Bharat Mobility Global Expo 2025: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈరోజు ప్రారంభం అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్ ఫెయిర్ ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి పీఎంతో పాటు పలువురు కేంద్ర మంత్రులు.. నితిన్ గడ్కరీ, హెచ్‌డి కుమారస్వామి, జితన్ రామ్ మాంఝీ, మనోహర్ లాల్, పియూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరి హాజరయ్యారు.
ప్రగతి మైదాన్, ద్వారక, గ్రేటర్ నోయిడా అనే మూడు ప్రదేశాలలో 5 రోజుల పాటు ఈ కార్ ఫెయిర్ జరగనుంది. ఇండియా ఎక్స్‌పో సెంటర్ అండ్ మార్ట్‌లో నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌లో భారతదేశంతో సహా వివిధ దేశాల నుంచి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ ఆటో ఎగ్జిబిషన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలతో సహా 100 కి పైగా కొత్త వాహనాలు ప్రదర్శించనున్నట్లు సమాచారం. పీఎం చేతుల మీదుగా ఇవాళ ఘనంగా ప్రారంభమైన ఈ కార్ ఫెయిర్ జనవరి 22 వరకు కొనసాగనుంది.
ఈ ఈవెంట్‌లో మొదటి రోజు మీడియా కవరేజ్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. రెండవ రోజును డీలర్లకు ప్రత్యేకంగా కేటాయించారు. ఈ క్రమంలో జనవరి 19 నుంచి సాధారణ వ్యక్తులు ఈ కార్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ కార్ ఫెయిర్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఫెయిర్‌లో పాల్గొనేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఫెయిర్‌కి ప్రవేశం పూర్తిగా ఉచితం. అయితే ఇందుకోసం మీరు http://www.bharat-mobility.com వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Speaking at the Bharat Mobility Global Expo 2025. Driven by the aspirations of the people, India's automobile sector is witnessing an unprecedented transformation. @bharat_mobility
— Narendra Modi (@narendramodi) January 17, 2025
https://t.co/w6LYEJy2gX
పాల్గొంటున్న అన్ని కంపెనీలు: హీరో మోటోకార్ప్, సుజుకి, మోటార్ సైకిల్ ఇండియా వంటి కంపెనీలు బైక్స్ అండ్ స్కూటీలను తయారు చేస్తాయి. ఈ సంస్థలన్నీ కూడా ఈ కార్ ఫెయిర్‌లో పాల్గొంటున్నాయి. వీటితో పాటు మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, కియా ఇండియా, ఎంజి మోటార్ ఇండియా, స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియా వంటి బ్రాండ్లు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ఈ కంపెనీలు తమ వివిధ కార్ల కొత్త, అత్యాధునిక మోడళ్లను ఈ కార్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తాయి.
లగ్జరీ కార్ల కేటగిరీ: ఈ కార్ల ప్రదర్శనలో మెర్సిడెస్-బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, పోర్స్చే ఇండియా వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి లగ్జరీ వాహనాలు ప్రదర్శించనున్నారు. అదే సమయంలో వాణిజ్య వాహనాల విభాగంలో టాటా మోటార్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ కూడా ఉంటాయి.
ఎలక్ట్రిక్ వాహనాల ప్రాముఖ్యత: ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVలు) ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. 2030 నాటికి 30% ప్యాసింజర్ వాహనాలను విద్యుత్తుతో నడిపించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఇప్పుడు ప్రారంభమైన ఈ కార్ ఫెయిర్‌ను ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించారు. ఈవీ తయారీ సంస్థలు తమ కొత్త టెక్నాలజీలు, మోడల్స్‌ను ప్రదర్శించేందుకు ఈ ఈవెంట్ మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఈ మేళాలో టాటా మోటార్స్, మహింద్రా ఎలక్ట్రిక్, ఇతర ప్రముఖ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించనున్నాయి.
ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 దేశ ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. ఈ ఎక్స్‌పో ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమను స్థాపించడమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను ప్రజాదరణ శిఖరాగ్రానికి తీసుకువస్తుంది.
మార్కెట్లోకి కిర్రాక్ ఫీచర్లతో రియల్మీ, రెడ్మీ 5G స్మార్ట్ఫోన్లు- వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్?