Sunita Williams Spacewalk Record : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో అత్యధిక సమయం స్పేస్‌వాక్ నిర్వహించిన వ్యోమగామిగా రికార్డు సాధించారు. ఇప్పటి వరకు అంతరిక్షంలో మెుత్తం 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించి రికార్డు సాధించారు. సునీతా విలియమ్స్, విల్మోర్లు ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా గతేడాది జూన్‌లో అంతరిక్షంలోకి వెళ్లగా సాంకేతిక సమస్యలు కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. తాజాగా గురువారం కేంద్రం నుంచి వెలుపలకు వచ్చిన ఆమె దాదాపు 5 గంటల 26 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 2012 నుంచి ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు స్పేస్‌వాక్ నిర్వహించిన సునీతా మెుత్తం 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉన్నారు. దీంతో నాసా మాజీ వ్యోమగామి పెగ్గి విట్సన్ పేరిట ఉన్న రికార్డును సునీతా తిరగరాశారు. పెగ్గి మెుత్తం 60 గంటల 21 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు.
సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డ్- ఏకంగా 62.6 గంటలపాటు స్పేస్‌వాక్! - SUNITA WILLIAMS SPACEWALK RECORD
స్పేస్‌వాక్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన సునీతా విలియమ్స్- ఇప్పటివరకు మెుత్తం 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్‌వాక్
Published : Jan 31, 2025, 6:48 PM IST