తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఆఫర్లే.. ఆఫర్లు.. బాబోయ్! ఇంత తక్కువ ధరకే ఇస్తున్నారేంటి?.. బ్లాక్ ఫ్రైడే సేల్​లో డిస్కౌంట్లు చూస్తే మతిపోవాల్సిందే! - AMAZON BLACK FRIDAY SALE

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్​లో బంపర్ ఆఫర్లు- ఆ కార్డులపై భారీ డిస్కౌంట్​..!

Amazon Black Friday Sale Now Live in India
Amazon Black Friday Sale Now Live in India (Amazon)

By ETV Bharat Tech Team

Published : Nov 29, 2024, 8:08 PM IST

Amazon Black Friday Sale: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో సేల్‌ను ప్రారంభించింది. అమెరికాలో షాపింగ్‌ సీజన్ ప్రారంభానికి సూచికగా ఏటా నిర్వహించే 'బ్లాక్‌ ఫ్రైడే సేల్‌'ను ఇండియాలో ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాలు, ఫ్యాషన్‌ ఉత్పత్తులపై అమెజాన్ బంపర్ ఆఫర్లు అందిస్తోంది.

ముఖ్యంగా ఈ సేల్​లో అమెజాన్.. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఫోన్‌ ఎమ్మార్పీ రూ.1,24,999గా ఉండగా.. ఈ సేల్​లో ఆఫర్​తో రూ.74,999కే అందిస్తోంది. ఈ ఒక్క స్మార్ట్​ఫోన్​పై మాత్రమే కాకుండా యాపిల్, ఐకూ, వన్‌ప్లస్‌, రియల్ మీ, రెడ్‌మీ, టెక్నో వంటి సంస్థలకు చెందిన మొబైల్స్​పై కూడా 40 శాతం డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు అమెజాన్‌ తెలిపింది.

వీటితో పాటు యాపిల్‌మ్యాక్‌ బుక్‌ ఎయిర్‌ (ఎం1, 2020) ల్యాప్‌టాప్‌ ధర రూ.89,900 కాగా.. ఆఫర్​తో కేవలం రూ.59,990కే ఇస్తోంది. అంతేకాక యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, వన్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 2 వరకు నాలుగు రోజుల పాటు అమెజాన్​లో ఈ బ్లాక్​ ఫ్రైడే సేల్ కొనసాగనుంది.

హ్యుందాయ్ టక్సన్​కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్- కళ్లు మూసుకుని కొనేయొచ్చు ఇక..!

భారత్ అణుబాంబు మిస్సైల్ టెస్ట్ సక్సెస్- భూమి, ఆకాశంలోనే కాదు.. సముద్రం నుంచి కూడా సై..!

ABOUT THE AUTHOR

...view details