తెలంగాణ

telangana

ETV Bharat / technology

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ డేట్స్ ఫిక్స్- ఈ కార్డు ఉన్నవారికి ఆఫర్లే ఆఫర్లు! - Amazon Great Indian Festival - AMAZON GREAT INDIAN FESTIVAL

Amazon Great Indian Festival: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ కూడా పండగ వేళ అతిపెద్ద సేల్​కు సిద్ధమైంది. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్​కు తేదీలను ప్రకటించింది. ఈసారి సేల్‌లో ఎస్‌బీఐ కార్డు యూజర్లకు మంచి డిస్కౌంట్‌ లభించనుంది.

Amazon_Great_Indian_Festival
Amazon_Great_Indian_Festival (Amazon)

By ETV Bharat Tech Team

Published : Sep 16, 2024, 3:12 PM IST

Amazon Great Indian Festival: పండగల సీజన్ వేళ ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ కూడా అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను సెప్టెంబర్‌ 27న నిర్వహించనుంది. ప్రైమ్‌ మెంబర్లకు ఒకరోజు ముందుగానే సేల్‌ అందుబాటులోకి రానుంది. అంటే సెప్టెంబర్‌ 26 నుంచే ఈ సేల్‌ మొదలు కానుంది.

ఈసారి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఎస్‌బీఐ కార్డు యూజర్లకు మంచి డిస్కౌంట్‌ లభించనుంది. క్రెడిట్‌ కార్డ్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేసే కస్టమర్లు 10 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అమెజాన్‌ పే యూపీఐతో చేసే రూ.1000పైన కొనుగోళ్లపై రూ.100 డిస్కౌంట్‌ అందించనున్నట్లు అమెజాన్ తెలిపింది. సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్‌ ఉత్పత్తులపై 50-80 శాతం, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే దేనిపై ఎంత డిస్కౌంట్‌ ఇచ్చేది మాత్రం అమెజాన్ ఇంకా వెల్లడించలేదు.

రూ.5,999 నుంచే మొబైల్స్‌:

గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భాగంగా రూ.5,999 నుంచే మొబైల్స్‌ విక్రయించనున్నట్లు అమెజాన్‌ తెలిపింది. మొబైల్‌ యాక్సెసరీస్‌ రూ.89 నుంచే ప్రారంభమవుతాయని పేర్కొంది. 24 నెలల నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. స్మార్ట్‌టీవీల ధరలు కూడా రూ.6,999 నుంచే ప్రారంభమవుతాయని తెలిపింది. అమెజాన్‌ అలెక్సా, ఫైర్‌టీవీ స్టిక్‌ డివైజులు రూ.1,999 నుంచి లభిస్తాయని పేర్కొంది. సేల్‌ సమయంలో ట్రావెల్‌ బుకింగ్‌లపైనా డిస్కౌంట్‌ పొందొచ్చని అమెజాన్‌ పేర్కొంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లతో పాటు కూపన్లు కూడా జారీ చేయనున్నట్లు తెలిపింది. త్వరలో ఆఫర్ల వివరాలు వెల్లడి కానున్నాయి.

మరోవైపు పండగ సీజన్‌ వేళ ఆఫర్ల ఫెస్టివల్​కు ఫ్లిప్‌కార్ట్ కూడా తెరలేపింది. ఏటా నిర్వహించే 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' సేల్స్ తేదీలను ఫ్లిప్​కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్​కార్ట్ బిగ్​ బిలియన్ డేస్ సేల్స్​ కూడా సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల 26 నుంచే సేల్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. దీంతో ఈసారి సేల్స్​లో కస్టమర్లు భారీ తగ్గింపులు, గొప్ప ఆఫర్​లను పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్​ గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్మార్ట్​ఫోన్ ప్రియులకు శుభవార్త- కేవలం రూ.7,999లకే శాంసంగ్ మొబైల్! - Samsung Galaxy M05 Launched

యాపిల్‌ ఇంటెలిజెన్స్​తో ఐఫోన్ 16 సిరీస్​- ధర, ఫీచర్లు ఇవే! - iphone 16 Series Mobiles Launched

ABOUT THE AUTHOR

...view details