Yasangi Cultivation in Telangana :రాష్ట్రంలో యాసంగి (Yasangi Sagu)వ్యవసాయ పంటల సాగు సరళి జోరుగా సాగుతోంది. ఈ ఏడాది రబీ సీజన్‌లో దాదాపు అన్ని రకాల పంటలు లక్ష్యాలకు అనుగుణంగా సాగయ్యాయి. వాతావరణం ఆశాజనంగా ఉండటం, నీటి వనరులు అందుబాటులో ఉన్నందున సాగుకు ఢోకా లేదని వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేశాయి. తెలంగాణలో సాధారణ సాగు విస్తీర్ణం 54,93,444లు ఎకరాలు నిర్దేశించగా ఇప్పటి వరకు ఏకంగా 60,88,000ల ఎకరాల్లో పంటలు సాగువుతున్నాయి.
వ్యవసాయ శాఖ అంచనాలకు భిన్నంగా అనూహ్యంగా 110 శాతం మేర పంటలు సాగవుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నందున ఆయకట్టు పెరిగింది. ప్రధాన ఆహార పంట వరి సాధారణ సాగు విస్తీర్ణం 40,50,000ల ఎకరాలు నిర్దేశించగా ఇప్పటికి 46,28,000ల ఎకరాల్లో సాగవుతోంది. అనూహ్యంగా 5 లక్షల ఎకరాలుపైనే రైతులు వరి వేశారు. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 5,11,000ల ఎకరాలు కాగా ప్రస్తుతానికి 8,04,000ల ఎకరాల్లో సాగవుతోంది.
రైతులకు గుడ్న్యూస్ - ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్
Yasangi Sagu in Telangana :జొన్న ఊహించనిరీతిలో రెట్టింపు సాగు చేశారు. శనగ 3,38,000ల ఎకరాలు అనుకుంటే ఇప్పటి దాకా 2,55,000ల ఎకరాల్లో సాగవుతూ వెనకబడిపోయింది. వేరుశనగ సైతం అనుకున్న లక్ష్యం సాధించలేక చతికిలపడిపోయింది. ఆరుతడి పంటలైన నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ, ఇతర నూనెగింజల పంటలు ఆశాజనంగా సాగుతున్నాయని వ్యవసాయ శాఖ నివేదిక చెబుతోంది.