తెలంగాణ

telangana

ETV Bharat / technology

భారత్​లో కూడా 'యాపిల్‌ స్టోర్‌' యాప్‌ వచ్చేసిందోచ్​- హోమ్​ డెలివరీతో పాటు మరెన్నో సర్వీసులు- యూజర్లకు ఇక పండగే! - APPLE STORE APP

'యాపిల్‌ స్టోర్‌ యాప్‌' లాంఛ్- దీని ఉపయోగాలు తెలిస్తే అవాక్కే!

Representational Image
Representational Image (Photo Credit- IANS)

By ETV Bharat Tech Team

Published : Jan 17, 2025, 1:48 PM IST

Apple Launches App for Its Online Store in India:యాపిల్ ప్రియులకు గుడ్​న్యూస్. దేశంలోని తన యూజర్ల కోసం టెక్ దిగ్గజం యాపిల్ అదిరే యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ సర్వీసులు, కంపెనీ ప్రొడక్ట్​లు కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది చాలా యూజ్​ఫుల్​గా ఉంటుంది. అంటే దీని ద్వారా కంపెనీ హోమ్‌ డెలివరీతో పాటు పలు సర్వీసులను అందించనుంది. ఈ మేరకు యాపిల్​ స్టోర్​లో ఇప్పటికే ఈ యాప్ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది.

ఇదిలా ఉండగా యాపిల్ భారత్​లో తన సేల్స్​ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే తన ప్రొడక్ట్​లను మరింత మందికి చేరువ చేయాలని ఈ యాప్​ను తీసుకొచ్చింది. ఈ యాప్​ ద్వారా దేశంలోని చిన్న పట్టణాల్లో కూడా తన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ఇప్పటికే ఇతర దేశాల్లో అందుబాటులో ఉండగా తాజాగా 'యాపిల్‌ స్టోర్‌ యాప్‌' పేరుతో భారత్​కు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ యాప్​ ద్వారా వినియోగదారులు యాపిల్‌ ట్రేడ్‌ ఇన్‌, ఫైనాన్సింగ్‌ ఆప్షన్‌ వంటి కీలకమైన రిటైల్‌ ప్రోగ్రామ్‌ల వివరాలను తెలుసుకోవచ్చు. ఇది లేటెస్ట్‌ ప్రొడెక్ట్స్‌, రిటైల్‌ ప్రోగ్రామ్‌ల గురించి అప్‌డేట్‌లు అందిస్తుంది. అంతేకాక ఈ యాప్​ ద్వారా యాపిల్‌ ఉత్పత్తులు హోమ్‌ డెలివరీ, లేదా పికప్‌ సేవల్ని కూడా పొందొచ్చు.

కంపెనీకి చెందిన కొత్త ప్రొడక్ట్స్​ కొనుగోలు చేశాక దాని వినియోగానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలుసుకోవాంటే ఈ యాప్‌లోని 'Go Further' ట్యాబ్‌ సాయంతో నిపుణులను సంప్రదించొచ్చు. అంతేకాక కస్టమర్లు తమ మ్యాక్‌లో మరింత పవర్​ఫుల్ చిప్‌, అదనపు స్టోరేజీ కావాలంటే తమకు నచ్చినట్లు మార్చుకొనే సదుపాయం కూడా కల్పిస్తుంది.

దీనితోపాటు ఎయిర్‌పాడ్స్, ఐప్యాడ్స్, ఎయిర్‌ట్యాగ్స్​, యాపిల్ పెన్సిల్‌పై చెక్కిన ఏదైనా టెక్స్ట్ లేజర్‌ను అదనపు ఖర్చు లేకుండానే పొందొచ్చు. ఈ అద్భుతమైన సేవలతో పాటు రాబోయే కాలంలో ఈ యాప్ ద్వారా డిజిటల్ గిఫ్ట్ మెసేజ్‌లను కస్టమైజ్ చేసే ఆప్షన్‌ను కూడా అందించే యోజనలో కంపెనీ ఉంది. ఈ క్రమంలో దీనిపై పరిశీలిస్తోంది.

ఇక భారత్​లో యాపిల్ యూజర్లకు షాపింగ్ ఎక్స్​పీరియన్స్​ను మరింత మెరుగుపరిచేందుకే 'యాపిల్ స్టోర్' యాప్ తీసుకువచ్చినట్లు రిటైల్ ఆన్ లైన్ హెడ్ కారెన్ రాస్ముసేన్ తెలిపారు. ఈ యాప్ లాంఛ్​ చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా యాపిల్ 2017లో భారత్​లో ఐఫోన్లతయారీని ప్రారంభించింది. 2023 ఏప్రిల్​లో దిల్లీ, ముంబయిలో రెండు రిటైల్​ స్టోర్లను స్టార్ట్​ చేసింది. ఈ స్టోర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో విస్తరణ దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే​ త్వరలోనే బెంగళూరు, పుణె, దిల్లీ -ఎన్‌సీఆర్‌, ముంబయిలో మరో నాలుగు స్టోర్లు ప్రారంభించనున్నట్లు ఇటీవలే ప్రకటించిన యాపిల్ తాజాగా ఈ కొత్త యాప్​ను తీసుకొచ్చింది.

ఏడాది వ్యాలిడిటీతో చౌకైన రీఛార్జ్​ ప్లాన్​ కోసం చూస్తున్నారా?- అన్​లిమిటెడ్ బెనిఫిట్స్​తో పాటు OTT యాక్సెస్​తో​ బెస్ట్ ఇవే!

ఉష్ణోగ్రతను బట్టి రంగులు మార్చే స్మార్ట్​ఫోన్లు- ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిపుల్ ఫ్లాష్ కెమెరా కూడా వీటిలోనే!

సేఫ్టీలో దేశీయ దిగ్గజం హవా- క్రాష్​ టెస్ట్​లో మహింద్రా మరో 2 కార్లకు 5-స్టార్ రేటింగ్

ABOUT THE AUTHOR

...view details