Maths Teacher Who got 7 Govt Jobs : ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టసాధ్యం. అలాంటిది ఏకంగా ఏడు సర్కారీ కొలువులు సాధించాడు ఓ యువకుడు. సాధారణ మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆ యువకుడు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మొక్కవోని ధీక్షతో చదివాడు. టీచర్‌గా ఉద్యోగం సాధించాడు. అంతటితో ఆగకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఏడు ప్రభుత్వ కొలువులను సొంతం చేసుకున్నాడు. విద్యాభ్యాసంలో కష్టపడితే సాధించలేని ఉద్యోగం అంటూ ఉండదు అని నిరూపించాడు. ప్రస్తుత యువతకు అతడి జీవితం ఆదర్శప్రాయం.
పేదరికం వెంటాడుతున్నా :మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం వీరోజిపల్లి తండా గ్రామానికి చెందిన డేదాగత్ రాందాస్ ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలకు సెలక్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే వీరోజిపల్లి తండాకు చెందిన డేగావత్ చక్య్రా, మీరాబాయి దంపతులకు ఐదుగురు కుమారులు. వ్యవసాయమే ఆ కుటుంబానికి జీవనాధారం. నాలుగో సంతానమైన రాందాస్ ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివారుడాలో ప్రాథమిక, ఉత్తులూరు, సిద్దిపేట, పెద్దశంకరంపేట, సంగారెడ్డిలో ఉన్నత పాఠశాల, కళాశాల విద్యాభ్యాసం పూర్తి చేసి డిగ్రీ పట్టా అందుకున్నారు.
కోచింగ్ లేకుండా ఏడు ఉద్యోగాలు సాధించి :టీచర్ వృత్తిలో రాణించాలనే లక్ష్యంతో డీఈడీ, బీఈడీని అభ్యసించారు. వరుసగా ఏడబ్ల్యుఈఎస్, ఎన్‌ఆర్‌ఈఐఎస్, జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ పాఠశాలలో టీజీటీ ఉద్యోగాలను మ్యాథ్స్ సబ్జెక్టులో సాధించారు. గ్రూప్-4 ఉద్యోగానికి కూడా ఎంపికయ్యారు. ఇటీవల డీఎస్సీలో సత్తాచాటి ఎస్జీటీలో జిల్లాలో 11వ ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ గణితంలో 6వ ర్యాంకు, హాస్టల్ వార్డెన్ ఫలితాల్లో జోన్-3లో కేటగిరి మొదటి ర్యాంకు సాధించారు.