ETV Bharat / state

తండ్రి వాట్సాప్‌కు లొకేషన్‌ - ప్రేమ జంట సజీవదహనం కేసులో ట్విస్ట్! - LOVERS SUICIDE CASE UPDATE

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రేమజంట ఆత్మహత్య కేసు - బాలిక ప్రేమ వ్యవహారం తెలసి బ్లాక్‌మెయిల్‌ చేసిన చింటు - పరారీలో ఉన్న నిందితుడు

Lovers Suicide in Car
Lovers Suicide in Car at Medchal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2025, 9:21 AM IST

Updated : Jan 8, 2025, 10:53 AM IST

Lovers Suicide in Car at Medchal : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రేమజంట ఆత్మహత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుల్లో ఒకరైన 17 ఏళ్ల బాలిక తన తండ్రి శ్రీరాములుకు ఫోన్‌ నుంచి వాట్సాప్‌లో లొకేషన్, మూడు పేజీల లేఖను పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఇవి చూసి భయపడ్డ బాలిక తండ్రి లొకేషన్‌ చూపించిన ప్రాంతానికి వెళ్లేలోపే ఇద్దరూ మంటల్లో కాలిపోయారు. బాలిక ప్రేమ వ్యవహారం తెలిసి బ్లాక్‌మెయిల్‌ చేసిన చింటూ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Lovers Suicide in Car at Medchal (ETV Bharat)

ప్రేమ విషయంపై బెదిరింపులు : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం జమిలాపేట్‌కు చెందిన శ్రీరాములు ఘట్‌కేసర్‌ మండలానికి చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని ఇద్దరూ సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతురాలి సమీప బంధువు వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెబుతానని తరచూ బ్లాక్ మెయిల్‌ చేయడం వల్లే ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. అసలు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందని పోలీసులు దర్యాప్తు చేయగా ఎక్కడెక్కడికెళ్లారో బయటపడింది.

పెట్రోల్‌ బంక్‌కు కారులో : సోమవారం ఉదయం బాలిక తండ్రి ఆమెను ఇంటర్‌ కళాశాల దగ్గర ఉదయం 8 గంటల ప్రాంతంలో దింపాడు. కొద్దిసేపటి తర్వాత శ్రీరాములు కారులో వచ్చి ఆమెను తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో కారులోనే సంచరించినట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఘట్‌కేసర్‌ మండలం అన్నోజిగూడలోని ఓ దుకాణంలో 20 లీటర్ల నీళ్ల డబ్బా కొనగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి సమీపంలోని పెట్రోల్‌ బంక్‌కు కారులో వెళ్లిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

వాట్సాప్‌లో ఆత్మహత్య లేఖ : దాదాపు 10-15 లీటర్ల పెట్రోల్‌ కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బంకు సిబ్బంది మాత్రం పెట్రోలు అమ్మలేదని పోలీసులకు చెబుతున్నారు.పెట్రోలు సీసాల్లో అమ్మినట్లు తెలిస్తే తమపైనా కేసు నమోదవుతుందనే ఉద్దేశంతో నిజం చెప్పడం లేదని తెలుస్తోంది. డబ్బాలో పెట్రోలు కొనుగోలు చేసిన ఇద్దరూ అక్కడి నుంచి నేరుగా కొంత నిర్మానుష్యంగా ఉండే ఘన్‌పూర్‌ సర్వీసు రోడ్డులోకి వెళ్లారు. శ్రీరాములు, బాలిక ఇద్దరూ తల్లిదండ్రులకు ఆత్మహత్య లేఖను వాట్సాప్‌లో పంపించి ఆత్మాహుతికి పాల్పడ్డారు.

మహేష్‌ అలియాస్‌ చింటుపై కేసు నమోదు : శ్రీరామ్, బాలిక ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు చెబుతానంటూ బ్లాక్‌ మెయిల్‌ చేసి లక్షా 35 వేల రూపాయలు వసూలు చేసిన ముంత మహేష్‌ అలియాస్‌ చింటు అనే వ్యక్తిపై ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాలిక తండ్రి ఫిర్యాదు ఇచ్చారు. నిందితుడు మృతురాలికి సోదరుడి వరుస అవుతాడు. ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగంతో ఇతనిపై భారతీయ న్యాయ సంహిత-బీఎన్ఎస్ 108 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతడి స్నేహితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కఠినంగా శిక్షించాలని డిమాండ్ : శ్రీరాములు, బాలిక మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో శవ పరీక్షలు పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీరాములు మృతదేహాన్ని జమీలాపేట్‌కు తీసుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు నార్లపల్లిలోని మహేశ్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, మరణశిక్ష విధించాలని నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన వారికి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉద్రిక్తతల మధ్య బాలిక అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు భారీగా తరలివచ్చారు. ఏకైక కుమార్తె కావడంతో ఏ కష్టం లేకుండా పెంచామని, తల్లిదండ్రులు విలపించిన తీరు కన్నీళ్లు తెప్పిచింది.

సజీవదహనం కేసు కొత్త మలుపు - కావాలనే పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న యువతి, యువకుడు

జీఎస్టీ చెల్లించాలంటూ వేధింపులు - తట్టుకోలేక వ్యాపారి ఆత్మహత్య

Last Updated : Jan 8, 2025, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.