Annual Prepaid Recharge Plans: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ హవా నడుస్తోంది. చేతిలో ఫోన్ లేకుంటే పూట గడవని పరిస్థితి. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ప్రతి దాని కోసం స్మార్ట్‌ఫోన్ వాడకం తప్పనిసరిగా మారింది. ఏదైనా ఆర్డర్ చేసుకోవాలన్నా, బుక్ చేయాలన్నా మొబైల్ ఉండాల్సిందే. యూపీఐ ద్వారా రోజువారీ ఆర్థిక లావాదేవీలు కూడా ఫోన్లలోనే జరుగుతున్నాయి.
రోజువారీ పనులు, అవసరాన్ని పక్కనపెడితే చాలా వరకు మొబైల్స్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వాడే వారి సంఖ్య అధికంగా ఉంది. గేమ్స్ ఆడేందుకు, సినిమాలు, క్రికెట్ లాంటివి చూసేందుకు స్మార్ట్ఫోన్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. అంతేకాక ప్రస్తుతం ఓటీటీల వాడకం బాగా పెరిగిపోయింది. అన్ని భాషల్లోని చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి రావడం వల్ల అందరూ వాటికి అలవాటు పడిపోయారు. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లో కనీసం ఒక్క ఓటీటీ యాప్ అయినా ఉంటోంది.
ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు సైతం యూజర్లను ఆకట్టుకునే విధంగా కొన్ని ప్రత్యేక ఆఫర్లతో రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా వాటిలో ఏడాది వ్యాలిడిటీతో తక్కువ ధరకే ప్రత్యేక ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ప్రీపెయిడ్ ప్లాన్లలో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్‌తో పాటు ఓటీటీ వేదికల సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తున్నాయి. ఈ సందర్భంగా మన దేశంలో టాప్ 4 టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న కొన్ని బెస్ట్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ప్యాకేజీల వివరాలు మీకోసం.
జియో రూ.1899 ప్లాన్: ఏడాది పాటు వ్యాలిడిటీతో జియో అందిస్తున్న బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లలో ఇది ఒకటి. దీని ధర రూ. 1899. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు అంటే దాదాపు 11 నెలలు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లతో పాటు మొత్తం 24GB ఇంటర్నెట్ డేటా వస్తుంది. వీటితో పాటు ఈ రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 1999 ప్లాన్: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ ధర రూ.1,999. ఇది ఎయిర్‌టెల్ వార్షిక రీఛార్జ్ ప్లాన్. దీని వ్యాలిడిటీ 365 రోజులు అంటే 1 సంవత్సరం. ఈ ప్లాన్‌తో కూడా వినియోగదారులకు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు మొత్తం 24GB ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. వీటితో పాటు ఈ ప్లాన్‌తో పాటు యూజర్లు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందొచ్చు. దీని ద్వారా వినియోగదారులు అనేక లైవ్ ఛానెల్స్, OTT యాప్‌లను ఆస్వాదించొచ్చు.
Vi రూ. 1999 ప్లాన్: వొడాఫోన్ ఈ లాంగ్ టెర్మ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర 1999 రూపాయలు. ఈ ప్లాన్ కూడా 365 రోజులు అంటే ఒక సంవత్సరం వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, మొత్తం 24GB ఇంటర్నెట్ డేటాను లభిస్తుంది. వీటితో పాటు ఈ ప్లాన్‌తో వినియోగదారులు VI మూవీస్, VI యాప్స్ మొదలైన సౌకర్యాలను కూడా పొందుతారు.
BSNL రూ.1198 ప్లాన్: ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ లాంగ్ టెర్మ్ వ్యాలిడిటీ ప్లాన్లలో అత్యంత చౌకైనది. ఈ ప్లాన్ 365 రోజులు అంటే ఒక సంవత్సరం వ్యాలిడిటీతో కేవలం రూ. రూ.1,198కే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు దేశవ్యాప్తంగా 300 నిమిషాలు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. దీనితో పాటు వినియోగదారులు ప్రతి నెలా 30 SMSలను ఉచితంగా పొందుతారు. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో 3GB డేటా ఉచితంగా లభిస్తుంది. దీన్ని వినియోగదారులు ఏడాది పొడవునా ఉపయోగించుకోవచ్చు.
సేఫ్టీలో దేశీయ దిగ్గజం హవా- క్రాష్ టెస్ట్‌లో మహింద్రా మరో 2 కార్లకు 5-స్టార్ రేటింగ్
చరిత్ర సృష్టించిన ఇస్రో- అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
ప్రంపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌టీవీ లాంఛ్- దీనిలో గేమ్ ఆడితే ఆ మజానే వేరు!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు- సెల్ఫీలను స్టిక్కర్లుగా.. ఇకపై చాట్‌లో అన్‌లిమిటెడ్ ఫన్!