Best Smart Phones Under 20000 : మన దేశంలో స్మార్ట్ఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మీడియం బడ్జెట్లో మంచి ఫీచర్స్, స్పెక్స్ ఉన్న ఫోన్లకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు అన్నీ మంచి ఫీచర్లు, కెమెరాలు ఉన్న ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. అందుకే ఈ ఆర్టికల్‌లో రూ.20,000 బడ్జెట్లోని టాప్-5 స్మార్ట్ఫోన్లపై ఓ లుక్కేద్దాం రండి.
1.Samsung Galaxy M34 Specifications : శాంసంగ్ కంపెనీ విడుదల చేసిన 5జీ ఫోన్ ఇది. దీని ఫెర్ఫామెన్స్ చాలా బాగుంటుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. భారీ బ్యాటరీ ఉండటం మరో ప్లస్ పాయింట్.
- డిస్ప్లే : 6.5 అంగుళాలు
- ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్
- ర్యామ్ :6జీబీ
- బ్యాటరీ : 6000 mAh
- రియర్ కెమెరా : 50 MP +8MP+2MP
- ఫ్రంట్ కెమెరా : 13 MP
- Samsung Galaxy M34 Price : మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం34 ధర సుమారుగా రూ. 15,995 ఉంటుంది.
2.Moto G54 Specifications : మంచి మ్యూజిక్‌ను వినాలనుకునే వారికి ఈ మోటో జీ54 ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లో డాల్బీ-ఆటమ్స్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మంచి చిప్సెట్ ఉన్నందువల్ల స్మార్ట్‌ఫోన్ ఫెర్ఫామెన్స్ కూడా బాగుంటుంది.
- డిస్ప్లే :6.5 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7020
- ర్యామ్ : 8జీబీ ర్యామ్
- బ్యాటరీ : 6000 mAh
- రియర్ కెమెరా :50 MP +8MP డ్యుయల్ ప్రైమ్
- ఫ్రంట్ కెమెరా : 16MP
- Moto G54 Price :మార్కెట్లో మోటో జీ54 ధర సుమారుగా రూ.15,149గా ఉంటుంది.
3.realme 11 Specifications : రియల్మీ కంపెనీ విడుదల చేసిన 5జీ స్మార్ట్ ఫోన్ ఇది. ఈ రియల్మీ 11 5జీ స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ ఫెర్ఫామెన్స్, డిస్ప్లే పరంగా బాగుంటుంది. దీంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యం కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ల కోసం ఈ స్మార్ట్ ఫోన్లో 16 ఎంపీ కెమెరా ఉంది.
- డిస్ప్లే : 6.72 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 610
- ర్యామ్ : 8జీబీ ర్యామ్
- బ్యాటరీ :5000 mAh
- రియర్ కెమెరా : 108 MP+2 MP డ్యుయల్ ప్రైమ్
- ఫ్రంట్ కెమెరా : 16 MP
- ఇంటర్నల్ మెమొరీ : 128 జీబీ
Realme 11 Price : మార్కెట్లో ఈ రియల్ మీ 11 ధర సుమారుగా రూ.16,149 ఉంటుంది.