తెలంగాణ

telangana

ETV Bharat / technology

యూత్​కి పిచ్చి పిచ్చిగా నచ్చే KTM నుంచి రెండు కొత్త బైక్స్- వీటి స్పెషాలిటీ ఏంటంటే? - NEW KTM 390 ADVENTURE SERIES UNVEIL

త్వరలో మార్కెట్​లోకి KTM 390 అడ్వెంచర్ సిరీస్- స్పెసిఫికేషన్లు ఇవే!

2025 KTM 390 Adventure Series
2025 KTM 390 Adventure Series (Photo Credit- KTM India)

By ETV Bharat Tech Team

Published : Jan 31, 2025, 6:52 PM IST

New KTM 390 Adventure Series Unveil:KTM ఇండియా ఎట్టకేలకూ తన అప్​డేటెడ్ 2025 KTM 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. దాదాపు రెండు నెలల క్రితం దీన్ని EICMA 2024లో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. కంపెనీ ఈ అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ లేటెస్ట్​ వెర్షన్​లో చాలా ముఖ్యమైన మార్పులు చేసింది. దీంతోపాటు ఇందులో కొత్త ఇంజిన్​ను తీసుకొచ్చింది.

వేరియంట్స్:కంపెనీ ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టింది.

  • స్టాండర్డ్
  • ఎక్స్
  • ఆర్

అయితే ఈ బైక్ మన దేశంలో రెండు వేరియంట్లలో మాత్రమే విడుదల కానుంది. వాటిలో 'స్టాండర్డ్ 390 అడ్వెంచర్', మరింత రోడ్-బయాస్డ్ '390 అడ్వెంచర్ X' మోడల్స్​ ఉన్నాయి. అయితే మోర్ హార్డ్‌కోర్ 'R' వేరియంట్​ను మాత్రం విదేశీ మార్కెట్లలో మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

1. 2025 KTM 390 అడ్వెంచర్:ఈ మోడల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మునుపటి కంటే మరింత ఆకర్షణీయమైన, మరింత ఎక్స్​పోజ్డ్ స్టైలింగ్​తో పాటు షార్పెర్ బాడీ పార్ట్స్​తో రానుంది. ముందు భాగంలో ఇది డేటైమ్-రన్నింగ్ ల్యాంప్స్​తో నిలువుగా అమర్చిన డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్​ల్యాంప్, పొడవైన విండ్‌స్క్రీన్​, బీక్-స్టైల్ మడ్​గార్డ్​ను కలిగి ఉంది.

సైడ్ ప్రొఫైల్:ఈ బైక్ సైడ్ ప్రొఫైల్‌ను పరిశీలిస్తే ఈ మోటార్‌సైకిల్షార్ప్-లుకింగ్ ఫ్రంట్ కౌల్, స్లిమ్ సీట్, సీటు కింద ప్రోమినెంట్ సైడ్ ప్యానెల్‌లను కలిగి ఉంది. ఇందులో మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే ఈ బైక్ దాని ప్రీవియస్ మోడల్​లోని అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్‌కు బదులుగా అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్‌తో వస్తుంది.

2025 KTM 390 Adventure (Photo Credit- KTM India)

రియర్ ప్రొఫైల్:దీని రియర్ ప్రొఫైల్​లో ప్రీవియస్ మోడల్​ మాదిరిగా మినిమల్ బాడీ ప్యానెల్స్ అండ్ స్మాల్ టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. ఈ కొత్త 390 అడ్వెంచర్‌లో 390 డ్యూక్‌లో బ్లూటూత్ అండ్ స్మార్ట్​ఫోన్ కనెక్టివిటీతో ఉపయోగించిన అదే 5-అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ పరంగా ఈ బైక్​లో క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS అండ్ ఆఫ్‌రోడ్ ABS వంటి ఫీచర్లు ఉంటాయి. వీటితో పాటు ఇది స్ట్రీట్, రెయిన్, ఆఫ్-రోడ్ అనే మూడు రైడ్ మోడ్స్​తో రానుంది.

2025 KTM 390 అడ్వెంచర్ హార్డ్‌వేర్:ఈ మోటార్ సైకిల్ పార్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది WP అపెక్స్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్ సెటప్‌తో రియర్ మోనోషాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ రెండు చివర్లలో 200mm సస్పెన్షన్ ట్రావెల్‌ ఉంటుంది. దీన్ని పూర్తిగా అడ్జస్టబుల్ చేయొచ్చు. బ్రేకింగ్ కోసం ఈ బైక్​ 320 mm ఫ్రంట్ డిస్క్, 240 mm రియర్​ డిస్క్‌తో వస్తుంది.

ఇక ఈ మోటార్​ సైకిల్ సీటు ఎత్తు 830mm, 183 కిలోల కర్బ్ వెయిట్​తో వస్తుంది. ఈ KTM 390 అడ్వెంచర్​లో స్పోక్ వీల్స్ ఉపయోగించనున్నారు. దీని ముందు భాగంలో 21-అంగుళాల వీల్స్, వెనక భాగంలో 17-అంగుళాల వీల్స్ అమర్చారు. ఇవి రెండూ ట్యూబ్‌లెస్ టైర్లుతో వస్తున్నాయి.

2025 KTM 390 అడ్వెంచర్ పవర్‌ట్రెయిన్:కంపెనీ ఇప్పుడు ఈ 2025 KTM 390 అడ్వెంచర్‌లో KTM 390 డ్యూక్ మాదిరిగానే 'LC4c' 399cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను అందిస్తుంది. ఈ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ మోటార్ సైకిల్​కు 44bhp పవర్, 39Nm పీక్ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

2. KTM 390 అడ్వెంచర్ X:2025 KTM 390 అడ్వెంచర్ X వేరియంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది 2025 390 అడ్వెంచర్‌ని పోలి ఉంటుంది. ఇది డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, బీక్-స్టైల్ మడ్‌గార్డ్స్, షార్ప్-లుకింగ్ ఫ్రంట్ కౌల్ వంటి స్టైలింగ్ ఫీచర్లతో వస్తుంది. 2025 390 అడ్వెంచర్ కంటే ఈ అడ్వెంచర్ X మోడల్​లో అతిపెద్ద మార్పు ఏంటంటే దీనికి అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. దీని రోడ్-బయాస్డ్ లక్షణాన్ని హైలైట్ చేసేందుకు కంపెనీ ఈ మార్పు చేసింది.

ఇక ఇతర వేరియంట్‌ల మాదిరిగానే అడ్వెంచర్ X మోడల్​ కూడా 5-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎలక్ట్రానిక్స్ పరంగా అడ్వెంచర్ X వేరియంట్​లో క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ మోడ్స్ లేదా 390 అడ్వెంచర్ లాగా కార్నరింగ్ ABS లభించవు. కానీ దీనికి ఆఫ్-రోడ్ ABS లభిస్తుంది.

2025 KTM 390 Adventure X (Photo Credit- KTM India)

2025 KTM 390 అడ్వెంచర్ X హార్డ్‌వేర్:బైక్మెకానికల్స్ గురించి మాట్లాడుకుంటే అడ్వెంచర్ X వేరియంట్ రియర్ మోనోషాక్‌తో WP అపెక్స్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్ సెటప్​తో వస్తుంది. ఈ బైక్ రెండు చివర్లలో 200mm సస్పెన్షన్ ట్రావెల్‌ ఉంటుంది. అయితే ఇది 2025 KTM 390 అడ్వెంచర్ లాగా అడ్జస్టబుల్ చేయగలినది కాదు.

ఇక దీని బ్రేకింగ్ హార్డ్‌వేర్ విషయానికి వస్తే ఈ మోటార్‌సైకిల్‌లో 320 mm ఫ్రంట్ డిస్క్, 240 mm రియర్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఈ మోటార్ సైకిల్ సీటు ఎత్తు 825mm. ఇది స్టాండర్డ్ 390 అడ్వెంచర్ కంటే 10mm తక్కువ. ఈ 390 అడ్వెంచర్ X వేరియంట్ 19-అంగుళాల ఫ్రంట్ వీల్స్, 17-అంగుళాల రియర్ వీల్స్​ను కలిగి ఉంటుంది.

ధర:దేశీయ మార్కెట్​లో KTM 390 అడ్వెంచర్ సిరీస్ ధర విషయానికొస్తేప్రస్తుతానికి కంపెనీ ఈ వివరాలను వెల్లడించలేదు.

చాట్​జీపీటీ, డీప్​సీక్​కు పోటీగా ఇండియన్ ఏఐ మోడల్​!- అందుబాటులోకి ఎప్పుడంటే?

ఓలా జెన్-3 ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయోచ్- తక్కువ ధరలోనే 320 కి.మీ రేంజ్​!

సూపర్ అప్​గ్రేడ్స్​తో నథింగ్ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్!- ఫ్లిప్​కార్ట్​లో టీజర్ రిలీజ్

ABOUT THE AUTHOR

...view details