ETV Bharat / entertainment

అవకాశాల కోసం తండ్రిని అడగలేదు! - నిర్మాత తనయుడైనా రూ.500 కోసం పనిలోకి- ఇప్పుడు ఓ సూపర్​ స్టార్​గా​!​ - ACTOR WORKED FOR 500 REMUNERATION

స్వయం కృషితో ఎదిగిన నటుడు- రూ.500 నుంచి అత్యధిక పారితోషికం అందుకునే హీరోగా ఎదిగిన స్టార్- ఎవరంటే?

Actor Who Worked For Rs.500 Remuneration
Actor Who Worked For Rs.500 Remuneration (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2025, 6:24 PM IST

Actor Who Worked For Rs.500 Remuneration : సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలని ఉందని ఎవరైనా చెబితే, వెంటనే తెలిసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్న ఎదురవుతుంది. నాటి నుంచి నేటి వరకు ఇందులో ఏమార్పు రాలేదు. ఎందుకంటే సినిమా పరిశ్రమలో తెలిసిన వాళ్లుంటే అవకాశాలు సులువుగా దొరుకుతాయని కొందరి నమ్మకం. మరి సినిమాల్లో బాగా స్థిరపడిన కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే? ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

ఈ అవకాశం ఉండి కూడా ఓ వ్యక్తి స్వయం కృషినే నమ్ముకున్నారు. కెరీర్‌ ప్రారంభంలో రూ.500కి పని చేశారు. బట్టల దుకాణంలో పని చేశారు. అవసరాలు తీర్చుకోవడానికి అండర్‌-17, అండర్‌-19 జట్టులకు ప్రాతినిధ్యం వహించారు. కట్‌ చేస్తే కన్నడ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా రాణిస్తున్న టాప్‌ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా ఉన్నారు. లెక్కలేనన్ని అవార్డులు, ప్రశంసలు. కానీ ఇవన్నీ అంత సులువుగా దక్కలేదు. ఇంతకీ మనం మాట్లాడుకుంటోంది ఎవరి గురించో తెలుసా? కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌. జనసత్తా నివేదికలో పేర్కొన్న సుదీప్‌ జీవిత, సినీ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నటనలో శిక్షణ, ఆరంభ కాలంలో కష్టాలు
కిచ్చా సుదీప్‌ తండ్రి ఒక గౌరవప్రదమైన హోటల్ వ్యాపారి. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారారు. కానీ సుదీప్ ఎల్లప్పుడూ స్వయం కృషినే నమ్ముకున్నారు. తన తండ్రి నుంచి ఎప్పుడూ ఆర్థిక సహాయం తీసుకోలేదు. యాక్టింగ్‌ కలను నెరవేర్చుకోవడానికి కిచ్చా ముంబయిలోని రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో చేరాేరు. అక్కడ తన కెమెరా ఫియర్​ను అధిగమించేందుకు చాలా ప్రాక్టీస్ చేశారు.

చివరకు 1997లో 'తాయవ్వ' సినిమాతో కిచ్చా సినీ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత మరో రెండు సినిమాలు చేశారు. కానీ 2001లో విడుదలైన కన్నడ రొమాంటిక్ డ్రామా 'హుచ్చా'తో నటుడిగా బ్రేక్‌ వచ్చింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

ఇక సుదీప్ కేవలం నటుడిగానే కాదు, ఓ స్క్రీన్ రైటర్‌, నిర్మాత, డైరెక్టర్​, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా రాణించాడు. ముఖ్యంగా రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ హోస్ట్‌గా పాపులర్‌ అయ్యారు. 10 సీజన్‌లకు పైగా ఈ రోల్‌ పోషించారు. అయితే ప్రస్తుత సీజన్‌ తర్వాత హోస్ట్‌గా బాధ్యతల నుంచి తప్పుకుంటానని తాజాగా ప్రకటించారు.

ప్రభాస్​పై కిచ్చా సుదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్- డార్లింగ్ అలా ఉంటారట!

ఉపేంద్ర 'యూఐ'పై యశ్​, కిచ్చా సుదీప్ కామెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.