తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడున్నరేళ్ల చిన్నారిపై సమీప బంధువైన యువకుడి హత్యాచారం! - శవాన్ని పూడ్చేసి ఏమీ తెలియనట్లు! - GIRL RAPED AND MURDER IN AP

అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారిపై దుర్మార్గుడు కర్కశం - పొలంలోకి తీసుకెళ్లి హత్యాచారం - ఏపీలోని తిరుపతి జిల్లాలో జరిగిన ఘటన

3 Years Girl Raped and Murder in Tirupati
3 Years Girl Raped and Murder in Tirupati (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2024, 7:22 AM IST

3 Years Girl Raped and Murder in Tirupati : ఈ మధ్యకాలంలో ఆడ పిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆడవాళ్లు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం కామాంధులు వదిలిపెట్టడం లేదు. తాజాగా మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసి ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేశాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా వడమాటపేట మండలంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మండలానికి చెందిన ఓ గ్రామంలో ఓ యువకుడు తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఓ దుకాణం వద్ద తినుబండారాలు కొనిచ్చాడు. అక్కడి నుంచి సమీప పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం బాలికను చంపేసి ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పూడ్చేశాడు. రాత్రి అవుతున్నా పాప ఇంకా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. అయినా సరే ఆచూకీ లభించకపోవడంతో వడమాలపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే బంధువైన యువకుడిపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని అతడు ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

అవమాన భారంతో మహిళ పురుగులు తాగి ఆత్మహత్యాయత్నం :మరోవైపు తెలంగాణలో ఓ వివాహితపై ఓ పార్టీ నాయకుడు లైంగిక దాడికి పాల్పడగా, ఆమె అవమాన భారంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్​ గ్రామశాఖ అధ్యక్షుడు గంటా కృష్ణ గత అక్టోబరు 21న అదే గ్రామానికి చెందిన ఓ ఎస్టీ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అవమాన భారంతో కుంగిపోయిన మహిళ అదే రోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

వెంటనే కుటుంబ సభ్యులు సూర్యాపేటలోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన నిందితుడు సైతం పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ప్రస్తుతం అతను కోలుకోగా, మహిళ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. మహిళ మామ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసును నమోదు చేసుకున్నారు.

సిద్దిపేట జిల్లాలో అమానుష ఘటన - మైనర్ బాలికపై యువకుల సామూహిక అత్యాచారం

నిజామాబాద్​లో కామాంధుల అకృత్యం - మహిళపై సామూహిక అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details