2024 BMW M340i Launched:వాహన ప్రియులకు గుడ్‌న్యూస్. మార్కెట్లోకి సరికొత్త లగ్జరీ కారు వచ్చింది. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ఇండియా తన అప్డేటెడ్ BMW M340i పెర్ఫార్మెన్స్ సెడాన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ప్రీవియస్ మోడల్ కారు లోపల, బయట కొన్ని మార్పులు చేసి ఆకర్షణీయమైన డిజైన్‌లో దీన్ని రూపొందించారు.
ఇందులో కొన్ని స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అందులో న్యూ పెయింట్ స్కీమ్స్ కావాలంటే రూ. 5.7 లక్షల కంటే ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. LCI అప్‌డేట్ తీసుకొచ్చిన ఈ ఛేంజెస్ 2 సంవత్సరాల క్రితం కంపెనీ తీసుకొచ్చిన కారుమాదిరిగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం తీసుకొచ్చిన కారు చుట్టూ సటిల్ బ్లాక్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంతేకాక హెడ్‌ల్యాంప్స్‌లో M లైట్ షాడోలైన్ ఫినిష్ ఉంటుంది. వీటితో పాటు కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో 19-అంగుళాల జెట్-బ్లాక్ అల్లాయ్ వీల్స్ (995M)తో ఈ కారు వస్తుంది.
దీని పాత మోడల్లో ఉండే షార్పర్ బంపర్ డిజైన్, బ్లాక్ మెష్ కిడ్నీ గ్రిల్, డ్యూయల్-ఎగ్జాస్ట్ టిప్స్, బ్లాక్-అవుట్ ORVMలు వంటి అగ్రెస్సివ్ పార్ట్స్ BMW M340iలో అలానే ఉంచారు. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే దీని వెర్నాస్కా లెదర్ అప్హోల్స్టరీని ఛేంజ్ చేశారు. ఇది పూర్తిగా బ్లాక్ కలర్లో ఉంది. కాంట్రాస్ట్ M హైలైట్‌లను కలిగి ఉంది.
ఈ కారులో కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఇది మొట్టమొదటిసారిగా BMW M340iతో తీసుకొచ్చారు. అంతేకాక ఈసారి సరికొత్త OS8.5 ఆపరేటింగ్ ఇంటర్‌ఫేస్‌తో దీన్ని అప్‌డేట్ చేశారు. ఇందులో మరో చిన్న మార్పు ఏంటంటే.. స్టీరింగ్ వీల్‌పై రెడ్ సెంటర్ మార్కర్ ఉంటుంది. సాధారణంగా ఇది BMW M కార్లలో కనిపిస్తుంది. ఈ కారు అప్‌డేట్‌లో భాగంగా M హై గ్లోస్ షాడోలైన్, ఇండివిడ్యువల్ హెడ్‌లైనర్ ఆంత్రాసైట్, ఇంటీరియర్ ట్రిమ్‌ను కార్బన్ ఫైబర్ ఫినిష్‌తో తీసుకొచ్చారు.