Best Camera Smart Phones under 25000 : సోషల్ మీడియా హవా నడుస్తున్న నేటి కాలంలో, హైక్వాలిటీ కెమెరా ఫీచర్స్ ఉన్న మొబైల్స్‌కు మంచి డిమాండ్ ఉంది. వీటి కోసం చాలా మంది భారీగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. కానీ రూ.25 వేల బడ్జెట్లో కూడా మంచి కెమెరా సెటప్ ఉన్న ఫోన్లు నేడు అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్-10 మొబైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Samsung Galaxy F54 5G Features : సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు, సెల్ఫీ లవర్స్‌కు ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 స్మార్ట్‌ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో 108ఎంపీ రియర్ కెమెరా, 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. వీటితో స్టన్నింగ్ వీడియోలు, ఫొటోస్ తీసుకోవచ్చు.
- డిస్ప్లే : 6.7 అంగుళాలు
- ప్రాసెసర్ : శాంసంగ్ ఎక్సినోస్ 1380
- ర్యామ్ : 8 జీబీ
- బ్యాటరీ : 6000 mAh
- రియర్ కెమెరా : 108 MP + 8 MP + 2 MP
- ఫ్రంట్ కెమెరా : 32 MP
Samsung Galaxy F54 5G Price : మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 ఫోన్ ధర సుమారుగా రూ.24,497 ఉంటుంది.
2. Motorola Edge 40 Neo Features :మంచి కెమెరా ఫోన్ కొనాలని ఆశపడేవారికి ఈ మోటరోలా ఎడ్జ్ 40 నియో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
- డిస్ప్లే : 6.55 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7030
- ర్యామ్ : 8 జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- రియర్ కెమెరా : 50 MP + 13 MP
- ఫ్రంట్ కెమెరా : 32 MP
Motorola Edge 40 Neo Price : మార్కెట్లో ఈ మోటరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ ధర సుమారుగా రూ.24,139 ఉంటుంది.
3. POCO X6 5G Features :ఈ పోకో ఎక్స్6 ఫోన్లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో మంచి కెమెరా సెటప్ ఉంది. కనుక సూపర్ ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. పైగా దీనికి టర్బో ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది.
- డిస్ప్లే : 6.67 అంగుళాలు
- ప్రాసెసర్ :స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్2
- ర్యామ్ : 8 జీబీ
- బ్యాటరీ : 5100 mAh
- రియర్ కెమెరా : 64 MP + 8 MP + 2 MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP
POCO X6 5G Price : మార్కెట్లో ఈ పోకో ఎక్స్6 ఫోన్ ధర సుమారుగా రూ.22,960 వరకు ఉంటుంది.
4. IQOO 7 Features : ఈ ఐకూ 7 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ కలర్ ఎల్డీఈ ఫ్లాష్ ఉంది. మంచి ఫొటోస్, వీడియోస్ తీయడానికి ఇది చాలా బాగుంటుంది. దీనికి ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
- డిస్ప్లే : 6.62 అంగుళాలు
- ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 870
- ర్యామ్ :8 జీబీ
- బ్యాటరీ : 4400 mAh
- రియర్ కెమెరా : 48 MP + 13 MP + 2 MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP
IQOO 7 Price : మార్కెట్లో ఈ ఐకూ 7 ఫోన్ ధర సుమారుగా రూ.21,490 ఉంటుంది.
5. Xiaomi Redmi Note 12 Pro 5G Features : సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ఆశించేవారికి మీడియం బడ్జెట్లో దొరుకుతున్న బెస్ట్ ఆప్షన్ ఈ రెడ్మీ నోట్ 12 ప్రో ఫోన్. దీని ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపాటి వీడియో ఎడిటింగ్ టూల్స్‌ను కూడా దీనితో ఆపరేట్ చేయవచ్చు.
- డిస్ప్లే :6.67 అంగుళాలు
- ప్రాసెసర్ :మీడియాటెక్ డైమెన్సిటీ 1080
- ర్యామ్ : 6 జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- రియర్ కెమెరా :50 MP + 8 MP + 2 MP
- ఫ్రంట్ కెమెరా :16 MP
Xiaomi Redmi Note 12 Pro Price : మార్కెట్లో ఈ రెడ్మీ నోట్ 12 ప్రో ధర సుమారుగా రూ.21,490 ఉంటుంది.