థ్యం గల బ్యాటరీ ఉంది.

  • బ్రాండ్ :రియల్​మీ
  • మోడల్ : ప్యాడ్ ఎక్స్ 5జీ
  • డిస్​ప్లే :10.95
  • మోడల్ :ప్యాడ్​ ఎక్స్ 5జీ
  • ఛార్జింగ్ : క్విక్ ఛార్జింగ్
  • ఇంటర్నల్ మెమరీ : 64జీబీ
  • ప్రాసెసర్ : ఆక్టాకోర్
  • ర్యామ్ : 4జీబీ

Realme Pad X 5G Price : ప్రస్తుతం మార్కెట్​లో ఈ రియల్​మీ ప్యాడ్​ ఎక్స్ 5జీ ట్యాబ్​ ధర సుమారుగా రూ.25,999 ఉంటుంది.

10.Xiaomi Mi Pad 5 256GB Features
ఈ షావోమీ ఎమ్​ఐ ప్యాడ్​ 5 ట్యాబ్​కు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​ ఉంటుంది.

  • బ్రాండ్ : షావోమీ
  • ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్​ వి11
  • ఇంటర్నల్ మెమరీ : 256 జీబీ
  • రిజల్యూషన్ :13MP
  • ప్రైమరీ కెమెరా : 13MP
  • ఫ్రంట్ కెమెరా :8 MP
  • మెమొరీ : 256 జీబీ

Xiaomi Mi Pad 5 256GB Price :ప్రస్తుతం మార్కెట్​లో ఈ షావోమీ ఎమ్​ఐ ప్యాడ్​ 5 ధర సుమారుగా రూ.27,999 ఉంటుంది.

రియల్​మీ వాలెంటైన్స్ డే సేల్​ - స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్స్ & ఆఫర్స్!

రూ.30వేలు బడ్జెట్లో మంచి ల్యాప్​టాప్ కొనాలా? టాప్​-8 ఆప్షన్స్ ఇవే!

ABOUT THE AUTHOR

...view details