ETV Bharat / technology

చాట్​జీపీటీ, డీప్​సీక్​కు పోటీగా ఇండియన్ ఏఐ మోడల్​!- అందుబాటులోకి ఎప్పుడంటే? - INDIAN AI MODEL

ఈ ఏడాదిలోనే మనకూ ఏఐ మోడల్- కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

Ashwini Vaishnaw Said India to Develop Own AI Model LLM to Rival Chatgpt Deepseek
Ashwini Vaishnaw Said India to Develop Own AI Model LLM to Rival Chatgpt Deepseek (Photo Credit- Left - IANS Photo | Right - AP Photo)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 31, 2025, 4:47 PM IST

Indian AI Model: ప్రసుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఇప్పటికే అన్ని రంగాలకు వ్యాపించిన ఏఐ ప్రపంచ రూపురేఖలను మార్చేస్తోంది. ఈ క్రమంలోనే పుట్టుకొచ్చిన ఏఐ చాట్​బాట్ మోడల్స్​ సంచలనం సృష్టిస్తున్నాయి. వాటిలో అమెరికన్ కంపెనీ ఓపెన్ఏఐ తీసుకొచ్చిన చాట్​జీపీటీ నుంచి చైనీస్ కంపెనీ డీప్​సీక్​ తీసుకొచ్చిన ఆర్​1 ఏఐ చాట్​బాట్ మోడల్​ వరకు ట్రెండింగ్​లో కొనసాగుతున్నాయి. ఇవి యూజర్ అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకుని పూర్తి వివరాలతో చిటికెలో సమాధానాన్ని సిద్ధం చేసి అందించడంతో విస్తృతంగా వీటి వినియోగం పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో భారత్ కూడా తన సొంత సేఫ్ అండ్ సెక్యూర్ ఏఐ మోడల్​ను తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు రూ.10,370 కోట్ల ఇండియాఏఐ మిషన్ ప్రాజెక్టులో భాగంగా సొంత స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM)ను క్రియేట్ చేయండంపై ప్రణాళికలు ప్రకటించింది. వచ్చే ఆరు నెలల్లో దీన్ని సరసమైన ధరలో ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు.

18,693 GPUలను సరఫరా చేయనున్న 10 కంపెనీలు: ఈ ప్రాజెక్ట్​ కోసం ప్రభుత్వం ఇప్పటికే 10 కంపెనీలను కూడా సెలెక్ట్ చేసింది. ఈ సంస్థలు 18,693 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు లేదా GPUలను సరఫరా చేస్తాయి. ఈ GPUలు మెషిన్ లెర్నింగ్ టూల్స్‌ను డెవలప్ చేసేందుకు ఉపయోగించే హై-ఎండ్ చిప్స్​. ఇవి ఫౌండేషనల్ మోడల్స్​ను క్రియేట్ చేయడంలో సహాయపడతాయి.

ఇక ఇండియన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) కోసం భారత ప్రభుత్వం ఎంపిక చేసిన 10 కంపెనీలలో హీరానందాని గ్రూప్​నకు చెందిన యొట్టా, జియో ప్లాట్‌ఫారమ్స్, టాటా కమ్యూనికేషన్స్, E2E నెట్‌వర్క్​లు, CMS కంప్యూటర్స్, Ctrls డేటాసెంటర్స్, లోకుజ్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, NxtGen డేటాసెంటర్, ఓరియంట్ టెక్నాలజీస్, వెన్సిస్కో టెక్నాలజీస్ సంస్థలు ఉన్నాయి.

ఈ 10 కంపెనీలన్నీ కలిసి 18,693 GPUలను అందిస్తాయి. అయితే వీటిలో కేవలం యొట్టా కంపెనీ మాత్రమే​ 9,216 GPU యూనిట్లను అందించనుంది. అంటే ఈ ప్రాజెక్ట్​కు అవసరమైన మొత్తం 18,693 GPUలలో దాదాపు సగం వరకు యూనిట్లను యొట్టా కంపెనీ సప్లై చేయనుంది.

"గత 1.5 సంవత్సరాలుగా మా టీమ్స్.. స్టార్టప్స్, పరిశోధకులు మొదలైన వారితో చాలా దగ్గరగా పనిచేస్తున్నాయి. ఈ రోజు మేము మా సొంత ఫౌండేషనల్ మోడల్​ను నిర్మించాలని ప్రతిపాదించాము. ఈ మోడల్ ఇండియన్ కాంటెక్స్ట్, లాంగ్వేజెస్, కల్చర్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది." - అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి

దీంతోపాటు ఈ ఫౌండేషనల్ మోడల్​ను క్రియేట్ చేసేందుకు భారత ప్రభుత్వం ఎట్​లీస్ట్ 6 మంది డెవలపర్‌లతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన అన్నారు. నెక్స్ట్​ 4 నుంచి 8 నెల్లలో ఈ మోడల్ రెడీ కానుందని వెల్లడించారు. అంటే మరికొన్ని నెలల్లో మన దేశంలో కూడా ప్రపంచ స్థాయి ఫౌండేషనల్ మోడల్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇండియన్ ఏఐ LLMని సృష్టించడానికి ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు చేయనుంది? ఇందుకోసం ఏ డెవలపర్ కంపెనీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది? అనే వివరాలపై మాత్రం కేంద్ర మంత్రి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ 18,693 GPU యూనిట్లలో 10,000 GPUలు ఇన్‌స్టాల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన 8,693 GPUలు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.

కామన్ కంప్యూట్ ఫెసిలిటీ: మరోవైపు భారత ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో ఒక కామన్ కంప్యూట్ ఫెసిలిటీని ప్రారంభించనుంది. దీని నుంచి స్టార్టప్‌లు, పరిశోధకులు కంప్యూటింగ్ పవర్​ను ఉపయోగించుకోవచ్చు. అయితే వీటిలో హై-ఎండ్ GPU యూనిట్లను యాక్సెస్ చేసేందుకు గంటకు రూ.150 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక లో-ఎండ్ GPU యూనిట్లను యాక్సెస్ చేసేందుకు గంటకు రూ.115.85 ఖర్చు చేయాలి.

ఈ సర్వీసులపై భారత ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తోంది. ఈ సేవలు వినియోగించుకున్న యూజర్లకు చివరికి మొత్తం ఖర్చుపై 40% సబ్సిడీని అందించనుంది. దీంతో వారి వినియోగంలో గంటకు అయ్యే ఖర్చు ధర రూ.100 కంటే తక్కువగా ఉంటుంది.

"ప్రపంచవ్యాప్తంగా GPU యాక్సెస్ ధర గంటకు $2.5 నుంచి $3 (భారతీయ కరెన్సీలో రూ. 216.50 నుంచి రూ. 259.80) వరకు ఉంది. ఈ నేపథ్యంలో మన దేశంలో వినియోగదారులకు ఖర్చు తగ్గించేందుకు దీనిపై సబ్సిడీ అందిస్తున్నాము. ఈ సబ్సిడీ తర్వాత దీన్ని మేము గంటకు దాదాపు $1 చొప్పున అందిస్తున్నాము. అంటే గంటకు దాదాపుగా ఇది రూ.86.60లకే అందుబాటులోకి రానుంది." - అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి

ఓలా జెన్-3 ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయోచ్- తక్కువ ధరలోనే 320 కి.మీ రేంజ్​!

సూపర్ అప్​గ్రేడ్స్​తో నథింగ్ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్!- ఫ్లిప్​కార్ట్​లో టీజర్ రిలీజ్

డీప్​సీక్​తో మీ డేటా సేఫేనా?- దీన్ని వాడేముందు ఈ విషయాలు తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.