తెలంగాణ

telangana

ETV Bharat / technology

పవర్​ఫుల్ M4 సిరీస్​ చిప్​సెట్​తో యాపిల్ మ్యాక్​బుక్​ ప్రో- ధర ఎంతంటే?

యాపిల్ మ్యాక్​బుక్​ ప్రో M4 వెర్షన్ వచ్చేసిందోచ్- ధర, ఫీచర్లు ఇవే..!

Apple Macbook Pro
Apple Macbook Pro (IANS)

By ETV Bharat Tech Team

Published : 4 hours ago

Apple Macbook Pro:టెక్ దిగ్గజం యాపిల్ తన కస్టమర్లకు వరుస పెట్టి గుడ్​న్యూస్​లు చెప్తోంది. ఇప్పటికే వరుసగా కొత్త ఐమ్యాక్​, మ్యాక్​ మినీ కొత్త వెర్షన్​ను లాంచ్ చేయగా తాజాగా M4 సిరీస్​ చిప్​లతో కొత్త మ్యాక్​బుక్​ ప్రో మోడల్​ను తీసుకొచ్చింది. ఇవి ఫాస్టెస్ట్, అడ్వాన్స్​డ్ చిప్​లు. ఈ మ్యాక్​బుక్​ ప్రో 14, 16 అంగుళాల స్క్రీన్​ సైజుల్లో వస్తుంది. కంపెనీ దీని డిజైన్​లో ఎటువంటి ముఖ్యమైన మార్పులూ చేయలేదు. ఇది దాని పాత వెర్షన్​ మాదిరిగానే కన్పిస్తుంది. అయితే దీని ఫీచర్లు, రా హార్డ్​వేర్​ పెర్ఫార్మెన్స్ పరంగా ఇది ఇంతకుముందు వాటికంటే చాలా పవర్​ఫుల్​గా ఉంటుంది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.

చిప్​సెట్​ ఆప్షన్స్:ఈ కొత్త యాపిల్ మ్యాక్​బుక్​ ప్రో మూడు చిప్​సెట్​ల ఆప్షన్స్​తో వస్తుంది.

  • M4
  • M4 ప్రో
  • M4 మాక్స్

ఈ కొత్త మ్యాక్‌బుక్ ప్రో బేస్ వేరియంట్ 8-కోర్ CPU, 8-కోర్ GPU, 16GB RAMతో కూడిన M4 చిప్‌ను కలిగి ఉంటుంది. కానీ M4 ప్రో చిప్‌లో 10 పెర్ఫార్మెన్స్ కోర్‌లు, 4 ఎఫిషియెన్సీ కోర్‌లతో 14-కోర్ CPU ఉంటుంది. 20-కోర్ GPU M4తో పోలిస్తే రెట్టింపు పనితీరును అందిస్తుంది. అంతేకాక ఇది 64GB వరకు ఇంటిగ్రేటెడ్ మెమరీకి సపోర్ట్ చేస్తుంది. మీకు ఇంకా ఎక్కువ పవర్ కావాలంటే యాపిల్ కొత్తగా తీసుకొచ్చిన M4 మ్యాక్స్ చిప్‌లో 16-కోర్ CPU, 40-కోర్ GPU, 128GB వరకు ఇంటిగ్రేటెడ్ మెమరీ ఉంటుంది.

ఈ మ్యాక్​బుక్​ ప్రో 'ఆల్-న్యూ నానో-టెక్చర్ డిస్‌ప్లే ఆప్షన్​'తో వస్తుందని యాపిల్ తెలిపింది. ఇది గెలాక్సీ S24 అల్ట్రాలో శాంసంగ్​ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ మాదిరిగానే రిఫ్లెక్షన్స్​తో వచ్చే లైటింగ్, డిస్ట్రాక్షన్స్​ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని కొత్త పోర్టబుల్ పవర్​హౌస్​లు ఇప్పుడు లైటింగ్ కండీషన్స్​లో 1,000 నిట్స్​ వరకు ఉంటాయి. అంతేకాక HDR కంటెంట్‌ను వీక్షించేటప్పుడు గరిష్టంగా 1,600 నిట్స్ బ్రైట్​నెస్​ను ఇస్తుంది.

మూడు థండర్‌బోల్ట్ 4 పోర్ట్స్​: కొత్త మ్యాక్‌బుక్ ప్రో లోని అన్ని చిప్ వేరియంట్స్ 12MP సెంటర్ స్టేజ్ కెమెరాతోనే వస్తాయి. ఇది తక్కువ లైటింగ్ కండీషన్స్​లో సహాయపడుతుంది. యూజర్స్ కదులుతున్నప్పటికీ ఇది ఫ్రేమ్​ను ఆటోమేటిక్​గా ఫోకస్ చేస్తుంది. కొత్త మ్యాక్ మినీ మాదిరిగానే ఇందులో M4 వెర్షన్‌తో మూడు Thunderbolt 4 పోర్ట్‌లు ఉంటాయి. కానీ M4 ప్రో, M4 మ్యాక్​ చిప్​ల​తో వస్తున్న మ్యాక్​బుక్​ ప్రో మాత్రం మూడు Thunderbolt 5 పోర్ట్‌లను కలిగి ఉంటాయి.

ఇతర కనెక్టివిటీ ఫీచర్స్: HDMI పోర్ట్, SDXC కార్డ్ స్లాట్, ఛార్జింగ్ కోసం MagSafe 3 పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. తాజా ఆపిల్ ఉత్పత్తుల మాదిరిగానే కొత్త మ్యాక్‌బుక్ ప్రో కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్​కు సపోర్ట్ చేస్తుంది.

ధర:

  • మార్కెట్లో M4 చిప్‌తో 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ. 1,69,900 నుంచి ప్రారంభమవుతుంది.
  • M4 ప్రో చిప్​తో మ్యాక్‌బుక్ ప్రో ధర రూ. 1,89,900 నుంచి ప్రారంభమవుతుంది.
  • M4 మ్యాక్స్ చిప్ వేరియంట్ మ్యాక్​బుక్​ ప్రో ధర రూ. ​2,09,900 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ కొత్త మ్యాక్​బుక్​ ప్రో ప్రీ-బుకింగ్స్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 8 నుంచి వీటిని యాపిల్ అధికారిక వెబ్​సైట్​, ఆఫ్​లైన్ స్టోర్స్​ నుంచి కొనుగోలు చేయొచ్చు.

వన్​ప్లస్​ నుంచి కొత్త ఫోన్ రిలీజ్- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

గ్లో ఇన్ ది డార్క్ రేర్ ప్యానెల్‌తో నథింగ్ ఫోన్- లిమిటెడ్ సేల్స్.. వెంటనే త్వరపడండి!

ABOUT THE AUTHOR

...view details