తెలంగాణ

telangana

ETV Bharat / state

‘విక్టరీ అవర్‌’ అంటే మీకు తెలుసా? - లేదంటే ఇది చదవండి - WHAT IS VICTORY HOUR

వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతున్న ది ఫైవ్‌ ఏఎమ్‌ క్లబ్ బుక్​ - రోజూ ఉదయాన్ని ఎంత క్రమబద్ధంగా వినియోగించుకోవాలో చెప్పిన రాబిన్​ శర్మ

ROBIN SHARMA
THE FIVE AM CLUB BOOK (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2024, 10:49 PM IST

Robin Sharma The Five AM Club Book : రాబిన్‌ శర్మ రచించిన ‘ది ఫైవ్‌ ఏఎమ్‌ క్లబ్‌’ వ్యక్తిత్వ వికాసంలో విశేషంగా గొప్ప మార్పులు తీసుకురావడంలో ఉపయోగపడుతుంది. నిత్యం ఉదయం పూట సమయాన్ని ప్రణాళిక ప్రకారం ఎలా వినియోగించుకోవాలో, ఆ దిశగా ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఈ పుస్తకం వివరిస్తుంది. ఇది విద్యార్థులకూ, కెరియర్​ ప్రారంభ దశలో సమస్యలు ఎదుర్కొంటున్న యువతకూ ఎంతో ఉపయోగపడగలదు.

ఉదయాన్నే 5 గంటలకు మేలుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ సమయాన్ని జీవితంలో విజయానికి అవసరమయ్యే ‘విక్టరీ అవర్‌’ అంటారు రచయిత రాబిన్ శర్మ. ఆయన సూచన ప్రకారం ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ముందు ప్రణాళికతో 20 నిమిషాల చొప్పున మూడు భాగాలుగా చేసుకోవాలి.

వ్యాయామం, యోగా :శారీరక శక్తి పెంపు, మెదడు పనితీరులో చురకుదనానికి వ్యాయామం ముఖ్యం. ఇది బ్లెడ్​ ప్రెజర్​ను మెరుగుపరచడమే కాకుండా ప్రస్తుత జీవన శైలిలో ఎంతో శక్తిని సమకూరుస్తుంది. రోజులో లేవగానే మొట్ట మొదటి పనిగా ఎక్సర్​సైజ్​తో పాటు యోగా చేస్తే ఆ రోజంతా చురుగ్గా కదలవచ్చు.ధ్యానం, కృతజ్ఞతా భావన, వ్యక్తిగత లక్ష్యాలను ఆలోచించి పరిమితిలో విశ్లేషణలు చేసకోవడం కూడా మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. ఈ ఆత్మ చింతన కారణంగా స్థిరంగా పనులను చకచకా చేసుకోవచ్చు.

నేర్చుకునే సమయం : ఏదైనా కొత్త విషయం నేర్చుకునేందుకు సూర్యకిరణాలు భూమి మీద పడే సమయాన్ని అమృత కాలంగా చెప్పవచ్చు. ధ్యానం చేశాక ఏదైనా కొత్తది నేర్చుకునేందుకు 20 నిమిషాలు కచ్చితంగా కేటాయించాలి. కొత్త భాష నేర్చుకోవటం, కథలు రాయడం, మ్యూజిక్​ ట్యూన్స్​ ప్రాక్టిస్​, జనరల్​ నాలెడ్జ్​ పుస్తకాలు చదవటం లాంటివి చేయవచ్చు. కొత్త విషయాలు నేర్చుకుంటే ఆలోచనలు మెరుగవటమే కాక, భవిష్యత్తులో నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా స్కిల్స్​ను నేర్చుకోవచ్చు.

విద్యార్థుల కోసం

క్రమశిక్షణ :ఉదయం 5 గంటలకు లేవడమనేది మానవుడి క్రమశిక్షణకు దారి చూపుతుంది. విద్యార్థులు రోజును సక్రమంగా ప్రారంభించగలిగితే రోజంతా చురుకుదనంతో చాలా యాక్టివ్​గా ఉంటారు.

పరీక్షల ఉన్నప్పుడు : ఈ సమయంలో విద్యార్థుల మెదడు అనవసరపు ఆలోచనలు లేకుండా ఉండటం వల్ల ప్రాతఃకాలం చదువుకున్న విషయాలు ఎక్కువ రోజులు గుర్తుంటాయి. రివిజన్​ చేసేటప్పుడు సులువై పరీక్షల్లో ఉత్తమమైన మార్కులు తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది.

సృజనాత్మకత :ఉదయం పూట మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉండటంతో సృజనాత్మక ఆలోచనలు కలగడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరొచ్చు. విద్యార్థులు తమకు ఇంట్రెస్ట్​ ఉన్న ప్రాజెక్టులు, ఎస్సే రైటింగ్స్​, రిసెర్చ్​లపై​ పని చేయవచ్చు.

కెరియర్‌ ప్రారంభంలో

  • లక్ష్యం పై గురి :కెరియర్​ ఆరంభ దశలో ఉన్న యువత ముందుగానే లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. పొద్దున సమయాన్ని వారి ప్రాధాన్యాలకు తగ్గట్టుగా ఉపయోగించుకుంటే గెలుపునకు మార్గం సుగమమవుతుంది.
  • ఉత్సాహం డబుల్ :ఈ పద్ధతిలో వ్యాయామం, ధ్యానం, నేర్చుకోవడం అనేవి యువతి, యువకులలో ఉత్సాహాన్నీ, ధైర్యాన్నీ చాలా పెంచుతాయి.
  • కొత్తగా ఆలోచించగలగడం :సెల్ఫ్​ కాన్ఫిడెన్స్​ను పెంచుకుంటే చేసే ప్రతి పనిలో కొత్త ఆలోచనలను అమలు చేయవచ్చు. ఇది ప్రత్యేకించి కొత్త టెక్నాలజీ, స్కిల్స్​ను నేర్చుకోవడంలో ఉపయోగపడుతుంది.

పుస్తకంలోని ముఖ్య సూత్రాలు

మనిషిలోని నాలుగు రాజ్యాలు

మనసు: ఆలోచనలను బలంగా కట్టుదిట్టంగా అదుపులో ఉంచుకోవడం.

హృదయం: కృతజ్ఞతాభావం, ప్రేమ, ఆత్మాభిమానాలను పెంపొందించడం.

ఆరోగ్యం:శారీరక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవడం.

ఆత్మ:ఆధ్యాత్మికత, ఎథిక్స్​ను డెవలప్​ చేసుకోవడం.

అలవాట్లను అలవర్చుకునే ప్రధాన సంఖ్య 21

మూడున్నర వారాల(21 రోజులు) వ్యవధిలో ఏదైనా అలవాటు చేసుకోవడం అవుతుందని రచయిత రాబిన్‌ శర్మ తన పుస్తకంలో వివరించారు. ఈ ప్రక్రియలో మూడు స్టెప్స్​ ఉన్నాయి.

మొదటిదశ - పాత అలవాట్లతో ఇబ్బందులు :ఈ దశలో కొత్త అలవాటును అమలు చేయడంలో తొలుత కష్టాలు ఎదుర్కొంటారు.

మధ్యదశ - కొత్తది అలవాటు చేసుకోవడం: దీనికి నిరంతర పట్టుదల, కృషి అవసరమవుతాయి.

చివరిదశ - జీవితంలో భాగం :కొత్త అలవాటు పూర్తిగా జీవితంలో మీ భాగం అవుతుంది.

జీవితంలో పెద్ద మార్పులు చూడాలనుకుంటే ఫైవ్​ ఏఎమ్‌ క్లబ్‌ పుస్తకం నుంచి స్ఫూర్తి పొందవచ్చు. ప్రతి రోజు క్రమశిక్షణతో ప్రారంభమైతే ఆ రోజంతా సక్సస్​ఫుల్​ అవుతుందని ఈ పుస్తకం చెబుతుంది. ముందు ప్రణాళికలు చిన్నచిన్న లక్ష్యాలను చేరుకునే దారులను ఏర్పరుస్తాయి. ఉదయం లేచినంత మాత్రాన జీవితంలో గొప్ప గొప్ప మార్పులు రావు. ఆ సమయంలో రోజంతా, తద్వారా మిగతా జీవితమంతా మెరుగ్గా ఉండేందుకు అడుగులేస్తేనే లక్ష్య సాధన పూర్తవుతుంది. మార్పునకు ప్రారంభం మనం ఉదయం ఐదింటికి లేవడమే తొలిమెట్టు అవుతుంది!

-రహ్మాన్‌ ఖీ సంపత్‌

బ్రెయిన్ షార్ప్​గా పనిచేయలా? ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే జెట్ స్పీడ్​తో దూసుకెళ్తుంది!

వ్యాయామం అంటేనే చిరాకు వస్తుందా? ఈ చిట్కాలు పాటిస్తే రోజూ ఈజీగా చేసేస్తారు!

ABOUT THE AUTHOR

...view details