2025 Kawasaki Ninja 500 Launched: ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ కవాసకి ఇండియా తన '2025 కవాసకి నింజా 500' బైక్‌ను భారత మార్కెట్లో లాంఛ్ చేసింది. కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను రూ. 5.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో తీసుకొచ్చింది. కవాసకి ఈ మోటార్‌సైకిల్‌కు 2025 అప్‌డేట్‌గా కొత్త పెయింట్ జాబ్‌ను మాత్రమే ఇచ్చింది. అంతేకానీ దీనిలో మెకానికల్‌గా ఎలాంటి మార్పులూ చేయలేదు. మెకానికల్‌గా ఈ మోటార్ సైకిల్ పాత నింజా 500 ను మాదిగానే ఉంటుంది.
కవాసకి నింజా 500 డిజైన్: కవాసకి ఈ కొత్త మోడల్ బైక్‌కు న్యూ పెయింట్ జాబ్ మాత్రమే ఇచ్చింది. ఈ మోటార్ సైకిల్ ఫెయిరింగ్‌పై గ్రీన్ యాక్సెంట్‌ను అందించారు. పాత మోడల్‌తో పోలిస్తే ఈ బైక్‌లో ఈ తేడా మాత్రమే కన్పిస్తుంది. నింజా 500 అనేది నింజా 400 మోడల్‌కు సక్సెసర్.
2025 కవాసకి నింజా 500 ధర:కంపెనీ ఈ కొత్త నింజా 500 ధరను రూ.5,000 పెంచింది. మార్కెట్లో దీని ధర రూ.5.29 లక్షలు (ఎక్స్-షోరూమ్). కవాసకి 2024లో ఇయర్-ఎండ్ డిస్కౌంట్‌లో భాగంగా నింజా 500 బైక్‌పై రూ. 15,000 తగ్గింపును అందించింది. అయితే కొన్ని వారాల తర్వాత దీని ధరను రూ.5,000 పెంచుతూ ఇప్పుడు ఈ కొత్త 2025 మోడల్‌ను తీసుకొచ్చింది.
కవాసకి నింజా 500 పవర్‌ట్రెయిన్: నింజా 500 మోటార్ సైకిల్లో 44.3bhp పవర్, 42.6Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే అదే 451 cc, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌ను ఇప్పటికే ఎలిమినేటర్ 500 క్రూయిజర్‌తో పాటు కవాసకి ఇన్నోవేటివ్ నింజా 7 హైబ్రిడ్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించారు.