ETV Bharat / state

మెట్రో విస్తరణపై సమీక్ష - అప్పుడే టెండర్లు పిలవాలని నిర్ణయం - HYDERABAD METRO EXPANSION

మెట్రో విస్తరణ, రేడియల్‌ రోడ్లు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణాలపై సీఎం రేవంత్ సమీక్ష - మార్చి నాటికి డీపీఆర్​లు సిద్ధం చేయాలని ఆదేశం

CM Revanth Review On Hyderabad Metro Expansion
CM Revanth Review On Hyderabad Metro Expansion (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2025, 9:44 AM IST

CM Revanth Review On Hyderabad Metro Expansion : ​హైదరాబాద్​ నగరంలో మెట్రో రైలు విస్తరణలో భాగంగా చేపట్టినటువంటి శామీర్‌పేట, మేడ్చల్, ఫ్యూచర్‌ సిటీ మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లు మార్చి నెలాఖరు నాటికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్‌ నెలాఖరుకు టెండర్లు పిలవాలని రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్‌ రోడ్లు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణాలపై మంగళవారం తన నివాసంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు.

భూసేకరణ వెంటనే పూర్తి చేయాలి : ‘రాజీవ్‌గాంధీ ఇంటర్​నేషనల్​ ఎయిర్​పోర్ట్-ఫ్యూచర్‌ సిటీ మెట్రో (40 కిలోమీటర్లు.), జేబీఎస్‌-శామీర్‌పేట మెట్రో (22 కిలోమీటర్లు), ప్యారడైజ్‌-మేడ్చల్‌ మెట్రో (23 కి.మీ.) మార్గాలకు సంబంధించి భూసేకరణను వెంటనే పూర్తి చేయాలి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఎలివేటెడ్‌ కారిడార్ల విషయంలో భవిష్యత్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఎలైన్‌మెంట్‌ రూపొందించేటప్పుడే క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మేడ్చల్‌ మార్గంలో ఇప్పటికే ఉన్నటువంటి 3 పైవంతెనలను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్‌ నిర్మించాలని సూచించారు. ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఆ మెట్రోలు ఒకేచోట ప్రారంభమయ్యేలా : శామీర్‌పేట్, మేడ్చల్‌ మెట్రోలు ఒకేచోట ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అక్కడ అధునాతన వసతులతో పాటు భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా భారీ జంక్షన్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాలవారు ప్రతి పనికి హైదరాబాద్​ నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండా అక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేవిధంగా ఆ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను తయారుచేయాలని, హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్‌జీసీఎల్‌) కింద రేడియల్‌ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు(మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి స్పెషల్​ సెక్రటరీ అజిత్‌రెడ్డి, పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, ప్రాధాన్య కార్యక్రమాల కమిషనర్‌ శశాంక తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌ వాసులకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం - మేడ్చల్‌, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు

గజానికి రూ.81 వేల పరిహారం - పాతబస్తీ మెట్రోకు ఆస్తుల సేకరణ షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.