SpaceX Starship Test Failure: ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన రీయూజబుల్ భారీ రాకెట్ స్టార్‌షిప్ విఫలమైంది. దీన్ని గురువారం టెక్సాస్‌లోని స్టార్‌బేస్ ఫెసిలిటీ సెంటర్ నుంచి EST సాయంత్రం 5:37 గంటలకు (జనవరి 17న ఉదయం 4:07 గంటలకు) విజయవంతంగా ప్రయోగించారు. అయితే ప్రయోగించిన కొద్ది నిమిషాలకే అది ఫెయిల్ అయిపోయింది.
ఈ స్టార్‌షిప్ భూ వాతావరణంలోకి చేరుకున్న కొద్దిసేపటికే రాకెట్ కింది భాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రాకెట్‌కు సంబంధించిన శకలాలు కరేబియన్ సముద్రంలో పడిపోయాయి. పెద్ద ఎత్తున మంటలను గాల్లో చిమ్ముతూ శకలాలు పేలిపోయాయి.
దీంతో ఈ రాకెట్‌ను మళ్లీ కిందకు తీసుకురావాల్సి వచ్చింది. ఈ ఘటనతో అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న మస్క్ స్పేస్ఎక్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ స్టార్‌షిప్ అనేది స్పేస్‌ఎక్స్ అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన రాకెట్. ఈ రీయూజబుల్ రాకెట్‌ను ఏడోసారి ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా ప్రయోగించారు. ఈ సెవెన్త్ స్టార్‌షిప్ కక్ష్య వేగాన్ని చేరుకుని 10 డమ్మీ స్పేస్ క్రాఫ్ట్‌లను ప్రయోగించేందుకు ప్రయత్నించాల్సి ఉంది. అయితే ఈ ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయత్నం విజయవంతం కాలేదు.
ఈ డమ్మీ అంతరిక్ష నౌకలను భవిష్యత్తులో ప్రయోగించబోయే అప్‌గ్రేడ్ చేసిన స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహాల పరిమాణం, బరువు, డిజైన్‌కు సరిపోయేలా రూపొందించారు. తద్వారా వాటిని పూర్తిగా పరీక్షించేందుకు ప్లాన్ చేశారు. ఈ మిషన్‌ను ఈ ఉద్దేశంతోనే ప్రయోగించారు. కానీ దాదాపు ఎనిమిదిన్నర నిమిషాల తర్వాత స్పేస్‌ఎక్స్ టీమ్ సెవెన్త్ స్టార్‌షిప్‌తో సంబంధాన్ని కోల్పోయింది. దీంతో ఈ రాకెట్ విఫలమైనట్లు ప్రకటించారు.
బూస్టర్‌లో మంటలు: సాధారణంగా రాకెట్ దిగువ భాగాన్ని సూపర్ హెవీ బూస్టర్ అంటారు. అయితే ఇవాళ స్టార్‌షిప్ ఫ్లైట్ టెస్ట్‌లో ఈ భాగం మంటల్లో చిక్కుకుంది. అయినప్పటికీ స్పేస్‌ఎక్స్ బృందం దానిని విజయవంతంగా భూమికి తీసుకురాగలిగింది. భూమికి కొంచెం పైన రాకెట్‌ను పట్టుకోవడానికి స్పేస్‌ఎక్స్ టీమ్ పెద్ద మెకానికల్ ఆర్మ్స్ను ఉపయోగించింది. ఇలా ఆ ప్రాంతంలో అతిపెద్ద పేలుడు జరగకుండా ఆపగలిగింది.
Mechazilla has caught the Super Heavy booster! pic.twitter.com/aq91TloYzY
— SpaceX (@SpaceX) January 16, 2025
ఫ్లైట్స్ దారి మళ్లింపు: స్టార్‌షిష్ రాకెట్ పేలిపోవడంతో దాని నుంచి భారీగా శకలాలు కిందికి దూసుకొచ్చాయి. దీంతో ఎయిర్ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రాకెట్ శిథిలాలు పడిపోయిన ప్రాంతాలలో కమర్షియల్ ఫ్లైట్లను నెమ్మదించి, దారి మళ్లించింది.
దీనిపై మస్క్ ఏమన్నారంటే?: ఈ ఘటన తర్వాత ఎలోన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దీని గురించి తెలియజేశారు. ఈ రాకెట్లో మంటలు చెలరేగడానికి గల కారణాన్ని కూడా అందులో వెల్లడించారు. రాకెట్ ఇంజిన్ ఫైర్‌వాల్ పైన ఉన్న క్వావిటీలోకి ఆక్సిజన్, ఫ్యూయెల్ లీక్ అయ్యాయని ప్రాథమిక సూచనలు ఉన్నాయని మస్క్ తన 'X' ఖాతాలో వెల్లడించారు.
Preliminary indication is that we had an oxygen/fuel leak in the cavity above the ship engine firewall that was large enough to build pressure in excess of the vent capacity.
— Elon Musk (@elonmusk) January 17, 2025
Apart from obviously double-checking for leaks, we will add fire suppression to that volume and…
దీంతోపాటు ఆయన ఒక వీడియోను పంచుకున్నారు. అందులో మంటల్లో చిక్కుకున్న రాకెట్ శిథిలాలు నిప్పులు చిమ్ముతూ కిందికి పడుతున్న దృశ్యాలను చూడొచ్చు. ఈ వీడియోతో పాటు 'విజయం సంగతి పక్కనపెడితే వినోదం మాత్రం గ్యారంటీ' అని మస్క్ రాసుకొచ్చారు.
దేశంలోనే అతిపెద్ద ఆటో ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని- 100కి పైగా కొత్త వాహనాల ప్రదర్శనలు!
చరిత్ర సృష్టించిన ఇస్రో- అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం